Warangal District News
-
అలర్ట్.. అలర్ట్
● రెండేళ్ల తర్వాత సరిహద్దుల్లో మళ్లీ అలజడి.. ● ఇన్ఫార్మర్ పేరిట హత్యలు.. మృతుల కుటుంబాలకు న్యాయం చేయండి ● మృతదేహాలతో ఆదివాసీ సంఘాలు, గిరిజనుల రాస్తారోకో, ధర్నా ● నెల రోజుల్లో న్యాయం చేస్తామని పోలీసుల హామీఅమాయకులను చంపారు.. ● పౌర హక్కుల సంఘాలు స్పందించాలి ● ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ – 8లోu -
కేయూలో విజిలెన్స్ అధికారుల విచారణ
కేయూ క్యాంపస్: కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్ రమేశ్ హయాంలో వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా విజిలెన్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ రాకేశ్ బృందం శుక్రవారం యూనివర్సిటీలో విచారణ జరిపింది. వీసీ చాంబర్లో వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి, కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి సమక్షంలో విజిలెన్స్ అధికారులు పలు విషయాలపై సమాచారం తెలుసుకున్నారు. ప్రధానంగా 2021–22 పీహెచ్డీ అడ్మిషన్లకు సంబంధించిన సమాచారాన్ని అడిగినట్లు తెలిసింది. పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరి గాయనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పీహెచ్డీ అడ్మిషన్లకు సంబంధించిన సీట్మాట్రిక్స్ గురించి అడిగినట్లు సమాచారం. పీహెచ్డీ అడ్మిషన్లకు సంబంధించి వివిధ విభాగాల డీన్లను కూడా వీసీ, రిజిస్ట్రార్లు వీసీ చాంబర్‌కు పిలిపించారు. అందుబాటులో ఉన్న డీన్లు కూడా వచ్చారు. విజిలెన్స్ అధికారులు అడిగిన పీహెచ్డీ అడ్మిషన్లపై వారు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అయితే వారు అడిగిన డాక్యుమెంట్లు కూడా ఇవ్వాల్సి ఉందని సమాచారం. అడ్జెంట్ ఫాక్యల్టీ నియామకాలపై కూడా సమాచారం అడిగినట్లు తెలిసింది. విజిలెన్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇతర అంశాలపై కూడా అడిగిన విషయాలపై సంబంధిత సెక్షన్ అధికారుల నుంచి వివరాలు అడిగినట్లు తెలిసింది. కాగా.. శనివారం వివిధ విభాగాల డీన్లతో వీసీ సమావేశం కానున్నారు. పీహెచ్డీ అడ్మిషన్ల డాక్యుమెంట్లు తీసుకురావాలని ఆదేశించారు. భద్రకాళి చెరువు మట్టి విక్రయంవరంగల్ అర్బన్: భద్రకాళి చెరువులో పూడికతీత మట్టిని ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం విక్రయిస్తున్నట్లు ఇరిగేషన్ ఈఈ బి.సీతారాం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక ఘణపు మీటరుకు రూ.144 చెల్లించి మట్టి కావాల్సిన వాళ్లు కొనుగోలు చేయాలని కోరారు. ఇతర వివరాల కోసం హనుమకొండ నక్కలగుట్ట బల్దియా ఇంజనీరింగ్ కార్యాలయంలో ఈనెల 30వ తేదీలోగా సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాల కోసం 90001 72854 మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయాలని ఈఈ సీతారాం సూచించారు. -
లేఖల్లో ఏం పేర్కొన్నారంటే..
ఇద్దరిని చంపిన స్థలంలో కార్యదర్శి శాంత, భారత కమ్యూనిస్టు పార్టీ పేరిట మావోయిస్టులు రెండు లేఖలను వదిలివెళ్లారు. ఆ లేఖల్లో.. ‘ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఉయికె రమేశ్, ఉయికె అర్జున్ పోలీస్ ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నారు. గుట్టలపై ఉన్నప్పుడు పార్టీ కదలికలను వారి అనుచరుల ద్వారా ఎప్పటికప్పుడు పసిగడుతూ పోలీసులకు సమాచారం ఇచ్చేవారు. క్రమంగా ఎస్ఐబీ కంట్రోల్‌కి వెళ్లి పనిచేస్తూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బార్డర్లో ఉన్న గ్రామాలైన లంకపెల్లి, జన్నపు, ఊట్ల, శ్యామల దొడ్డి, వాయిపేటలతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో బంధువులు, స్నేహితుల ద్వారా సమాచారం సేకరించి పోలీసులకు చెప్పేవారు. మావోయిస్టులపై కొన్ని దాడులకు కారకులయ్యారు. ఆతర్వాత ఉద్యోగం వచ్చి వాజేడు మండలంలో ఉంటున్నారు. చేపల వేట, పశువుల మేతకోసమని అడవిలోకి వచ్చి సమాచారం సేకరి స్తూ పోలీసులకు చేరవేస్తున్నారు. పెనుగోలు గ్రామస్తులు గుట్టపై ఉండొద్దని ఒత్తిడి చేసి దింపారు. పద్ధతులు మార్చుకోవాలని చెప్పినప్పటికీ వినలేదు. అందుకే రమేశ్, అర్జున్ను ఖతం చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు. -
26న ‘ఇందిరా మహిళాశక్తి–ఉపాధి భరోసా’
