Water union elections
-
సాగునీటి సంఘాల ఎన్నికల్లో ‘కూటమి’ బరితెగింపు: చెల్లుబోయిన వేణు
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో నీటిసంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగా, కనీస పారదర్శకత లేకుండా నీటిసంఘాల ఎన్నికలను ఏకపక్షంగా ఈ ప్రభుత్వం నిర్వహించిందని మండిపడ్డారు.ఇంకా ఆయన ఎమన్నారంటే..రాష్ట్రంలో సాగు నీటిసంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించామంటూ కూటమి పార్టీలు చెప్పుకుంటున్నాయి. అధికార బలంతో, పోలీసు యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని ఈ ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కనీస పారదర్శకతకు చోటు లేకుండా నిరంకుశంగా, తమకు అనుకూలంగా ఈ ఎన్నికలను నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఈ సంఘాలకు నిర్వహించే ఈ ఎన్నికల్లో ఎవరైనా రైతులు టీసీ (ప్రాదేశిక నియోజకవర్గం) సభ్యుడిగా పోటీ చేయాలనుకుంటే, నీటి బకాయిలు పూర్తిగా చెల్లించి ఉండాలి.ఆ మేరకు వీఆర్ఓ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకోవాలి. ఇది తప్పనిసరి. అది ఉంటేనే నామినేషన్ అనుమతిస్తారు. లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వైయస్ఆర్ సిపికి చెందిన వారు ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండేందుకు విఆర్వోలను అందుబాటులో లేకుండా చేశారు. ఎమ్మార్వో కార్యాలయాల్లో విఆర్వోలను ఉంచి, నోడ్యూస్ కోసం వచ్చిన వారిని పోలీసులతో బెదిరించి వెనక్కి పంపించారు.న్యాయస్థానం ఉత్తర్వులను కూడా గౌరవించలేదుసాగునీటి సంఘాలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కూడా కూటమి ప్రభుత్వం గౌరవించలేదు. కేవలం ప్రతిపక్ష పార్టీపై కక్షసాధించాలనే ఉద్దేశం, ఏదో ఒకరకంగా ఈ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రయత్నించింది. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా తప్పుడు విధానాలకు వినియోగించుకుంది. దీనిని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడ్డారు. ఈ అరాచకాలను ప్రజలకు తెలియచేసేందుకు ప్రయత్నించిన మీడియాపై కర్కశంగా భౌతికదాడులకు తెగబడ్డారు. ఇటువంటి దారుణాలతో గెలిచి, ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం పాల్జేశారు. పైగా పులివెందుల్లో గెలిచామని చెప్పుకుంటూ, ఇదంతా తమ గొప్పతనంగా చాటుకోవడం సిగ్గుచేటు.ఏకగ్రీవాలే లక్ష్యంగా పనిచేశారుఇతర పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేకుండా, గ్రామసచివాలయాల్లో నోడ్యూస్ సర్టిఫికేట్ లు ఇవ్వకుండా కుట్రలకు పాల్పడ్డారు. ఇటువంటి దుర్నీతికి నిరసనగానే వైఎస్సార్సీపీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు (టీసీ), 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాల (డబ్ల్యూయూఏ)కు సంబంధించి శనివారం రహస్య ఓటింగ్ పద్దతికి తిలోదకాలిచ్చి ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది.వీఆర్వోలను అందుబాటులో లేకుండా చేశారుఈ ఎన్నికలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వీఆర్ఓలు అంతా గ్రామ సచివాలయాల్లో ఉండాలి. కానీ చాలా మంది వీఆర్ఓలు ఫోన్లు స్విచాఫ్ చేసి కూర్చున్నారు. ఇంకా అందరు వీఆర్ఓలను మండల ఆఫీస్‌కు తీసుకుపోయి, నిర్భంధం చేశారు. బయట పోలీసులను కాపలగా పెట్టారు. వారిని రెండు రోజుల పాటు మండల ఆఫీస్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? వారిని అక్కడ జైల్లో ఖైదీలుగా ఉంచినట్లు ఉంచారు. ఏ రైతు కూడా తమ వీఆర్ఓను కలిసే వీలు లేకుండా చేశారు. అలా వీఆర్ఓలు ఆ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కుట్ర చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా దౌర్జన్యకాండరాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యకాండను కొనసాగించింది. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కళ్లెంపూడిలో బీజేపీ నాయకుడు కోన మోహన్‌రావు నామినేషన్ వేసేందుకు కళ్లెంపూడి ఎంపీపీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా, ఆయన్ను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలను పైకి విసిరారు. తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డీఈ పి.