వరంగల్ నేతలకు పాలేరు బాధ్యతలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రచారం బాధ్యతలను వరంగల్ జిల్లా నేతలకు అప్పగించింది. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్‌రెడ్డి లకు ఖమ్మం ఎన్నికల కార్యాలయం, మీడియా వ్యవహారాలను అప్పగించారు. కూసుమంచి మండల బాధ్యతలను దొంతి మాధవరెడ్డికి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డికి తిరుమలాయపాలెం మండల బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల కో ఆర్డినేటర్‌గా టీపీసీసీ శాశ్వత ఆహ్వానిత కమిటీ సభ్యుడు కొండపల్లి దయాసాగర్, టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్, సోషల్ మీడియా వ్యవహారాలను చూసుకుంటారని టీపీసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.