వరంగల్: ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ఈనెల 26న ఇందిరా మహిళాశక్తి–ఉపాధి భరోసా కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో డీఆర్డీఓ కౌసల్యాదేవి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరా మహిళాశక్తి, ఉపాధి భరోసాలో భాగంగా 2025 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల క్యాలెండర్‌ను రూపొందించాలన్నారు. పంచాయతీరాజ్ నిధుల నుంచి, జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని చెప్పారు. నిధులు దుర్వినియోగం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మండలాలు, గ్రామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఏ గ్రామానికి ఏమి అవసరమో గుర్తించి ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు చేపట్టాలని ఎంపీడీఓలు, ఏపీఓలకు సూచించారు. ప్రతి గ్రామం గంగదేవిపల్లిలా రూపుదిద్దుకునేలా ఉపాధి హామీ పనులు చేస్తే హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన జిల్లాగా వరంగల్ గుర్తింపు పొందుతుందని కలెక్టర్ అన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, జిల్లా ప్రణాళిక అధికారి గోవిందరాజన్, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు కార్యాచరణ రూపొందించాలి మామునూరు ఎయిర్పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు, గ్రీన్‌ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్‌న్స్ హాలులో మామునూరు ఎయిర్‌పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి జిల్లాను సందర్శించిన అనంతరం వెలువడిన జీఓ లకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమీక్షలో ఇన్చార్జ్ డీఆర్వో, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్లు నాగేశ్వర్రావు, ఇక్బాల్, రాజ్‌కుమార్, ఆర్అండ్బీ ఈఈ జితేందర్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఈ రామకృష్ణ, నేషనల్ హైవే అధికారి సల్మాన్‌రాజ్, జోనల్ మేనేజర్ రాములునాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 2025 ఉపాధి హామీ క్యాలెండర్ రూపొందించాలి గ్రామాల్లో అవసరమైన పనులు గుర్తించాలి అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద -
జెడ్పీ సీఈఓ రాంరెడ్డికి సన్మానం
అయ్యప్ప ఆలయంలో దివ్య పడిపూజనర్సంపేట: పట్టణంలోని శ్రీధర్మశాస్తా అయ్యప్ప ఆలయంలో అర్చకుడు దేవేశ్మిశ్రా ఆధ్వర్యంలో స్వాములు శుక్రవారం దివ్య పడిపూజ నిర్వహించారు. అనిల్‌కుమార్–ఇందు, బాదం ప్రవీణ్‌కుమార్–లక్ష్మి, రంజిత్‌కుమార్–శ్రావణి, ఆగయ్య, అడ్డగట్ల చంద్రమౌళి–పద్మ అయ్యప్పస్వాములకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్‌గుప్తా మాట్లాడుతూ మండల పూజ మహోత్సవంలో అన్నదాతలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శబరిమలకు వెళ్లే భక్తులు, స్వాముల కోసం నర్సంపేట ఆర్టీసీ డిపో నుంచి బస్సు సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు సైఫ సురేశ్, కార్యదర్శి చింతల కమలాకర్‌రెడ్డి, కోశాధికారి దొడ్డ రవీందర్, మాదారపు చంద్రశేఖర్, శ్రీరాం ఈశ్వరయ్య, వరంగల్, హనుమకొండ, ములుగు రైస్ మిల్లర్స్ దేవునూరి అంజయ్య, ఇరుకు కోటేశ్వర్రావు, బండారి దామోదర్, బాదం ప్రవీణ్‌కుమార్, భూపతి లక్ష్మీనారాయణ, రాజశేఖర్, బండారుపల్లి చెంచారావు, శ్రీరాం కిరణ్, పాలకుర్తి శ్రీనివాస్, వజినపల్లి శ్రీను, అనంతుల ఆము, శ్రీరాముల శంకరయ్య, దొడ్డ వేణు, మల్యాల రాజు, ప్రవీణ్, శ్రీరాముల కార్తీక్, భరత్ పాల్గొన్నారు. -
నేటి స్పెషల్ గ్రీవెన్స్ రద్దు
వరంగల్: దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రతినెల నాలుగో శనివారం కలెక్టరేట్లో నిర్వహించే స్పెషల్ గ్రీవెన్స్‌ను కలెక్టర్ ఆదేశాల మేరకు రద్దు చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి రాజమణి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు గమనించి కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె కోరారు. వీల్‌చైర్ క్రికెట్లో రాంజీ ప్రతిభ వరంగల్ స్పోర్ట్స్: ఒడిశాలోని భద్రక్‌లో ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి వీల్‌చైర్ క్రికెట్ ఉత్కల్ ట్రోఫీ టోర్నమెంట్లో వరంగల్‌కు చెందిన గుగులోత్ రాంజీనాయక్ ప్రతిభ కనబరిచాడు. తెలంగాణ దివ్యాంగ్ వీల్‌చైర్ క్రికెట్ టీం నుంచి జాతీయ స్థాయిలో పాల్గొన్న రాంజీనాయక్.. మూడు రోజుల పాటు జరిగిన టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ జట్లతో తలపడి క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి చవిచూశాడు. తెలంగాణ జట్టు నుంచి పాల్గొన్న రాంజీనాయక్ను పలువురు అభినందించారు. భద్రకాళి చెరువు మట్టి విక్రయం వరంగల్ అర్బన్: భద్రకాళి చెరువులో పూడికతీత మట్టిని ప్రభుత్వ ధర ప్రకారం విక్రయిస్తున్నట్లు ఇరిగేషన్ ఈఈ బి.