web series
-
ఓటీటీలో తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
ఓటీటీలు రావడంతో డిఫరెంట్ కాన్సెప్ట్ కథలు చెప్పడం కూడా మొదలుపెట్టారు. అలా సినిమాలుగా తీయలేని కథల్ని కొన్నిసార్లు వెబ్ సిరీసులుగా తీయడం చూస్తూనే ఉన్నాయి. అలా రాజేంద్ర ప్రసాద్, దివి, శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన సిరీస్ పేరే 'హరికథ'. ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?)మర్డర్ మిస్టరీకి మైథలాజికల్ టచ్ ఇచ్చి తీసిన ఈ సిరీస్ డిసెంబరు 13 నుంచి హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అధర్మం హద్దు మీరినప్పుడు, అన్యాయాన్ని ఎదురించాల్సిన వారు చేతులు కట్టుకొని కూర్చున్నప్పుడు.. ఆ ధర్మాన్ని కాపాడడానికి దేవుడే వస్తాడు అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. అదే టైంలో రక్తపాతంతో భయంకరంగా అనిపించింది.పరశురాముడు, నరసింహుడు, వామనమూర్తి... ఇలా శ్రీవిష్ణు దశావాతారాల్లోని కొన్ని రూపాల్లో ఉన్న వ్యక్తి.. వరస హత్యలు చేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఉన్నది దేవుడా? మరెవరైనా అని పరిశోధించే పోలీస్ ఆఫీసర్‌గా శ్రీ రామ్ నటించారు. రంగస్థల నాటక కళాకారునిగా రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!) -
'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' సిరీస్ రివ్యూ
భారతదేశ స్వాతంత్య్రం కోసం సాగిన బహుముఖ పోరాటాన్ని వివరిస్తూ చరిత్ర, నాటకం యాక్షన్లను మిళితం చేస్తూ నిఖిల్ అద్వానీ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' అందించారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ సిరీస్‌లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ (సిద్ధాంత్ గుప్తా), సర్దార్ వల్లభాయ్ పటేల్ (రాజేంద్ర చావ్లా), మహాత్మా గాంధీ (చిరాగ్ వోహ్రా), లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్ (ల్యూక్ మెక్‌గిబ్నీ) పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. రాజకీయ కుట్రల సూక్ష్మమైన విశ్లేషణ, వ్యక్తిగత త్యాగాలు, భావోద్వేగ తిరుగుబాట్లు ఆసక్తికరంగా సాగుతాయి.నెహ్రూ, పటేల్, గాంధీల విభిన్న భావజాలంతో కూడిన సన్నివేశాలతో ఈ సిరీస్ వైవిధ్యభరిత అనుభూతిని అందిస్తుంది. స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన ఈ ముగ్గురివీ.. వేటికవే విభిన్న థృక్కోణాలైనా సమర్థనీయమైనవిగా అనిపిస్తాయి. ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. దేశ నిర్మాణం ఆచరణాత్మక డిమాండ్ల మధ్య చిక్కుకున్న నాయకుడి అంతర్గత సంఘర్షణ నెహ్రూ పాత్ర చిత్రణలో తెలుస్తుంది. ముహమ్మద్ అలీ జిన్నాలోని అహం, ఆశయం, తెలివిని నటుడు ఆరిఫ్ జకారియా చక్కగా చూపించాడు. సర్దార్ పటేల్‌గా రాజేంద్ర చావ్లా, లియాఖత్ అలీ ఖాన్‌గా రాజేష్ కుమార్, లార్డ్ లేడీ మౌంట్‌బాటన్‌గా కార్డెలియా బుగేజా మెరుస్తారు. మలిష్కా మెండోన్సా సరోజినీ నాయుడుగా కనిపిస్తారు.ఈ సిరీస్ 1940ల నాటి భారతదేశానికి అద్దం పట్టింది. పునర్నిర్మించిన వైస్రాయ్ హౌస్ లేదా కాంగ్రెస్ కార్యాలయాలు..ఇలా ప్రతి ఫ్రేమ్ సమగ్ర పరిశోధనను ప్రతిబింబిస్తుంది. కథ, కథనాలను భావోద్వేగభరితంగా అందించటంలో అద్వానీ దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకుటుంది. భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఇతర చిత్రీకరణల మాదిరిగా కాకుండా, ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ 1944 - 1947 మధ్య కీలకమైన సంవత్సరాలకు దాని పరిధిని కుదించింది. ఇది గాంధీ–జిన్నా చర్చలు విభజనకు దారితీసిన వంటి సంఘటనలపైనే దృష్టి పెట్టింది. రాజకీయ కుతంత్రాలు, సైద్ధాంతిక వైరుధ్యాలు, తెరవెనుక చర్చలను చక్కగా చూపించారు.చదవండి: దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్' -
తెరకెక్కనున్న ఆర్బీఐ ప్రస్థానం!
దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న భారతీయ రిజర్వ్ బ్యాంకు సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించి స్టార్ ఇండియా వెబ్ సిరీస్ రూపొందించనుంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ముందుంది. దేశ ఆర్థిక వృద్ధిలో ఆర్బీఐ పాత్ర కీలకం. 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆర్బీఐ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. వీటికి సంబంధించిన అంశాలను స్టార్ ఇండియా వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కించనుంది.1935లో ఏర్పాటైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ప్రస్థానాన్ని తెలియజేసేలా వెబ్ సిరీస్ రూపొందించాలని ప్రముఖ కంపెనీలకు జులైలో సెంట్రల్ బ్యాంక్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) కింద బిడ్ ఆఫర్ చేసింది. ఇందులో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ లిమిటెడ్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా వంటి సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా టెక్నికల్ ఎవాల్యుయేషన్ రౌండ్లో అర్హత సాధించలేదు. దాంతో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వయాకామ్ 18 చివరి రౌండ్లోకి ప్రవేశించాయి. తాజాగా ఈ బిడ్‌ను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గెలుచుకుంది. వెబ్ సిరీస్ నిర్మించడానికి స్టార్ ఇండియాకు రూ.6.5 కోట్లు టెండర్ లభించినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలుఆర్ఎఫ్పీ పత్రం ప్రకారం, ఆర్బీఐ 90 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ జాతీయ టీవీ ఛానెళ్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో ప్రసారమయ్యేలా దాదాపు 25-30 నిమిషాల నిడివితో ఐదు ఎపిసోడ్లు రూపొందించాలి. ఈ ఎపిసోడ్లు ఆర్థిక వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ కీలక పాత్రను తెలియజేసేలా ఉండాలి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ పనితీరుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా ఉండాలి. ఆర్బీఐ కార్యకలాపాలు, విధానాలపై విశ్వాసం కలిగేలా రూపొందించాలి. -
ఆర్బీఐపై వెబ్ సిరీస్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంపై స్టార్ ఇండియా వెబ్ సిరీస్‌ను రూపొందించనుంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బ్యాంక్ కీలక పాత్ర గురించి ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 1935లో ప్రారంభమైన ఆర్బీఐ.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 వసంతాలు పూర్తి చేసుకుంది. వెస్ సిరీస్ రూపొందించేందుకు ఆర్బీఐ 2024 జూలైలో టెండర్లను పిలిచింది. స్టార్ ఇండియా, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా పోటీపడ్డాయి. స్టార్ ఇండియా రూ.6.5 కోట్ల విలువైన ఈ టెండర్‌ను దక్కించుకుంది. 25–30 నిముషాల నిడివిగల అయిదు ఎపిసోడ్స్ నిర్మిస్తారు. జాతీయ టీవీ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ఎపిసోడ్స్ ప్రసారం చేస్తారు. -
OTT: యానిమేటెడ్ సిరీస్ ‘డిస్పెకబుల్ మి 4’ రివ్యూ
మామూలు మూవీస్ లో సూపర్ కారెక్టర్స్ చెయ్యాలంటే చాలా ఖర్చు, కష్టం తో కూడుకున్న పని. కాని అదే యానిమేటడ్ కారెక్టర్స్ అయితే అంత ఖర్చు, కష్టం రెండూ ఉండవు. అంతేనా ఇప్పటి జెనరేషన్ కి బాగా నచ్చుతుంది కూడా. అందుకేనేమో రియల్ కారెక్టర్స్ కన్నా యానిమేటడ్ కారెక్టర్స్ కి డిమాండ్ & మార్కెట్ రెండూ ఎక్కువే. కాబట్టే ఒక్కో కారెక్టర్ సీరిస్ రూపేణా బోలెడన్ని పార్ట్స్ లో వస్తున్నాయి. అదే రేంజ్ లో ఇటీవల రిలీజ్ అయిన సినిమా డిస్పెకబుల్ మి 4. జియో సినిమా ఓటిటి వేదికగా తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ లభ్యమవుతోంది. డిస్పెకబుల్ సీరిస్ లో ఇది 5వ సినిమా. క్రిస్ రేనాడ్ దర్శకత్వం వహించిన సినిమా అనుకున్నట్టుగానే సూపర్ రివ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సిరీస్ ఫాలో అవుతున్నవాళ్ళకి దీనిలో కారెక్టర్స్ తో పాటు కథ కూడా సులువుగా అర్ధమవుతుంది. దీనిలో మెయిన్ కారెక్టర్ గ్రూ. ఇక గ్రూతో పాటు ఫిల్, రోన్ మరియు రఫ్ అనే మీనియన్స్. ఈ డిస్పెకబుల్ మి 4 కథాంశానికొస్తే గ్రూ కి ఒక కొత్త ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఒక చిన్న బాబు కూడా ఉంటాడు. కాని ఆ బాబు వాళ్ళ అమ్మ దగ్గర బానే వుంటాడు కాని గ్రూకి మాత్రం విసుగు పుట్టిస్తుంటాడు. కాని గ్రూ కి ఆ బాబంటే ఎంతో ఇష్టం. మరో పక్క తన ఎనిమీ అయిన మాక్స్ మీ లీమాల్ జైలు నుండి తప్పించుకుని గ్రూ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన గ్రూ ఫ్యామిలీ సేఫ్ హౌస్ కి వెళుతుంది. ఇక అక్కడ నుండి గ్రూ మాక్స్ మీ లీమాల్ ను ఎలా ఎదుర్కుంటుందన్నదే మిగతా సినిమా. పైన చెప్పుకున్నట్టు రియల్ కారెక్టర్స్ కన్నా యానిమేటడ్ కారెక్టర్స్ కథను మరో లెవల్ కు తీసుకువెళతాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మీనియన్స్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. సినిమా బ్యానర్ నేమ్ నుండే ఆ అల్లరి ప్రారంభమవుతుంది. గ్రూ చేసే సాహస విన్యాసాలు, మాక్సిమల్ క్రియేట్ చేసిన ఎక్సట్రార్డినరీ వెహికల్ సూపర్ గా ఉంటాయి. పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా ఈ వీకెండ్ కు మస్ట్ వాచ్ బుల్ మూవీ డిస్పెకబుల్ మి 4. జీయో సినిమా వేదికగా ఉంది చూసేయండి. - ఇంటూరు హరికృష్ణ. -
ఓటీటీకి టాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