శ్రీచరణ్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా టీడీపీ నాయకుల ఒత్తిడితో డీఈ పట్టించుకోలేదు.పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరి తెగించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘును, అభ్యర్థి దగుమాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్‌కు తరలించి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని, తమపార్టీ నాయకులను అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్‌కు తీసుకువచ్చారని నిలదీసినా ప్రయోజనం లేకపోయింది.కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నిక నామినేషన్ పత్రాలను చించేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో తమ మాట వినలేదని టీడీపీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఓటర్లు ఆందోళనకు దిగారు. 300 మంది ఓటర్లు ఉంటే కేవలం 12 మందిని మాత్రమే లోపలికి ఎలా అనుమతిస్తారని పోలింగ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) సాగునీటి సంఘానికి నామినేషన్ వేయకుండా జెడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మడకశిర మండలం కల్లుమర్రిలో పోటీలో ఉన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తొనుకుమాల రెండు చెరువులకు సంబంధించి పోటీ చేసిన రైతు చక్రపాణిరెడ్డిని అడ్డుకున్నారు. దాదాపు జిల్లా అంతటా టీడీపీ కూటమి నాయకులు చెప్పిన విధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు నడుచుకున్నారు. నెల్లూరు జిల్లా కుడితిపాలెంలో టీడీపీ నేతలు అరాచకాలు చేశారు. పద్మమ్మ అనే మహిళా రైతు గెలిచినా.. టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు..మాజీ ఎమ్మెల్యేపై నోరుపారేసుకున్న సీఐ ‘రే.. నువ్వు నన్నేమీ చేసుకోలేవు.. ఏమి చూస్తావు.. ఏమి చేస్తావు రా.. ఇక్కడి నుంచి దెం..యి’ అంటూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కర్నూలు సీసీఎస్ సీఐ ఇబ్రహీం దుర్భాషలాడారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ఈ ఘటన జరిగింది.ఓటర్లను అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో మాట్లాడటానికి వెళ్లడంతో పోలీసులు ఇలా ‘పచ్చ’ నేతల్లా వ్యవహరించారు. దీంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవమైంది. కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం బ్రహ్మణదొడ్డిలో టీడీపీ నేత డి.విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నామినేషన్ పత్రాలను లాక్కొని చింపి వేశారు. చేతకాని దద్దమ్మ ప్రభుత్వంఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం. పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్నికలు చేయడం చేతకానితనం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే, రైతులు ఓటు వేసి ఉంటే, టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ను చొక్కా విప్పి కూర్చోబెట్టి ఉండేవారు. మా పార్టీ సానుభూతిపరులు పోటీ చేస్తే, ఓడిపోతామని చెప్పి, రైతులకు నోడ్యూస్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. వీఆర్ఓలు గ్రామ సచివాలయాల్లో ఉండకుండా, వారిని ఎందుకు మండల ఆఫీస్‌ల్లో బంధించి ఉంచారు.చివరకు కవరేజ్‌కు వచ్చిన మీడియాపైనా వైఎస్సార్ జిల్లా వేములలో దాడి చేశారు. ఇన్ని పనులు చేసి, నో డ్యూస్ సర్టిఫికెట్ కోసం ఎవరూ రాలేదని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒక్క పులివెందులలోనే కాదు, జమ్మలమడుగులో కూడా అదే పని చేశారు. వీఆర్ఓలు అందరినీ తీసుకెళ్లి, దేవగుడిలో బంధించారు. ఇది వాస్తవం కాదా? అధికారుల తప్పులు, వారు దగ్గరుండి చేయించిన పొరపాట్లకు శిక్ష అనుభవించక తప్పదు. సాగు నీటి ఎన్నికల్లో టీడీపీ గెలుపు అస్సలు గెలుపే కాదు.. చంద్రబాబు జీవితంలో ఇదో చీకటి అధ్యాయం.. ఎన్నికలు పెట్టకుండా.. టీడీపీ నేతలే చంద్రబాబు నామినేట్ చేసుకుని ఉంటే బాగుండేది. -