సీతారాం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక ఘనపు మీటరుకు రూ.144 చెల్లించి మట్టి కావాల్సిన వాళ్లు కొనుగోలు చేయాలని కోరారు. ఇతర వివరాల కోసం హనుమకొండ నక్కలగుట్ట బల్దియా ఇంజనీరింగ్ కార్యాలయంలో ఈనెల 30లోగా సంప్రదించాలని, ఇతర వివరాల కోసం 90001 72854 మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. గురుకులం ఆకస్మిక తనిఖీ న్యూశాయంపేట: హనుమకొండలోని కేయూ క్రాస్ రోడ్డులో ఉన్న వరంగల్ (జీ–1) బాలికల గురుకులాన్ని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులంలోని కిచెన్‌లో నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూను ప్రిన్సిపాల్ కృష్ణకుమారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజయపాల్‌రెడ్డి, డీటీఈఓ రాజు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య నెక్కొండ: కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గొల్లపల్లి శివారు మూడు తండాలో జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్యా కమలమ్మ–చందు పెద్ద కుమారుడు సుమన్ (21) ఇటీవల ఐటీఐ పూర్తి చేశాడు. పెళ్లికి సంబంధించిన విషయంలో తల్లిదండ్రులతో జరిగిన గొడవతో సుమన్ మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఈ నెల 21న రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు వేలాడుతున్న కుమారుడిని చూసిన తల్లిదండ్రులు కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందాడని ఎస్సై పేర్కొన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కేయూలో విజిలెన్స్ అధికారుల విచారణ కేయూ క్యాంపస్: కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్ రమేశ్ హయాంలో వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా విజిలెన్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ రాకేశ్ బృందం శుక్రవారం యూనివర్సిటీలో విచారణ జరిపింది. వీసీ చాంబర్లో వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి, కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి సమక్షంలో విజిలెన్స్ అధికారులు పలు విషయాలపై సమాచారం తెలుసుకున్నారు. ప్రధానంగా 2021–22 పీహెచ్డీ అడ్మిషన్లకు సంబంధించిన సమాచారాన్ని అడిగినట్లు తెలిసింది. పీహెచ్డీ అడ్మిషన్లలో అవతకవలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పీహెచ్డీ అడ్మిషన్లకు సంబంధించిన సీట్మాట్రిక్స్ గురించి అడిగినట్లు సమాచారం. పీహెచ్డీ అడ్మిషన్లకు సంబంధించి వివిధ విభాగాల డీన్లను కూడా వీసీ, రిజిస్ట్రార్లు వీసీ చాంబర్‌కు పిలిపించారు. అందుబాటులో ఉన్న డీన్లు కూడా వచ్చారు. -
లేఖల్లో ఏం పేర్కొన్నారంటే..
ఇద్దరిని చంపిన స్థలంలో కార్యదర్శి శాంత, భారత కమ్యూనిస్టు పార్టీ పేరిట మావోయిస్టులు రెండు లేఖలను వదిలివెళ్లారు. ఆ లేఖల్లో.. ‘ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఉయికె రమేశ్, ఉయికె అర్జున్ పోలీస్ ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నారు. గుట్టలపై ఉన్నప్పుడు పార్టీ కదలికలను వారి అనుచరుల ద్వారా ఎప్పటికప్పుడు పసిగడుతూ పోలీసులకు సమాచారం ఇచ్చేవారు. క్రమంగా ఎస్ఐబీ కంట్రోల్‌కి వెళ్లి పనిచేస్తూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బార్డర్లో ఉన్న గ్రామాలైన లంకపెల్లి, జన్నపు, ఊట్ల, శ్యామల దొడ్డి, వాయిపేటలతోపాటు చుట్టు పక్కల గ్రా మాల్లో బంధువులు, స్నేహితుల ద్వారా సమాచారం సేకరించి పోలీసులకు చెప్పేవారు. మావోయిస్టులపై కొన్ని దాడులకు కారకులయ్యారు. ఆ తర్వాత ఉద్యోగం వచ్చి వాజేడు మండలంలో ఉంటున్నారు. చేపల వేట, పశువుల మేతకోసమని అడవిలోకి వచ్చి సమాచారం సేకరిస్తూ పోలీసులకు చేరవేస్తున్నారు. పెనుగోలు గ్రామస్తులు గుట్టపై ఉండొద్దని ఒత్తిడి చేసి దింపారు. పద్ధతులు మార్చుకోవాలని చెప్పినప్పటికీ వినలేదు. అందుకే రమేశ్, అర్జున్ను ఖతం చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు. -
ఫీడర్లకు లైన్ఫాల్ట్ ఇండికేటర్లు
దుగ్గొండి: వ్యవసాయ పంపుసెట్లకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఫీడర్లకు లైన్ఫాల్ట్ ఇండికేటర్లు ఏర్పాటు చేస్తామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రం, రేకంపల్లి సబ్స్టేషన్లను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. సమస్యలు గుర్తించి పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మల్లంపల్లి గ్రామ విద్యుత్ ఫీడర్‌కు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన లైన్ఫాల్ట్ ఇండికేటర్‌ను పరిశీలించి మాట్లాడారు. విద్యుత్ పీడర్లకు లైన్ఫాల్ట్ ఇండికేటర్లు అమరిస్తే లైన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తెలుస్తాయని తెలి పారు. దీంతో నిమిషాల వ్యవధిలో విద్యుత్ పునరుద్ధరించే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన లైన్ఫాల్ట్ ఇండికేటర్ల పనితీరు బాగుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిరంతరం నాణ్యమైన వి ద్యుత్ అందించాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. సీఎండీ వెంట సీఈలు అశోక్, కిషన్, రాజుచౌహాన్, జీఎం శ్రీనివాస్, ఎస్ఈ మధుసూదన్, డీఈ తిరుపతి, ఏడీ లక్ష్మణ్ ఏఈలు రామ్మూర్తి, ప్రత్యూష, లైన్ ఇన్స్పెక్టర్ అజీంపాషా, లైన్మెన్లు, సిబ్బంది ఉన్నారు. -
వామ్మో వణుకు!