సినీ ప్రియులు ఇప్పుడంతా ఓటీటీల వైపే చూస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు అభిమానులు ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగానే ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్‌ను అందిస్తున్నాయి. అలా మరో యూత్‌ఫుల్ కామెడీ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో తెరకెక్కించిన ఈ కామెడీ వెబ్‌సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్.. ఒక్కొక్కరు ఒక్కో ఆణిముత్యం అనేది ఉపశీర్షిక.బిగ్‌బాస్ రన్నరప్ అఖిల్ లీడ్ రోల్లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. తెలుగు రియాలిటీ బిగ్‌బాస్‌లో రెండు సార్లు రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ సీజన్ 4తో పాటు బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో అతడికి టైటిల్ చేజారింది. బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ అఖిల్‌కు పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రాలేదు.తాజాగా వేరే లెవెల్ ఆఫీస్ అంటూ ఈ సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు అఖిల్. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ నెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో అఖిల్ సార్ధక్, మహేష్ విట్టాతో పాటు పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, యూట్యూబ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు 50కి పైగా ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.తమిళ రీమేక్‌గా వేరే లెవెల్ ఆఫీస్..తమిళంలో విజయవంతమైన వేర మారి ఆఫీస్‌కు రీమేక్‌గా ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సిరీస్ సీజన్- 2 ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్-1 యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీవితం ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించినట్లు పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. View this post on Instagram A post shared by OTT Updates (@upcoming_ott_release) -
తెలుగులో సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. ఏ ఓటీటీకి రానుందంటే?
ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. సరికొత్త కంటెంట్ ఉన్న సిరీస్‌లు, సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగులో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హరికథ.. సంభవామి యుగేయుగే. పీరియాడికల్ బ్యాప్‌డ్రాప్‌లో మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో హీరో శ్రీకాంత్, పూజిత పొన్నాడ, అర్జున్ అంబటి, బిగ్‌బాస్ దివి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సరికొత్త వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ వెల్లడించింది. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సిరీస్ ద్వారా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో తొలిఅడుగు వేయనుంది. దసరా సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రివీల్ చేసింది సంగతి తెలిసిందే.త్వరలోనే హరికథ సంభవామి యుగే యుగే వెబ్ సిరీస్ రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushotstartelugu) -
తెలుగులో సరికొత్త వెబ్ సిరీస్.. డైరెక్టర్‌గా టాలీవుడ్ కమెడియన్!
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సరికొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. పౌరాణిక నేపథ్యంలో ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ(అదిరే అభి) దర్శకత్వంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్‌కు చిరంజీవా అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ టాలీవుడ్ మైథలాజికల్ వెబ్ సిరీస్ డిసెంబర్లో స్ట్రీమింగ్ రానుందని ప్రకటించారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేయనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే భక్తి కోణంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ వెబ్ సిరీస్‌ను రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ నిర్మించారు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్‌కు అచ్చు రాజమణి సందీతమందిస్తున్నారు. -
టాలీవుడ్ మిస్టరీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీల్లో వెబ్ సిరీసులకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ లాంటి సిరీస్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే ఏ భాషలోనైనా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అయితే తెలుగులో స్ట్రైట్ వెబ్ సిరీస్‌లు చాలా తక్కువే వచ్చాయి. తాజాగా తెలుగులో తెరకెక్కించిన డిటెక్టివ్ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి రానుంది.(ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన డిటెక్టివ్ సిరీస్ 'వికటకవి'. ఈ వెబ్ సిరీస్‌కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా.. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఈ సిరీస్‌ను తెరకెక్కించడం మరో విశేషం. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులోకి రానుంది. The suspenseful and suspicious tale of Amaragiri and the mystery that follows it. 🫣It will see you on screens from 28th November 💥#Vikkatakavi, Amaragiri and the team wish you a Happy Diwali 🪔#VikkatakaviOnZee5@nareshagastya @akash_megha @pradeepmaddali @srtmovies pic.twitter.com/0b2G7b69Lz— ZEE5 Telugu (@ZEE5Telugu) November 1, 2024 -
మున్నా భయ్య ఈజ్ బ్యాక్.. సినిమాగా 'మీర్జాపుర్' సిరీస్
మన దేశంలో ఓటీటీల్లోనే ద బెస్ట్ వెబ్ సిరీస్‌ల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు 'మీర్జాపుర్'. తొలుత హిందీలో మాత్రమే తీశారు. కానీ ఊహించని రెస్పాన్స్ వచ్చేసరికి తెలుగు లాంటి ప్రాంతీయ భాషల్లో డబ్ చేశారు. దీంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పటికే మూడు సీజన్లు రాగా.. నాలుగో సీజన్ కూడా ఉంటుందని అన్నారు. ఇంతలోనే మూవీగా దీన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు)'మీర్జాపుర్' వెబ్ సిరీస్‌లో హీరో కంటే మున్నాభయ్య అనే విలన్ పాత్రకే బీభత్సమైన క్రేజ్ వచ్చింది. తొలి రెండు సీజన్లలో ఈ పాత్ర ఉండటంతో ఎంటర్టైనింగ్గా అనిపించింది. మూడో సీజన్లో మున్నాభయ్యా లేకపోయేసరికి చాలామందికి సిరీస్ నచ్చలేదు. ఇక నాలుగో సీజన్ అంటే సాహసమనే చెప్పాలి.సరే ఇదంతా పక్కనబెడితే 'మీర్జాపుర్' సిరీస్‌లో మితిమీరిన హింసాత్మక సన్నివేశాలు, బూతులపై విమర్శలు వచ్చినప్పటికీ.. జనాలు వాటినే తెగ చూశారు. ఇప్పుడు 2026లో 'మీర్జాపుర్'ని సినిమాగా తీసుకొస్తామని ప్రకటించారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ కొత్త కథ ఏం చూపిస్తారు? బూతులు, వయలెంట్ సీన్స్ లాంటివి లేకుండా ఇంటెన్సెటినీ ఎలా చూపిస్తారనేది పెద్ద క్వశ్చన్. అయితే ఇదంతా సిరీస్‌కి ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలానే అనిపిస్తుంది!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
'ప్రకృతిని కట్ చేస్తే ప్రళయమే'.. ఆసక్తిగా తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్!
