viswakanth ankireddy
-
ఇన్ఫోసిస్ నాకు మద్దతుగా నిలిచింది: విశ్వకాంత్
కష్టకాలంలో తనకు అన్ని వర్గాల నుంచి చక్కటి మద్దతు లభించిందని ఆస్ట్రేలియాలో తీవ్రవాది చేతుల్లోంచి క్షేమంగా బయటపడిన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజీనర్ అంకిరెడ్డి విశ్వకాంత్ చెప్పారు. ప్రధానంగా తన కంపెనీ.. ఇన్ఫోసిస్ యాజమాన్యం తనకు మద్దతుగా నిలిచిందన్నారు. స్నేహితులు, సన్నిహితులు, ఆస్ట్రేలియా ప్రజలు, భారత ప్రభుత్వం నుంచి చక్కటి మద్దతు లభించిందని తెలిపారు. జరిగిన ఘటన నుంచి ఇప్పుడిప్పుడే తాను కోలుకుంటున్నట్లు చెప్పారు. తాను క్షేమంగా బయటపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు కోరుకున్నారని, అందుకు వారందరికీ కృతజ్ఞతలని విశ్వకాంత్ అన్నారు. భారత ప్రధాని కార్యాలయానికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయితే.. ప్రస్తుతానికి తనకు, తన కుటుంబానికి కొంత వెసులుబాటు ఇవ్వాలని మాత్రం మీడియాను విశ్వకాంత్ కోరారు. -
క్షేమంగా బయటపడ్డ విశ్వకాంత్
-
'ఎప్పుడు మాట్లాడదామా అని చూస్తున్నా'
గుంటూరు: ఆస్ట్రేలియాలోని సిడ్నీ కిడ్నాప్ ఉదంతం నుంచి తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విశ్వకాంత్ అంకిరెడ్డి సురక్షితంగా బయపడడంతో ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వార్తా చానళ్లలో ప్రసారమైన దృశ్యాలు చూసి తమ కుమారుడిని విశ్వకాంత్ తల్లిదండ్రులు పోల్చుకున్నారు. సాయుధ బలగాల సాయంతో సిడ్నీ కేఫ్ నుంచి విశ్వకాంత్ బయటకు వస్తున్న దృశ్యాలు చూసి ఊపిరి పీల్చుకున్నారు. తమ కుమారుడు సురక్షితంగా బయపడతాడన్న నమ్మకం తనకుందని విశ్వకాంత్ తండ్రి 'సాక్షి' టీవీతో చెప్పారు. తన కుమారుడికి ధైర్యం ఎక్కువేనని వెల్లడించారు. తన కుమారుడితో ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తున్నట్టు విశ్వకాంత్ తల్లి చెప్పారు. సిడ్నీలో ఉన్న కోడలితో మాట్లాడినట్టు తెలిపారు. తమ కుమారుడితో పాటు బందీలను విడిపించిన సిడ్నీ పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. విశ్వకాంత్ క్షేమంగా బయటపడడంతో అతడి తరపు బంధువులు హర్షం వ్యక్తం చేశారు.