ఎంజీఎం: చలి వణికిస్తోంది. రోజురోజుకూ విశ్వరూపం దాలుస్తోంది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొంటున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న చలి తీవ్రత వల్ల వచ్చే వ్యాధులు, పాటించాల్సిన జాగ్రత్తలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. చలికాలంలో వచ్చే వ్యాధులివే.. ● దగ్గు, ముక్కు కారడం, శ్వాస సంబంధిత సమస్యలు, గొంతునొప్పి, తుమ్ములు వస్తాయి. ● చిన్నారుల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి నిమోనియా బారిన పడే అవకాశం ఉంది. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్లోటో జోవన్ల వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ● గాలి ద్వారా సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి తెల్ల రక్త కణాలను నిర్వీర్యం చేయడంతో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ● పిల్లలు, వృద్ధులు, శ్వాస కోశ సంబంధిత వ్యాధికి గురై ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పాటించాల్సిన జాగ్రత్తలు.. ● పిల్లలకు స్వెటర్లు, సాక్సులు, గ్లౌజులు వేయాలి. ● నెలల వయసు ఉన్న చిన్నారులను తల్లి పొత్తిళ్లలో పడుకోబెట్టాలి. ఉదయం పూట ఎండలో కా సేపు ఉంచాలి. ● చిన్నారులతో ఉదయం, రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేయవద్దు. ● పిల్లలకు అవసరమైన టీకాలు ఇప్పించాలి. ● ముఖ్యంగా ఆస్తమా వ్యాధి ఉన్న వారు చలి గాలిలోని తేమను పీల్చుకోవద్దు. ● రాత్రి వేళలో చల్లగాలి రాకుండా ఇంట్లో కిటికీలు, తలుపులు మూసి వేసి వెచ్చదనం కోసం వేడినిచ్చే హై వోల్టేజీ బల్బులను వాడాలి. ● వాకింగ్‌కు వెళ్లే వారు చలి ఎక్కువగా ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ● ద్విచక్ర వాహనదారులు చలి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణం చేస్తే చేతులకు గ్లౌజులు, హెల్మెట్, స్వెటర్లు ధరించాలి. రోజురోజుకూ పెరుగుతున్న చలి ఆరోగ్య రక్షణకు డీఎంహెచ్ఓ అప్పయ్య సూచనలు వారం రోజుల ఉష్ణోగ్రతలు (డిగ్రీలు సెల్సియస్‌లలో)తేదీ గరిష్టం కనిష్టం15 30 18 16 31 16 17 30 15 18 29 15 19 29 14 20 29 15 21 29 15 22 28 14 -
బంగారం చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
ఆత్మకూరు: మండలంలోని పెంచికలపేటలో ఇటీవల ఓ వృద్ధురాలికి మాయమాటలు చెప్పి బంగారాన్ని దోచుకెళ్లిన ఇద్దరు దొంగలను ఆత్మకూరు పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పరకాల ఏసీపీ కిషోర్‌కుమార్ శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చెందిన ముదరని రతన్, అతడి భార్య రత్నకుమారి గ్రామాల్లో తిరుగుతూ చిక్కు వెంట్రుకలు సేకరించి అమ్ముకునే వ్యాపారం చేస్తున్నారు. ఈక్రమంలో పెంచికలపేటకు వచ్చిన రత్నకుమారి వృద్ధురాలు పెరుమాండ్ల రాజ్యలక్ష్మి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని ఆమెతో మాట్లాడింది. ఆరోగ్యం బాగు చేసే అతడిని భద్రాచలం నుంచి పంపిస్తానని చెప్పి భర్త రతన్‌ను పెంచికలపేటకు పంపించింది. అతడు రాజ్యలక్ష్మికి మాయమాటలు చెప్పి బంగారం అపహరించుకుపోయాడు. ఈక్రమంలో శుక్రవారం ఆత్మకూరు పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా.. బంగారం దొంగలు రతన్, రత్నకుమారిని పట్టుకుని వారి నుంచి నుంచి 2 తులాల పుస్తెల తాడు, అర తులం చెవి కమ్మలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన ఎస్ఐ పరమేశ్, సిబ్బంది నర్సింగరావు, ఎ.రమేశ్, బి.రమేశ్‌ను అభినందించి వారికి రివార్డు అందజేశారు. ఏసీపీ కిషోర్‌కుమార్ వెంట సీఐ సంతోశ్ ఉన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతశాయంపేట: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గోవిందాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతుల భూములను సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని దీంతో ప్రభుత్వం ప్రతిపక్షం కుట్ర చేయించినట్లు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. 2023 భూ సేకరణ చట్టాన్ని తీసుకొచ్చిందని.. దీని ప్రకారమే భూ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను విమర్శించకుండా పరిపాలనపై దృష్టి పెట్టాలని సీఎంను కోరారు. గత సర్పంచ్‌లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిరుపతిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురుకులం ఆకస్మిక తనిఖీన్యూశాయంపేట: హనుమకొండ నగరంలోని కేయూ క్రాస్ రోడ్డులో ఉన్న వరంగల్ (జీ–1) బాలికల గురుకులాన్ని వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులంలోని కిచెన్‌లో నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూను ప్రిన్సిపాల్ కృష్ణకుమారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజయపాల్‌రెడ్డి, డీటీఈఓ రాజు, తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు సంకల్పసిద్ధులు● ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ● అట్టహాసంగా దివ్యాంగుల క్రీడా పోటీలు వరంగల్ స్పోర్ట్స్: దివ్యాంగులు సంకల్పసిద్ధులు, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అనుకున్న రంగాల్లో రాణిస్తారని, ఆదిశగా అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈవేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి హాజరై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యతో కలిసి జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దివ్యాంగుల సంక్షేమం కోసం చర్చిస్తామని, అందుకోసం సంబంధిత అధికారులు డీపీఆర్ సిద్ధం చేయాలని సూచించారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచే దివ్యాంగుల కోసం అనేక చేయూత కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, ఇన్చార్జ్ డీవైఎస్ఓ శ్రీమన్నారాయణ, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
దుగ్గొండి: ఉపాధ్యాయులకు పెండింగ్ డీఏలు, జీపీఎఫ్ రుణాలు, పార్ట్ బిల్లులు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను వెంటనే చెల్లించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు ఎంఏ.అజీజ్ ఉద్యోగ విరమణ సభ శుక్రవారం హెచ్ఎం రామస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అజీజ్‌ను శాలువాలు, పూలమాలతో సన్మానించారు. అనంతరం శ్రీపాల్‌రెడ్డి మాట్లాడారు. త్వరలోనే ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పిస్తామని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అజీజ్ తన సుదీర్ఘ ఉపాధ్యాయ జీవితంలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్‌రెడ్డి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, నాయకులు అబ్దుల్‌గఫార్, తిరుపతిరెడ్డి, శ్రీహరి, పోలోజు భిక్షపతి, సుధాకర్‌రెడ్డి, నక్కిరెడ్డి, మహేందర్, రాజేందర్, భాస్కర్, సురేందర్, ప్రతాప్‌సింగ్, యాకూబ్‌రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి -
మహిళలు.. మౌనం వీడండి: సీపీ
వరంగల్ క్రైం: మహిళలు లైంగిక వేధిపులకు గురైతే మౌనం పాటించకుండా షీ టీంకు ఫిర్యాదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. తెలంగాణ మహిళా రక్షణ విఽభాగం రూపొందించిన వాల్‌పోస్టర్లను సీపీ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికల రక్షణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై కూడా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్నారు. అపరిచిత వ్యక్తులపై మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉండాలని.. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమయ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైనా.. విద్యార్థినులు ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురైనా మౌనంతో ఉండకుండా ధైర్యంగా షీ టీం బృందాన్ని సంప్రదించాలన్నారు. లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పరిపాలనా విభాగం అదనపు డీసీపీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్‌రెడ్డి, వరంగల్ షీ టీం ఇన్స్పెక్టర్ సుజాత, షీ టీం సిబ్బంది పాల్గొన్నారు. -
అమాయకులను చంపారు..