ఎన్నికలంటే దడ
సమావేశాలుగా పేరు మార్పు 11రోజుల్లో రెండు జీవోలు నీటి సంఘాల ఆధిపత్యం కోసం అధికారులతో తెలుగుతమ్ముళ్ల లాలూచీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న నీటి సంఘాల ఎన్నికలను నేరుగా ఎదుర్కొనే సాహసం చేయలేని తెలుగు తమ్ముళ్లు అడ్డదారిలో ఆధిపత్యం కోసం తంటాలు పడుతున్నారు. నేరుగా నీటి సంఘాలకు ఎన్నికలు జరిగితే తమ్ముళ్ల ఆధిపత్యం గల్లంతవుతుందనో, లేక రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భయపడ్డారో.. కారణం ఏదేతైనేమి నేరుగా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే ధైర్య సాహసాలు చేయలేకపోయారనడానికి ఇదో నిదర్శనం. ఆత్మకూరు : నీటి వినియోగదారుల సంఘం డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్ట్ కమిటీలు ఇలా పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ జనరల్ బాడీ సమావేశాలను నిర్వహిస్తున్నామంటూ ప్రభుత్వం ఇటీవల రెండు జీవోలకు శ్రీకారం చుట్టింది. గత నెల 13న జీవో ఆర్టీ నంబరు 528ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలో 6,138 నీటి వినియోగదారుల సంఘాలు, 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్ట్ కమిటీలకు ప్రతినిధులను నియమించుకునేందుకు ఆ జీవోలో వ్యూహరచన చేశారు. జనరల్ బాడీ సమావేశాలను ఏర్పాటుచేసి ఆ సమావేశాల ద్వారా చైర్మన్, వైస్‌చైర్మన్, మరో నలుగురు కమిటీ సభ్యులను ఈ నెల 12లోపు ఎన్నుకోవాలని ఆదేశించారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలంటే ఈ సమయం సరిపోదని, జిల్లా కలెక్టర్లు సైతం ఈ గడువు పొడిగించాలని కోరారు. దీంతో ఈ గడువును ఈ నెల 25 వరకు పొడిగిస్తూ మరో జీవో 548ని గత నెల 24న విడుదల చేశారు. ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ జీవోను రూపొందించారు. మొత్తం మీద 11 రోజుల వ్యవధిలో రెండు జీవోలతో తెలుగుతమ్ముళ్లు ఆధిపత్యం చెలాయించే తరహాలో ఈ నీటి సంఘాల తంతు ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలోనూ తెలుగుతమ్ముళ్లు ఎవరికి వారు ఈ జీవోలను ఆధారంగా చేసుకుని చైర్మన్, వైస్చైర్మన్లతో పాటు నలుగురు సభ్యులను ఎంపిక చేసుకునేందుకు కమిటీల సమావేశాలను ఈ నెల 13 నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తప్పుల తడకగా ఓటర్ల జాబితాలు వాస్తవానికి వారం ముందే ఎన్నికల ప్రక్రియపై ఆయా నీటి సంఘాల పరిధిలో అవగాహన కల్పించడం, ఒక రోజు ముందు దండోరా వేయడం లాంటి ప్రక్రియలు కొనసాగాలి. అయితే అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఈ ప్రక్రియలు లాంఛనమే అయ్యాయి. ఓటర్ల జాబితా సైతం తప్పుల తడకలుగా ఉన్నప్పటికీ ఈ అంశాలేవి అధికారులకు పట్టినట్లు లేవు. జిల్లా కలెక్టర్ నియమించిన ఓ అధికారి జనరల్ బాడీ సమావేశం పేరుతో ఓటర్లను సమావేశపరిచి వారి ద్వారా ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఓ ముసాయిదాను తెలుగు తమ్ముళ్లు రూపొందించుకున్నారనేది సమాచారం. ఉదాహరణకు ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ తరహాలో 74 కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఆత్మకూరు మండలంలో 9, చేజర్లలో 13, ఏఎస్‌పేటలో 14, అనంతసాగరంలో 14, మర్రిపాడులో 18, సంగం మండలంలో ఆరు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. అధికారులతో తెలుగు తమ్ముళ్లు లాలూచీ పడి ఆధిపత్య పోరులో తమకే మద్దతు పలకాలంటూ అధికారులను సైతం తెలుగుతమ్ముళ్లు లోబరుచుకుంటున్నారు. పేరుకు జనరల్ బాడీ సమావేశాలు అయినప్పటికీ పేరు మార్పు తప్ప అవి ఎన్నికలేనని పలువురు చర్చించుకుంటున్నారు. నేరుగా ఎన్నికలతో సమరం చేయలేక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేసిన ఎత్తుగడలో ఇదో భాగమని సర్వత్రా సాగుతున్న చర్చ. మరీ ఈ సమావేశాల్లో అధికారులు ఏ తరహాలో నిజాయితీకి కట్టుబడి ఉంటారో వేచి చూడాలి. వాస్తవంగా రైతులకు పట్టం గట్టేలా ఈ కమిటీలు ఏర్పాటు అయితే ఆశించినంత పరిణామమేనని పలువురు మేధావులు అంటున్నారు. -
ఏకగ్రీవం సాధ్యమేనా!