పవన్ సిద్ధు, తేజస్వి, అనన్య శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందించిన వెబ్ సిరీస్ 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్-2'. తెలుగులో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మరోసారి ఓటీటీ ప్రియులను అలరించేందుకు అరుణ్‌కుమార్ సీజన్ 2 వచ్చేస్తోంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. తాజాగా సీజన్-2 ట్రైలర్ రిలీజైంది. సీజన్-1లో హర్షిత్ రెడ్డి హీరోగా కనిపించగా.. ఇందులో పవన్ సిద్ధు నటించారు.ఈ వెబ్ సిరీస్‌లో కార్పొరేట్ వరల్డ్‌లో ఓ యువకుడు ఎలా రాణించాడనే కథాంశంతో తెరకెక్కించారు. ఫుల్ కామెడీతో పాటు కార్పొరేట్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది. అయితే ఇందులో డైలాగ్స్, సీన్స్ ఓటీటీ ప్రియులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిిరీస్కు ఆదిత్య కేవీ దర్శకత్వం వహించారు. -
ఆ విషయంలో వాళ్లిద్దరిని వేడుకున్నా: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించిన అమెరికన్ స్పై-యాక్షన్ సిరీస్ సిటాడెల్కు ఇండియన్ వర్షన్‌గా ఈ సిరీస్ రూపొందించారు.అయితే ఈ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో ఈ సిరీస్‌లో నా ప్లేస్‌లో వేరొకరిని తీసుకోవాలని దర్శకులైన రాజ్, డీకేలకు చెప్పానని సామ్ తెలిపింది. అంతేకాకుండా తన స్థానాన్ని భర్తీ చేయగల నటిని కూడా సిఫార్సు చేశానని వెల్లడించింది. కానీ తన విజ్ఞప్తిని వాళ్లిద్దరు తిరస్కరించారని సమంత పేర్కొంది. (ఇది చదవండి: నాకు వారి సపోర్ట్ లేకుండా ఉంటే.. మంత్రి వ్యాఖ్యలపై మరోసారి సమంత)సమంత మాట్లాడుతూ.. 'ఈ సిరీస్ నేను చేస్తానని నిజంగా అనుకోలేదు. అందుకే నా ప్లేస్‌లో మరొకరిని తీసుకోమని వారిని వేడుకున్నా. నేను చేయలేనని నేను కచ్చితంగా చెప్పా. ఆ పాత్రకు తగిన వారి పేర్లను కూడా పంపా. కానీ వాళ్లు నా స్థానంలో వేరొకరిని తీసుకునేందుకు నిరాకరించారు. ఇప్పుడు ఈ సిరీస్‌లో తాను నటించినందుకు సంతోషంగా ఉంది. దర్శకులు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు' తెలిపింది.కాగా.. సమంత గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లి చికిత్స తీసుకుని కోలుకుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీకి థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రానా చేతుల మీదుగా ట్రైలర్
నవీన్ చంద్ర, ముత్తు కుమార్, నందా, శ్రిందా, మనోజ్ భారతీ రాజా కీలక పాత్రల్లో తెరకెక్కించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్. నలుగురు పిల్లల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ థ్రిల్లర్ సిరీస్‌ను రూపొందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈనెల 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ విషయాన్ని రానా తన ట్విటర్లో షేర్ చేశారు. కాగా.. వెబ్ సిరీస్ తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు భరత్ మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా అల్కెమిస్ దర్శకత్వం వహించారు.DANGER awaits at every step.Ee Vaikuntapaali aata chudadaniki meeru siddhama?🔥Trailer Out Now: https://t.co/jpNQ20usGi#SnakesandLaddersOnPrime, New Series, Oct 18 only on @PrimeVideoIN@stonebenchers @karthiksubbaraj @kalyanshankar @kaarthekeyens @Naveenc212 @nandaa_actor…— Rana Daggubati (@RanaDaggubati) October 16, 2024 -
ఓటీటీకి తెలుగు వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన అలరించిన టాలీవుడ్ వెబ్ సిరీస్. గతేడాది జూన్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. 2016లో హిందీలో వచ్చిన 'అఫీషియల్ చుక్యాగిరి' అనే వెబ్ సిరీస్‌కు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కార్పొరేట్ వరల్డ్‌లో ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడు.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనేదే అసలు కథ. తొలి సీజన్ ఐదు ఎపిసోడ్లుగా తెరకెక్కించారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ సీజన్-2 అలరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. కాగా.. ఈ సిరీస్ మొదటి సీజన్లో హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ కీలక పాత్రలు పోషించారు. అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్ బ్యానర్లపై బి.సాయికుమార్, శరణ్ సాయికుమార్ నిర్మించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