● పౌర హక్కుల సంఘాలు స్పందించాలి ● ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ అలర్ట్.. అలర్ట్ ● రెండేళ్ల తర్వాత సరిహద్దుల్లో మళ్లీ అలజడి.. ● ఇన్ఫార్మర్ పేరిట హత్యలు.. మృతుల కుటుంబాలకు న్యాయం చేయండి ● మృతదేహాలతో ఆదివాసీ సంఘాలు, గిరిజనుల రాస్తారోకో, ధర్నా ● నెల రోజుల్లో న్యాయం చేస్తామని పోలీసుల హామీ– 8లోu -
‘అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు’
వరంగల్ అర్బన్: నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను మూడు నెలల్లో ప్రారంభమయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. శుక్రవారం వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో ఆయన ఇంజనీర్లతో సమావేశమయ్యారు. పట్టణ ప్రగతి, సీఎంఏ, జీఓ 65, జనరల్ ఫండ్ తదితర అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన నేపథ్యంలో.. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులపై సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు. ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, పనుల్లో వేగం పెంచాలన్నారు. బల్దియా వ్యాప్తంగా 66 డివిజన్లలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, ఆపనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు శ్రీనివాస్, సంతోష్‌బాబు, డీఈ శ్యాంమోహన్, ఏఈ సౌజన్య పాల్గొన్నారు. -
టీజీఓఏ నూతన కార్యవర్గాల ఎన్నిక
హన్మకొండ అర్బన్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీఓఏ) వరంగల్, హనుమకొండ జిల్లాల నూతన కమిటీలను గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని టీజీఓ భవన్లో జరిగిన సంఘం సభ్యుల సమావేశంలో ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు ఉపేందర్‌రెడ్డి, ఈగ వెంకటేశ్వర్లు తెలిపారు. నూతనంగా ఎంపికై న వరంగల్, హనుమకొండ జిల్లాల కార్యవర్గంచే సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాస్‌రావు ప్రమాణస్వీకారం చేయించినట్లు వివరించారు. ఈసందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. సంఘం బలోపేతానికి సభ్యులంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, సహా అధ్యక్షులు బి.శ్యామ్, ఉపాధ్యక్షులు, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ జగన్మోహన్రావు, కోశాధికారి ఎం.ఉపేందర్‌రెడ్డి, దీపారెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు. నూతన ఎన్నికైన రెండు జిల్లాల కార్యవర్గానికి ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు, సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు. వరంగల్ జిల్లా కార్యవర్గం అధ్యక్షుడిగా జి.రాంరెడ్డి, అసోసియేట్ అధ్యక్షురాలిగా కె.అనురాధ, ఉపాధ్యక్షులు ఎం.చంద్రశేఖర్, బి.రాజేశ్‌రెడ్డి, ఎం.నీరజ, బి.సుధీర్‌గౌడ్, ఉపాధ్యక్షులు పి.భాగ్యలక్ష్మి, కార్యదర్శి పీఎస్ ఫణికుమార్, జాయింట్ సెక్రెటరీలు పాక శ్రీనివాసులు, కె.రాజు, సీహెచ్ యాకయ్య, బి.మధుసూదన్, ఎన్.రవీందర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ కె.మధురిమ, కోశాధికారి ఈ.వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.సాయిరాజ్, బి.రవి, పబ్లిసిటీ సెక్రటరీ జి.రాజేశ్‌కుమార్, వి.సదానందం, ఆఫీస్ సెక్రటరీ ఎ.రాంచందర్‌రావు, మైదం రాజు, కల్చరల్ సెక్రటరీ బి.సతీశ్‌కుమార్, పి.శ్రీకాంత్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెక్రటరీ జి.సుధీర్‌కుమార్, ఇస్మాయిల్, ఈ సీ సభ్యులు బి.విజయనిర్మల, హేమలత, కె.ఽశ్రీధర్, శ్రీలక్ష్మి, పవిత్రను ఎన్నుకున్నారు. హనుమకొండ జిల్లా కార్యవర్గం అధ్యక్షుడిగా డి.మురళీధర్‌రెడ్డి, అసోసియే ట్ అధ్యక్షుడిగా ఎ.శ్రీనివాస్‌కుమార్, ఉపాధ్యక్షులు అస్నాల శ్రీనివాస్, పి.వెంకటేశ్వరరావు, ఎండీ అన్వర్, రాంకుమార్, శ్రీనివా స్‌రెడ్డి, పి.ఆంజనేయులు, సీహెచ్.