♦ నేటి నుంచి నీటి సంఘాల ఎన్నికలు ♦ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సహా ఆరుగురితో కార్యవర్గం సాక్షి, కర్నూలు : జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికకు తెరలేచింది. నేటి నుంచి నుంచి సంఘాల ఎంపిక ప్రక్రియ షూరు కానుంది. కార్యవర్గాలను ‘ఏకాభిప్రాయం’తో నే ఎన్నుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. నామినేషన్లు.. పోలింగు హడావుడి ఏమాత్రం ఉండకుండా సభకు హాజరైన వారిలో ఎక్కువ మంది ఎవరి అనుకూలంగా చేతులెత్తితే వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అధికారులకు ఈ ఎన్నిక కత్తి మీద సాముగా మారింది. ముందుగా నీటి సంఘాల ఎన్నిక 18వ తేదీ కల్లా పూర్తికావాలి. 19వ తేదీన డిస్ట్రిబ్యూటరీ సంఘాలకు, 25 నాటికి ప్రాజెక్టు కమిటీల ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆయకట్టు రైతు ఐతే చాలు.. ఆయకట్టు రైతులు అందరూ సమావేశంలో పాల్గొనవచ్చు. మినిట్స్‌లో వారందరి సంతకాలు తీసుకుంటారు. ముందుగా అధికారులు నిబంధనలు చదివి వినిపిస్తారు. ఒక్కో సంఘానికి ఆరుగురు సభ్యులను ఎంపిక చేసుకోవాలి. వారిలో ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. సమావేశానికి హాజరైన సభ్యులకు అధికారులు ఇదే విషయాన్ని వివరిస్తారు. సమావేశంలో రెండు లేదా మూడు అభిప్రాయాలు వెల్లడి కావచ్చు. ఎక్కువ మంది అభిప్రాయాన్ని లెక్కలోనికి తీసుకుని.. దాన్నే ఏకాభిప్రాయంగా పరిగణిస్తారు. గట్టి పోలీసు బందోబస్తు.. జిల్లాలో మొత్తం 323 సాగునీటి సంఘాలు ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ సంఘాలకు ఎన్నికలు జరగలేదు. తాజాగా ప్రభుత్వం రైతుల ఏకాభిప్రాయంతోనే ఈ సంఘాలను ఎన్నిక చేయాలని ఆదేశించింది. ఈ పదవులకు స్థానికంగా పోటాపోటీ ఉంటుంది. అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు అదే భావించి పోలీసు బందోబస్తును కోరారు. సభ్యుల ఎంపికకు సంబంధించి నిర్వహించే సమావేశాలకు ఎంత మంది హాజరైనా ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, ఎక్కువ మంది హాజరైతే మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. ఆయకట్టు పనుల్లో కార్యవర్గాలకే ప్రాధాన్యం ఉంటుంది కనుక ఆయకట్టు రైతులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. ఎవరికి వారు పదవులు కావాలని పట్టుబడితే మాత్రం నిర్వాహకులకు ఇబ్బంది తప్పదు. -
షెడ్యూల్ ప్రకారం నీటిసంఘాల ఎన్నికలు
కాకినాడ సిటీ : సాగునీటి వినియోగ సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్ట్ కమిటీలకు సర్వసభ్య అంగీకారాలతో యాజమాన్య కమిటీల ఏర్పాటుకు షెడ్యూల్ ప్రకారం చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఇరిగేషన్ ఎస్ఈలతో శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 25 లోగా ఆయా కమిటీల సర్వసభ్య సమావేశాలు నిర్వహించి, సభ్యుల అంగీకారంతో చైర్మన్, వైస్ చైర్మన్, నలుగురు సభ్యులతో కూడిన యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ ఏఈల ఆధ్వర్యాన తహశీల్దార్ల పర్యవేక్షణలో నీటి వినియోగదార్ల సంఘాలకు, డీఈల ఆధ్వర్యాన ఆర్డీఓల పర్యవేక్షణలో డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు, ఈఈ ఆధ్వర్యాన జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ప్రాజెక్ట్ కమిటీలకు యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా సంఘాలు, కమిటీల సర్వసభ్య సమావేశాలకు ఏడు, ఐదు రోజుల ముందస్తు నోటీసులు జారీ చేసి, ఆయా కమిటీల ప్రధాన కేంద్రాల్లోనే నిర్వహించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 401 నీటి వినియోగదారుల సంఘాలు, 30 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 5 ప్రాజెక్ట్ కమిటీల సర్వసభ్య సమావేశాల నిర్వహణకు నోటీసులు జారీ చేశామని, ఈ ప్రక్రియ నిర్వహణకు జాయింట్ కలెక్టర్-2ను కాంపిటెంట్ అథారిటీగా నియమించామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 డి.మార్కండేయులు, ఇరిగేషన్ ఎస్ఈ సుగుణాకరరావు, ఈఈలు పాల్గొన్నారు.