తెలుగులోకి మరో క్రేజీ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో సినిమాలు వచ్చినట్లే.. ఓటీటీలో కొత్త కొత్త వెబ్ సిరీసులు కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. తెలుగులో స్ట్రెయిట్‌గా తీయనప్పటికీ.. ఇతర భాషల్లో తీసిన సిరీస్‌లని డబ్ చేసి మరీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలా ఇప్పుడు ఓ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)'1000 బేబీస్' పేరుతో తీసిన ఈ సిరీస్‌ని సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఓ పోలీస్ టీమ్ దేనికోసమే సెర్చ్ చేస్తున్నారు. మరోవైపు అడవి మధ్యలో ఓ ఇంట్లో ముసలావిడ. ట్రైలర్లో పెద్దగా కథని రివీల్ చేయలేదు గానీ చూస్తుంటే ఇదేదో మంచి థ్రిల్లర్‌లా అనిపిస్తుంది.మలయాళంలో తీసినప్పటికీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ డబ్ చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అక్టోబరు 18న అంటే వచ్చే శుక్రవారం ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. మీరు ట్రైలర్‌పై ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!) -
ఓటీటీకి సరికొత్త థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
సరికొత్త కంటెంట్‌తో ఓటీటీలు సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఏ భాషలో తెరకెక్కినా సరే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు మంచి డిమాండ్ పెరిగింది. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగానే మంచి కంటెంట్‌ను అందిస్తున్నారు. తాజాగా తమిళంలో తెరకెక్కించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్.ఈ ఏడాది మార్చిలో ప్రైమ్ వీడియో ఈ సిరీస్‌ను ప్రకటించారు. ఈ సిరీస్‌లో నవీన్ చంద్ర, ముత్తు కుమార్, నందా, శ్రిందా, మనోజ్ భారతీ రాజా కీలక పాత్రల్లో నటించారు. నలుగురు పిల్లల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది.ఈనెల 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేస్తూ ట్వీట్ చేసింది.తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు భరత్ మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా అల్కెమిస్ దర్శకత్వం వహించారు. Roll the dice and accept your fate 🐍🪜#SnakesandLaddersOnPrime, New Series, Oct 18 pic.twitter.com/dFi8ZVCbt7— prime video IN (@PrimeVideoIN) October 7, 2024 -
ఒకే ఫ్రేమ్‌లో సమంత, ప్రియాంక.. థియేటర్లో సందడి (ఫోటోలు)
-
S Jaishankar: ఆ విమానంలో నా తండ్రి కూడా ఉన్నారు
జెనీవా: ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలై వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’వెబ్‌సిరీస్‌పై ఇంకా చర్చ జరుగుతున్న వేళ అలాంటి హైజాక్ ఉదంతంలో తన తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం కూడా బాధితుడిగా ఉన్నారని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. 1984 ఏడాదిలో జరిగిన విమాన హైజాక్ ఉదంతంలో తన కుటుంబం సైతం తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొందని ఆయన వ్యాఖ్యానించారు. జెనీవాలో ఒక భారతీయసంతతి వ్యక్తులతో భేటీ సందర్భంగా జైశంకర్ తన కుటుంబం గతంలో పడిన వేదనను అందరితో పంచుకున్నారు. ఏడుగురు హైజాకర్లు చొరబడి.. ‘1984 జులై ఐదో తేదీన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 421 విమానం శ్రీనగర్ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి టేకాఫ్ అయి మధ్యలో చండీగఢ్ సమీపంలోని పఠాన్‌కోట్‌లో ఆగింది. అప్పుడు ఏడుగురు హైజాకర్లు కాక్‌పిట్‌లోకి చొరబడి విమానాన్ని తమ అ«దీనంలోకి తీసుకున్నారు. విమానాన్ని హైజాక్ చేసిన వారంతా ఆలిండియా సిఖ్ స్టూడెంట్స్ ఫెడరేషన్‌కు చెందిన వాళ్లు. సిక్కు వేర్పాటువాది జరై్నల్ సింగ్ భింద్రన్‌వాలేతోపాటు ఇతర నేతలను విడుదలచేయాలని డిమాండ్ విధించారు. విమానాన్ని లాహోర్‌కు, తర్వాత కరాచీకి, చిట్టచివరకు దుబాయ్‌కు తీసుకెళ్లారు. విమానం విదేశీగడ్డపైకి వెళ్లడంతో భారత విదేశాంగ శాఖ సైతం రాయబారం నడిపేందుకు రంగంలోకి దిగింది. ఇండియన్ ఫారిన్ సరీ్వస్‌లో చేరిన తొలినాళ్లలో.. అప్పుడు నేను ఇండియన్ ఫారిన్ సరీ్వస్(ఐఎఫ్ఎస్) యువ అధికారిగా పనిచేస్తున్నా. ప్రయాణికులన విడిపించేందుకు హైజాకర్లతో చర్చలు జరపాల్సిన బృందంలో నేను కూడా సభ్యునిగా ఉన్నా. అత్యంత కీలకమైన పనిలో నిమగ్నంకావాల్సి ఉన్నందున ఇంటికి రాలేనని చెప్పేందుకు మా అమ్మకు ఫోన్ చేశా. అప్పుడు నా భార్య ఉద్యోగానికి వెళ్లింది. ఇంట్లో పసిబిడ్డగా ఉన్న నా కుమారుడిని మా అమ్మ ఒక్కరే చూసుకుంటోంది. ‘‘ఇంటికి రావడం కుదరదు. ఇక్కడ విమానాన్ని హైజాక్ చేశారు’’అని చెప్పా. అయితే పనిలో సీరియస్‌గా మునిగిపోయాక నాలుగు గంటల తర్వాత నాకో విషయం తెల్సింది. అదేంటంటే నా తండ్రి కృష్ణస్వామి కూడా అదే విమానంలో బందీగా ఉన్నారు. ఓవైపు హైజాక్ విషయం తెల్సి ప్రయాణికుల కుటుంబసభ్యులు భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల్లో నేను ఉన్నా. మరోవైపు ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సిన వ్యక్తిని కూడా నేను. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి నాది. ఏదేమైనా 36 గంటల ఉత్కంఠ తర్వాత ఖలిస్తాన్ మద్దతుదారులు అధికారుల ఎదుట లొంగిపోవడంతో కథ సుఖాంతమైంది. విమానంలోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైజాక్ ఉదంతం విషాదాంతంగా ముగియకుండా ఒక సమస్యకు పరిష్కారంగా మలుపు తీసుకుంది’’అని అన్నారు. ‘‘నేనింకా కాందహార్ వెబ్‌సిరీస్ చూడలేదు. అయితే హైజాకర్లతో ప్రభుత్వం, మధ్యవర్తులు కాస్తంత వెనక్కి తగ్గి మాట్లాడినట్లుగా అందులో చూపించారట కదా. సినిమాల్లో హీరోను మాత్రమే అందంగా చూపిస్తారు. ప్రభుత్వం సరిగా పనిచేసినా చూపించరు’’అని అన్నారు. అణ్వస్త్ర విధానాల్లో సుబ్రహ్మణ్యం కీలకపాత్ర మాజీ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణస్వామి హైజాక్ జరిగిన ఏడాది ఢిల్లీలోని డిఫెన్స్ స్టడీస్, అనాలసిస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ తర్వాత భారత ‘అణ్వస్త్ర’విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖ అంతర్జాతీయ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడిగా పేరొందారు. ‘‘అణ్వాయుధాలను తొలుత భారత్ తనంతట తానుగా ఏ దేశం మీదా ప్రయోగించకూడదు. ఒక వేళ భారత్ మీద ఎవరైనా అణ్వాయుధం ప్రయోగిస్తే ధీటైన సమాధానం చెప్పే స్థాయికి మనం ఎదగాలి’’అనే ప్రాథమిక సిద్ధాంతాల్లో రూపకల్పనలో ఈయన పాత్ర ఉందని చెబుతారు. జాతీయ భద్రతా మండలి సలహా బోర్డుకు తొలి కనీ్వనర్‌గా వ్యవహరించారు. హైజాకర్లతో చర్చల వేళ ‘‘కావాలంటే మొదట నన్ను చంపండి. ప్రయాణికులను ఏమీ చేయకండి’’అని హైజాకర్లతో కృష్ణస్వామి అన్నారని నాటి పాత్రికేయులు రాజు సంతానం, దిలీప్ బాబ్లు చెప్పారు. -
ఐటీ నుంచి డైరెక్షన్ దాకా..
‘ఇక్కడకు డైరెక్టర్ అవుదామనే వచ్చాను. ఎస్.. ముందు ఊహించిన దానికన్నా ప్రాక్టికాలిటీలో భిన్నంగానే ఉంది. అయినాసరే అనుకున్నది సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది’ అంటున్నారు మానసశర్మ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన మానస.. సోనీలివ్‌లో గురువారం నుంచి అందుబాటులోకి రానున్న బెంచ్లైఫ్ వెబ్‌సిరీస్ ద్వారా దర్శకురాలిగా మారుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం. చిన్నప్పటి నుంచి కథలు చదవడం ఇష్టం. అలాగే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ విఠలాచార్య వంటి గొప్ప నటుల, దర్శకుల చిత్రాలు బాగా చూశాను. వాటి ద్వారా ఫిల్మ్ మేకింగ్‌పై ఇష్టం ఏర్పడింది. వైజాగ్‌లో ఇంజనీరింగ్ చదివే సమయంలో మల్టీమీడియా ప్రాజెక్ట్ సబి్మట్ చేయమంటే నా క్లాస్‌మేట్స్‌కు భిన్నంగా నేను షార్ట్ ఫిల్మ్ చేశా. చదువు పూర్తయ్యాక ఐటీ కంపెనీలో ఉద్యోగిగా ఏడాది పాటు పనిచేసినా.. సినిమాలపై ఉన్న ఇష్టం నన్ను అక్కడ ఉండనివ్వలేదు. రిజైన్ చేసి డైరెక్టర్ కావాలనే లక్ష్యంతోనే సినీరంగంలోకి ప్రవేశించాను. రైటర్ టూ డైరెక్టర్.. తొలుత రచయితగా 3 వెబ్‌సిరీస్‌లకు పనిచేశాను. మెగా డాటర్ నిహారిక బెంచ్లైఫ్ ద్వారా నాకు డైరెక్టర్‌గా తొలి అవకాశం ఇచ్చారు. తొలిసారి రాజేంద్రప్రసాద్, తనికెళ్లభరణి లాంటి గ్రేట్ యాక్టర్స్‌ని డైరెక్ట్ చేశాను. వారు కూడా నన్ను ప్రోత్సహించారు. షూటింగ్లో 40 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. క్లైమాక్స్ సీన్ చేశాక.. ‘ఆ నలుగురూ సినిమా తర్వాత గ్లిజరిన్ అవసరం లేకుండా కన్నీళ్లు పెట్టించిన సీన్ మళ్లీ ఇదే’ అని రాజేంద్రప్రసాద్ అనడం.. నా ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పాలి. ఒక్క ఛాన్స్.. చాలు.. మొదటి నుంచీ డైరెక్టర్ అవుదామనే నా లక్ష్యం నెరవేరుతున్నందుకు హ్యాపీ. రాసుకున్న కథ సరైన రీతిలో అందించాలని వచి్చన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని తప్ప వేరే విషయాలు ఆలోచించడం లేదు. త్వరలో పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేయనున్నా. యువన్‌శంకర్ రాజా మ్యూజిక్.. మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి’ అంటూ ముగించారు మానసశర్మ. ఏదేమైనా విజయనిర్మల, నందినీరెడ్డిల తర్వాత భూతద్ధంలో పెట్టి వెదికినా లేడీ డైరెక్టర్ కనిపించని పరిస్థితుల్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో మన ముందుకు వస్తున్న తెలుగమ్మాయి మానస శర్మ దర్శకురాలిగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ..చెప్పేద్దాం.. ఆల్ ద బెస్ట్... -