ప్రవీణ్‌కుమార్, జాయింట్ సెక్రటరీ టి.మహేశ్‌కుమార్, టి.మాధవరెడ్డి, ఎం.సంతోశ్, సతీశ్‌రెడ్డి, రవిప్రసాద్, ఈ.శ్రీనివాస్నావు, జాయింట్ సెక్రటరీ బి.భాగ్యలక్ష్మి, కోశాధికారి పి.రాజేశ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, కె.రవీందర్, సీహెచ్ సామ్యూల్ ఆనంద్‌రావు, పబ్లిసిటీ సెక్రటరీ ఎండీ గులాం యస్దాని, నాగరాజు, ఆఫీస్ సెక్రటరీ వి.విక్రమ్, జి.వినోద్‌కుమార్, కల్చరల్ సెక్రటరీ ఎ.ఉదయ్‌కుమార్, కవిత, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెక్రటరీ రమేశ్, ఈసీ సభ్యులు చేతన్‌రెడ్డి, వినయ్, జి.రాజేశ్వర్‌కుమార్, ఎ.కృష్ణవేణిని ఎన్నుకున్నారు. -
నకిలీ క్లినిక్‌లలో తనిఖీలు
ఎంజీఎం: నగరంలోని నకిలీ పైల్స్ డాక్టర్స్ క్లినిక్‌లపై తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టీజీఎంసీ అధికారి డాక్టర్ నరేశ్‌కుమార్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అన్వర్ మియా ఆధ్వర్యంలో పైల్స్ చికిత్స అందించే నకిలీ వైద్యులపై స్టింగ్ ఆపరేషన్ నోటీసులు జారీ చేశారు. హనుమకొండహనుమాన్ గుడి సమీపంలోని మారుతి క్లినిక్ /ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పేరుతో నిర్వహిస్తున్న ఆర్కే బిశ్వాస్, అదే ప్రాంతంలోని అనుపమ క్లినిక్ పేరుతో క్లినిక్ నిర్వహిస్తున్న నకిలీ ఆయుర్వేదిక్ వైద్యుడు ఏకే సర్కార్, కుమార్‌పల్లిలోని శ్రీలక్ష్మీ క్లినిక్ నిర్వాహకుడు నకిలీ ఆయుర్వేద వైద్యుడు బిశ్వాస్ క్లినిక్‌లను తనిఖీ చేశారు. వారికి నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసినట్లు వరంగల్ జిల్లా యాంటీ క్వాకరీ అసోసియేట్ సభ్యుడు డాక్టర్ శిరీశ్ తెలిపారు. ప్రజలు నకిలీ వైద్యులను నమ్మి మోసపోవొద్దని, క్లినిక్‌లకు వచ్చే పేషెంట్లకు ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే పైల్స్, పిస్టులా ఉన్నట్లు నమ్మిస్తూ వారి నుంచి వేలాది రూపాయలు వసూళ్లు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తింపు లేని చికిత్సల వల్ల ప్రజలకు మరింత అనారోగ్య సమస్యలు పెరుగుతాయని చివరికి వారి ప్రాణాల మీదికే రావొచ్చని సూచించారు. నిట్‌తో హెచ్‌సీ రోబోటిక్స్ ఎంఓయూకాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో హైదరాబాద్ హెచ్‌సీ రోబోటిక్స్ సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, హెచ్‌సీ రోబోటిక్స్ ప్రతినిధులు డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ దిలీప్ ఎంఓయూ పత్రాలను గురువారం అందజేసుకున్నారు. నిట్ వరంగల్‌లో స్వదేశీ ఇంటెలిజెంట్ డ్రోన్ , నిఘా వ్యవస్థ రూపకల్పనకు విద్యార్థులకు శిక్షణ అందించేందుకు ఈ ఎంఓయూ తోడ్పడుతుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు సతీశ్‌కుమార్, వేణువినోద్, శ్రీనివాసాచార్య, ఆంజనేయులు, శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. -
– మామునూరు/మడికొండ
మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల, మడికొండలోని సీటీసీలో గురువారం పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్లు అట్టహాసంగా జరిగాయి. 9నెలల ట్రైనింగ్‌కు ట్రైనీ కానిస్టేబుళ్లు దీక్షాంత్ పరేడ్‌తో వీడ్కోలు పలికారు. శిక్షణలో నేర్చుకున్న కొన్ని ప్రధాన అంశాలను కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. శిక్షణ ముగించుకుని విధుల్లో చేరనున్న తమ బిడ్డలను చూసేందుకు ఉమ్మడి పది జిల్లాల నుంచి తల్లిదండ్రులు వచ్చారు. వారి పిల్లల పరేడ్, విన్యాసాలు చూస్తూ ఆనందంలో మునిగిపోయారు. పరేడ్ అయిపోగానే ఆత్మీయ ఆలింగనం చేసుకుని సంతోషంగా గడిపారు. పీటీసీలో జరిగిన కార్యక్రమానికి మంత్రి సీతక్క, ఎంపీ కావ్య హాజరుకాగా, సీటీసీలో సీపీ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు. – వివరాలు 8లోu -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి..
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి దామెర: కుటీర పరిశ్రమలు నెలకొల్పి మహిళలు ఆర్థికంగా ఎదగాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సూచించారు. మండలంలోని ల్యాదెళ్ల సమీపంలో నిరుపయోగంగా ఉన్న దేవాదుల వసతి గృహాలను గురువారం వీ హబ్ సీఈఓ సీత పళచోళ్లతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా వసతి గృహాల్లోని గదులు, టాయిలెట్లతో పాటు క్వార్టర్స్‌లో ఉన్న మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అందుకోసం మాహిళలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. మహిళలు వ్యాపార రంగాల్లో రాణించేలా తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రోత్సాకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వీ హబ్ సీఈఓ మాట్లాడుతూ.. మహిళలు సామూహికంగా వ్యాపారాలు నిర్వహించి రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ జాహిద్ అక్కర్, అసోసియేట్ డైరెక్టర్ ఊహసజ్జ, ప్రాజెక్ట్ మేనేజర్ గురుప్రసన్నాశ్రీరాం, కో–ఆర్డినేటర్ సాయిరామ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జ్యోత్స్న, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఎం ఝాన్సీ, పార్టీ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాశ్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొలెపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దుర్శెట్టి భిక్షపతి, నాయకులు శనిగరం సుధాకర్, సదిరం పోశాలు, సోనబోయిన రవి, వెంకన్న, రాంచందర్, శంకర్, గడ్డం రమేశ్, యువజన నాయకులు నల్ల సుధాకర్, అమ్ముల రవికుమార్, దామెర రతన్‌కుమార్, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రెండు కమిషనరేట్లు, నాలుగు జిల్లాలకు కేంద్రంగా నగరం డబ్ల్యూఎన్‌పీఎస్ ఏర్పాటుతో భరోసా..
రవాణా మార్గాలివే.. గంజాయిని ప్రధానంగా ఏడు మార్గాల ద్వారా వయా వరంగల్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిత్రకొండ, సీలేరు, డోర్నకల్, మోతుగూడెం, చింతూరు, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం నుంచి వరంగల్ ఒక మార్గం. చిత్రకొండ, సీలేరు, డోర్నకల్, మోతుగూడెం, లక్నవరం ఎక్స్ రోడ్, రాజమండ్రి మరోమార్గం. కలిమెల, కుంట (ఛత్తీస్‌గఢ్), చెట్టి (చింతూరు), భద్రాచలం ఇంకోమార్గం. భద్రాచలం, వెంకటాపురం, ములుగు, పస్రా, తాడ్వాయి, వరంగల్, హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున గంజాయి తరలుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదో రూటు రాజమండ్రి, అశ్వారావుపేట, కల్లూరు, తల్లాడ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ కాగా.. పాడేరు, జి మాడ్గుల, చోడవరం, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్‌కు గంజాయి తరలుతోంది. అలాగే చింతపల్లి, లంబసింగి, నర్సీపట్నం, కోటనందూరు, తుని, జగ్గంపేట, రామచంద్రాపురం, చింతూరు, గుండాల, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు, జనగామ, హైదరాబాద్‌కు వెళ్తుండగా..ఇదేదారిలో జనగామ నుంచి వరంగల్‌కు చేరుతుంది. అరకు, ఎస్.కోట, దేవరపల్లి, పెందుర్తి, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, కోదాడ నుంచి వరంగల్, హైదరాబాద్‌కు.. వరంగల్ నుంచి మహారాష్ట్ర వివిధ మార్గాల ద్వారా గంజాయి రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. -
పోగొట్టుకున్న బంగారు ఆభరణాల అందజేత
కమలాపూర్: పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను వెతికి పట్టుకుని బాధితురాలికి అప్పగించిన ఘటన కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం శనిగరానికి చెందిన చెరిపెల్లి ఉష సుమారు రెండు నెలల క్రితం పాత చీరలకు ప్లాస్టిక్ వస్తువులు ఇస్తామని తిరుగుతున్న ఓ చిరువ్యాపారికి తన చీరలను అమ్మింది. పాత చీరలతో పాటు ఆ చీరల్లో దాచుకున్న రూ.లక్ష విలువైన తులం పావు బంగారు ఆభరణాలు (జత కమ్మలు, రెండు వంక ఉంగరాలు) సైతం పోవడంతో బాధితురాలు కమలాపూర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు పాత చీరలకు ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చే వ్యాపారులను పిలిపించారు. వారు కొన్న పాత చీరల్లో ఉష పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు దొరికాయి. ఆబంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఉషకు గురువారం అందజేశారు. ఇన్స్పెక్టర్ హరికృష్ణ, ఎస్సై వీరభద్రరావుకు ఉష కృతజ్ఞతలు తెలిపింది. -
నేటి నుంచి క్రికెట్ టోర్నమెంట్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఇంటర్ కాలేజీయెట్ క్రికెట్ టోర్నమెంట్‌ను (పురుషుల) ఈనెల 22, 23, 24 తేదీల్లో మూడ్రోజులపాటు నిర్వహించనున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ డాక్టర్ వై.వెంకయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈటోర్నమెంట్ ప్రారంభ సమావేశానికి కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలిపారు. డీఆర్డీఓగా మేన శ్రీనుహన్మకొండ అర్బన్: హనుమకొండ డీఆర్డీఓగా మేన శ్రీనును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం డీఆర్డీఓగా పని చేసిన నాగపద్మజ పంచాయతీరాజ్ శాఖకు రిపోర్ట్ చేయాలని ఆఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఇంతకాలం హనుమకొండ మైనార్టీ సంక్షేమాధికారిగా పని చేసిన మేన శ్రీను ఇటీవల మాతృ శాఖకు వెళ్లారు. తాజాగా హనుమకొండ జిల్లాకు డీఆర్డీఓగా వచ్చారు. భద్రకాళి అమ్మవారికి ఉన్నతాధికారుల పూజలుహన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయాన్ని గురువారం బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బి.