ఓటీటీకి టాలీవుడ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన టాలీవుడ్ వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్. ఈ వెబ్ సిరీస్‌కు మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మించారు. ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.ఐటీరంగంలో బెంచ్‌పై ఉండడం అనే మాటలు తరచుగా వింటుంటాం. ఆ సబ్జెక్ట్‌నే వెబ్ సిరీస్‌గా ఆవిష్కరించారు. ట్రైలర్లో డైలాగ్స్, సీన్స్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు దాదాపు ఏడు భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో ఈ సిరీస్ ప్రసారమవ్వనుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, నయన్ సారిక, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు పీకే దండి సంగీతమందించారు. -
నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై తీవ్ర అభ్యంతరం.. ఇకపై తప్పు జరగదన్న మేకర్స్!
ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సరికొత్త వెబ్ సిరీస్ 'ఐసీ 814: కాందహార్ హైజాక్'. ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సిరీస్‌లోని కొన్ని సన్నివేశాలపై పెద్దఎత్తున వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే సిరీస్‌పై మండిపడ్డ కేంద్రం వివరణ ఇవ్వాలంటూ మేకర్స్‌కు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ వివాదంపై నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ కేంద్ర, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారుల ముందు హాజరయ్యారు.ఇకపై కంటెంట్ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కంటెంట్‌ను ప్రసారం చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నారులకు సంబంధించిన కంటెంట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని ఓటీటీ సంస్థ అంగీకరించింది.అసలేంటీ వివాదం..1999లో భారత విమానాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసిన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్‌లో హైజాకర్ల పేర్లను శంకర్, భోలా అని మార్చి చూపించడమే కాకుండా.. వారిని మానవత్వమున్న వ్యక్తులుగా చిత్రీకరించారు. దీంతో హైజాకర్లు తమ మత గుర్తింపు దాచిపెట్టేందుకే మారుపేర్లు పెట్టుకున్నారని.. ఈ సిరీస్ రూపొందించిన వారు కావాలనే ఆ పేర్లనే క్యారెక్టర్స్‌కు పెట్టారని భాజపా ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. ఈ క్రమంలోనే కేంద్రం దీన్ని తీవ్రంగా పరిగణించి సమన్లు జారీ చేసింది. -
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఓటీటీల్లో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ జానర్ సినిమాలే కాదు.. వెబ్ సిరీస్‌లు సైతం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. అందువల్లే క్రైమ్ జానర్లో ఎక్కువగా వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తున్నారు. తాజాగా మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.విలక్షణ నటుడు కెకె మీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ముర్షిద్. ఈ సిరీస్‌లో ఆయన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈనెల 30 నుంచే జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. కాగా.. కెకె మీనన్ ఈ మధ్యే శేఖర్ హోమ్ అనే మరో సిరీస్‌లోనూ కనిపించారు. అంతేకాకుండా ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో తనూజ్ వీర్వానీ, వేదికా భండారీ, అనంగ్ దేశాయ్, జాకిర్ హుస్సేన్ కీలక పాత్రలు పోషించారు.Dushmanon ke liye bura waqt bankar, 20 saal baad, Bambai ka raja - Murshid Pathan apni takht par laut raha hai! 👑🔥#Murshid premieres 30th August, only on #ZEE5. Trailer out now! #MurshidOnZEE5 pic.twitter.com/mlh1I8skXS— ZEE5 (@ZEE5India) August 20, 2024 -