వెంకటేశ్వర్రావు రిటైర్డ్ ఐఏఎస్, బీసీ కమిషన్ సెక్రటరీ సైదులు ఐఎఫ్ఎస్, డిప్యూటీ డైరెక్టర్ రమేశ్, జిల్లా అధికారులు సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ పర్యవేక్షకులు అద్దంకి విజయ్‌కుమార్, అర్చకులు ఆలయానికి వచ్చిన ఉన్నతాధికారులను ఘనంగా స్వాగతించారు. వారు ముందుగా ఆది శంకరులను, వల్లభ గణపతిని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ స్నపన మండపంలో వేద పండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మవారి శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. కేయూ డాక్టరేట్స్ అసోసియేషన్ ఏర్పాటుకేయూ క్యాంపస్: కేయూలో తొలిసారిగా అసోసియేషన్ ఆఫ్ కేయూ డాక్టరేట్స్ (ఏకేయూడీ) ఏర్పాటైంది. ఈమేరకు గురువారం ఏకేయూడీ సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా యూనివర్సిటీలో పరిశోధన, అకడమిక్ అంశాలను పెంపొందించేలా ఈఅసోసియేషన్ కృషి చేయనుంది. కాగా ఈ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కొల్లు నర్సింహారావు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కేయూ డాక్టరేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, రంగారెడ్డి, కార్యదర్శిగా చిలువేరు రాజ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా సంగాల ఎఫ్రిమ్రాజు, బి.ప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా బండి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా టి.ఆశీర్వాదం, సెక్రటరీలుగా పి.మహేందర్, వి.సుధాకర్, స్పోక్స్ పర్సన్స్‌గా డాక్టర్ జె.సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈఅసోసియేషన్కు గౌరవ అధ్యక్షుడిగా పుల్లా శ్రీనివాస్ వ్యవహరించనున్నారు. కార్యవర్గసభ్యులుగా ఎం లింగయ్య, ఓ రవీందర్, చీఫ్ అడ్వయిజర్లుగా ప్రొఫెసర్ నారాయణ, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు, బి.శ్రీకాంత్‌ను ఎన్నుకున్నారు. ఈకార్యవర్గం మూడేళ్లపాటు కొనసాగనుంది. -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
సంగెం: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న పోస్ట్‌మెట్రిక్ గిరిజన బాలుర వసతి గృహాన్ని మహిళల ఆర్థిక సాధికారత వీ–హబ్ సీఈఓ సీత పళచోళ్ల బృందంతో కలిసి గురువారం ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంగెం, గీసుకొండ మండలాలకు ఒక మహిళా ఆర్థిక సాధికారత సెంటర్ కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును కోరిన వెంటనే వీ–హబ్ సీఈఓతోపాటు బృందాన్ని పరిశీలనకు పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వీ–హబ్ సీఈఓ సీత పళచోళ్ల మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతులై అన్ని రంగాల్లో ముందుకు వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సీఎం వీ–హబ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఉండడం ఈ ప్రాంత మహిళల అదృష్టమని పేర్కొన్నారు. తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్, పీఆర్ డీఈ జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్, వీ–హబ్ అధికారులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి -
చెక్కు అందించనందుకు మెమోలు
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడితో పాటు మరో ముగ్గురు చిరుద్యోగులకు ఎండోమెంట్ అధికారి మెమోలు జారీ చేశారు. మల్ల న్న ఆర్చ్ నిర్మాణానికి ఇటీవల మల్లికార్జునస్వామి టీం రూ.1.5 లక్షలు చెక్కు రూపంలో ఆలయంలో అర్చకుడు నందనం మధు శర్మకు అందజేశారు. ఈవిషయం ‘సాక్షి’లో ప్రచురితమైంది. ఈనెల 17న ఆదివారం భక్తులు అర్చకుడికి చెక్కు ఇచ్చినప్పటికీ గురువారం సాయంత్రం వరకు ఎండోమెంట్ అధికారులకు చెక్కును అందజేయలేదు. దీంతో ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడు నందనం మధుశర్మతో పాటు మరో ముగ్గురు చిరుద్యోగులు తిరుమలేశ్, ఎస్.రాజు, బి.కన్నయ్యకు ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు మెమోలు జారీ చేసి వివరణ కోరినట్లు తెలిపారు. సమాచారం లేకుండా భక్తులు ఇచ్చిన చెక్కు ఎలా స్వీకరిస్తారని వారిని ప్రశ్నించారు. అనుమతి లేకుండా అర్చకులు, ఉద్యోగులు చెక్కులు, నగదు రూపంలో విరాళం తీసుకుంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. -
అమీనాబాద్‌లో షార్ట్ సర్క్యూట్
చెన్నారావుపేట: మండలంలోని అమీనాబాద్ షార్ట్ సర్క్యూట్ జరిగి రూ.26 లక్షల సామగ్రి దగ్ధమైన ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోతరాజు మహేశ్ టెంట్ హౌస్, డీజే, డెకరేషన్స్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మహేశ్ తండ్రి కొమురయ్య అనారోగ్యానికి గురై హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మహేశ్ తండ్రితోపాటు ఆస్పత్రిలోనే ఉన్నాడు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న టెంట్లు, డీజే బాక్సులు, సౌండ్ సిస్టంలు, సుమారు 600 కుర్చీలు, డెకరేషన్ వస్తువులు మొత్తం కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వచ్చి మంటలను అదుపుచేశారు. సుమారు రూ.26 లక్షల విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని వారు కోరారు. టెంట్లు, డీజే డెకరేషన్ సామగ్రి దగ్ధం రూ.26 లక్షల ఆస్తి నష్టం -
మహిళల సంక్షేమానికి కృషి
నర్సంపేట: మహిళలు స్వయం ఉపాధి కోర్సులను సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి చెందాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార సాధికారత సంస్థ ఆధ్వర్యంలో నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన 35 మంది మహిళలు కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫి కెట్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు పాల్గొన్నారు. ‘కొనుగోళ్లలో అక్రమాలు సహించం’నెక్కొండ: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు సహించమని నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి హెచ్చరించారు. మండలంలోని సూరిపల్లిలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు, పీఏసీఎస్ సీఈఓ వీరస్వామితో ఆమె మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని నష్టపోవద్దన్నా రు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్‌కుమార్, ఆర్ఐ నరేందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.