OTT: ‘చట్నీ సాంబార్’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: ‘చట్నీ సాంబార్’ వెబ్ సిరీస్నటీనటులు: యోగిబాబు, వాణి భోజన్, చంద్రన్, నితిన్ సత్య, దీపా శంకర్, తదితరులుదర్శకత్వం: రాధామోహన్ఓటీటీ: హాట్ స్టార్వేడుకేదైనా, వేదికేదైనా, సందర్భం ఎక్కడైనా, సమయం ఎప్పుడైనా మనిషికి ఎప్పటికీ తృప్తినిచ్చేది రుచికరమైన వంటలు. లేచీ లేవగానే కాఫీ టీ ల దగ్గర నుండి రాత్రి పడుకోబోయేముందు డెజర్ట్ వరకు మనం తినే ప్రతి పదార్ధానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది మరి. తినే పదార్థాల మార్కెట్ అన్ని రంగాలలో విరివిగా వుంది. ఆ కోవలేనే హాట్ స్టార్ వేదికగా ఇటీవల ఓ సిరీస్ విడుదలైంది. దాని పేరే చట్నీ సాంబార్. మనం రోజూ విరివిగా వాడే పదాలు ఇవి. చట్నీ సాంబార్ రుచిలో ఎంత బాగుంటాయో ఈ సిరీస్ కూడా అదే విధంగా ఉంటుంది.ప్రముఖ దర్శకులు రాధామోహన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వర్ధమాన తమిళ హాస్య నటుడు యోగి బాబు ప్రధాన పాత్రలో నటించాడు. ఇక కధాంశానికొస్తే రత్నసామి అనే వ్యక్తి ఊటీలో అముదా కేఫ్‌ను నడుపుతుంటాడు , ఈ కేఫ్ లో సాంబార్ చాలా ఫేమస్. ఒకరోజు రత్నసామి తీవ్రఅనారోగ్యానికి గురవుతాడు. మరణశయ్యపై, అతను తన తల్లిని వివాహం చేసుకునే ముందు అముద అనే మహిళతో నివసించాడని మరియు ఆమె ద్వారా తనకు ఒక కొడుకు ఉన్నాడని తన కొడుకు కార్తీక్‌కు వెల్లడిస్తాడు. కార్తీక్ నుండి తన సవతి సోదరుడిని కలుస్తానని వాగ్దానం పొందిన తరువాత, రత్నసామి మరణిస్తాడు. కార్తీక్ సవతి సోదరుడు సచిన్. చెన్నై నగరంలో సచిన్ ఓ దోసెలబండి నడుపుతుంటాడు. అతని దగ్గర చట్నీ ఫేమస్. కార్తీక్ సచిన్ ను కనుగొని, అతనిని ఊటీకి రత్నసామి అంత్యక్రియలు జరపడానకి తీసుకువస్తాడు. ఇంట్లో ఉన్న ఎవరికీ సచిన్ నచ్చడు. మరి ఇంట్లో వారినందరినీ మెప్పించి సచిన్ వచ్చిన పని నెరవేర్చాడా? ఈ దశలో కార్తీక్ మరియు సచిన్ ఎటువంటి సవాళ్ళను ఎదుర్కున్నారన్న విషయం ఇడ్లీ లేదా దోశలు తింటూ ఈ చట్నీ సాంబార్ ను హాట్ స్టార్ లో చూశేయండి. మంచి కామెడీ ఎంటర్ టైనర్ ఈ చట్నీ సాంబార్.-ఇంటూరు హరికృష్ణ -
నాగచైతన్య ఎంగేజ్మెంట్.. అతనితో సమంత డేటింగ్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా నిశ్చితార్థం తర్వాత చైతూ చాలా సంతోషంగా ఉన్నాడని నాగ్ తెలిపారు.అయితే చైతూకు ఎంగేజ్మెంట్ కావడంతో అందరి దృష్టి ఆయన మాజీ భార్య సమంతపైనే పడింది. చైతన్య నిశ్చితార్థం తర్వాత సమంత ఎలాంటి పోస్టులు పెడుతుందా అని నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వీరిద్దరి ఎంగేజ్మెంట్ గురించి ఆమె ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు.డైరెక్టర్‌తో డేటింగ్?ఈ సంగతి అటుంచితే.. తాజాగా సమంతపై నేషనల్ మీడియాలో తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రెడ్ఇట్ కథనం ప్రకారం సామ్ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వరుస కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అతను సమంత నటిస్తోన్న సిటాడెల్.. హనీ బన్నీ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలోనూ సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేశారు. ఆ సిరీస్ తర్వాతే అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుంది. అయితే సమంత- రాజ్ నిడిమోరుపై వస్తున్న రూమర్స్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రెండు వెబ్ సిరీసుల్లో వీరిద్దరు కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి కథనాలు వినిపిస్తున్నాయని మరికొందరు అంటున్నారు. కాగా.. ఇప్పటికే పెళ్లయిన రాజ్ నిడిమోరు తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు.కాగా.. 2017లో సమంత- నాగచైతన్య పెళ్లాడింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు తమ తమ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నారు. -
ఓటీటీకి క్రేజీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
కోలీవుడ్ నటుడు సత్యరాజ్, రేఖ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా వెబ్ సిరీస్ 'మై హస్బెండ్ ఫర్ఫెక్ట్'. ఈ సిరీస్‌లో టాలీవుడ్ హీరోయిన్ వర్షబొల్లమ్మ కూడా నటించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌కు తమిర దర్శకత్వం వహించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ఖరారు చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఓ ఉమెన్స్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసే పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు భార్యగా రేఖ కనిపించనున్నారు. టైటిల్ చూస్తుంటేనే భార్య, భర్తల కోణంలోనే కథను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్లో వచ్చే సన్నివేశాలు చూస్తుంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్‌తోనే ప్రధానంగా తెరకెక్కించారని కనిపిస్తోంది.కాగా.. మై పర్ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్‌ను మహమ్మద్ రషిత్ నిర్మించగా.. విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్‌ను ఆగస్టు 16 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ అధికారికంగా వెల్లడించింది.