Yadadri District News
-
పన్నులే.. పనుల్లేవ్ !
ఖర్చులు పెరిగాయి డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగు నీరు ఇళ్ల మధ్య నిలుస్తుంది. డ్రెయినేజీలు నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. అయినా పట్టించుకున్న నాథుడే లేడు. గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేసినా మాకు ఏం ప్రయోజనం లేదు. పైగా ఖర్చులు పెరిగాయి. –స్వామి, బొమ్మాయిపల్లి పంచాయతీగా ఉన్నప్పుడే బాగు కొత్తగా నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో వీధి దీపాలు లేవు. రాత్రి సమయంలో చిన్నారులు, మహిళలు బయటకు వెళ్లాలంటే బయపడుతున్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని చాలాసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించాం. ఇవే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. పంచాయతీగా ఉన్నప్పుడే బాగుండేది. –గోపాల్, పగిడిపల్లి పన్నులు చెల్లిస్తున్నా ఏంలాభం మున్సిపాలిటీలో కలిపి నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకు సీసీ రోడ్లు వేయలేదు. గ్రామంలో కొన్ని చోట్ల మట్టి రోడ్లపై ఏడాది క్రితం కంకర పోశారు. ఇప్పటి వరకు సీసీ వేయకపోవడంతో నడవలేకపోతున్నాం. డ్రెయినేజీలు కూడా లేవు. వర్షాలు వస్తే ఇంటి పక్కన నీరు నిలిచి కుంటలా మారుతుంది. పన్నులు చెల్లిస్తున్నా పనులు మాత్రం జరగడం లేదు. –లక్ష్మమ్మ, రాయగిరి భువనగిరి : మున్సిపాలిటీలో విలీనమైతే తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయనుకున్న ప్రజలకు నిరాశే ఎదురైంది. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పన్నులు పెరిగాయే తప్ప సౌకర్యాలు సమకూరడం లేదని.. సమస్యలను అధికారులు, పాలకవర్గ సభ్యులకు విన్నవించినా స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. మూడు గ్రామాలు విలీనం భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లి, రాయగిరి, పగిడిపల్లి గ్రామాలను 2019లో భువనగిరి మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఈ గ్రామాల విలీనంతో భువనగిరి మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 35కు చేరింది. ఇందులో రాయగిరి 2,3,4 వార్డులు, బొమ్మాయిపల్లి 11వ వార్డు, పగిడిపల్లి 12 వార్డు పరిధిలో ఉంది. ఆస్తిపన్ను చెల్లిస్తున్నా సమకూరని సౌకర్యాలు విలీన గ్రామాల ప్రజలు మున్సిపాలిటీలోని అందరి మాదిరిగానే ఏటా ఆస్తిపన్ను చెల్లిస్తున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను డిమాండ్ రూ.6.62 కోట్లు ఉండగా 90 శాతానికి పైగా వసూలైంది. 2024–25 సంవత్సరానికి గాను రూ.8.85 కోట్లు డిమాండ్ ఉంది.ఆస్తిపన్ను చెల్లిస్తున్నా సౌకర్యాలు సమకూరడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పటి వసతులే తప్ప.. కొత్తగా అభివృద్ధి జరగలేదని వాపోతున్నారు. మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఆయా గ్రామాల ప్రజలకు ఉపాధిహామీ పథకం వర్తించడం లేదు. దీంతో నిరుపేదలకు ఉపాధి లేకుండాపోయింది. అభివృద్ధికి నోచని విలీన గ్రామాలు ఫ సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వీధి దీపాలు లేక అవస్థలు ఫ వసతుల కల్పనపై అధికారులు, పాలకవర్గం శీతకన్ను ఫ పన్నులు పెరిగాయే తప్ప అభివృద్ధి జరగడం లేదని ప్రజల ఆవేదన విలీన గ్రామాలు గ్రామం జనాభా ఓటర్లు రాయగిరి 5,245 3,300పగిడిపల్లి 1,134 550బొమ్మాయిపల్లి 1,089 650నిధులు రాగానే కేటాయిస్తాం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే విలీన గ్రామాలకు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం. ప్రజలనుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. పరిష్కరించేందుకు నిధుల కోసం ఎదురుచూస్తున్నాం. –రామాంజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్, భువనగిరి -
వ్యాధిరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
మోటకొండూర్ : గ్రామాలను వ్యాధిరహితంగా తీర్చిదిద్దేందుకు వైద్యారోగ్య సిబ్బంది కృషి చేయాలని నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రాం అధికారి సాయిశోభ సూచించారు. శుక్రవారం మోటకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.ఫార్మసీ, ఓపీ, ల్యాబ్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఆరోగ్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఐవీ, క్షయ, లెప్రసీ వంటి వ్యాధులు సంక్రమించకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు విజయ్, హారిక, పార్వతమ్మ పాల్గొన్నారు. పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులునల్లగొండ రూరల్ : కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్ఎం రాజశేఖర్ తెలిపారు. 7 డిపోల నుంచి అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి, బీమవరంలో సోమేశ్వర స్వామి, పాలకొల్లులో క్షీరలింగేశ్వర స్వామి, సామర్లకోటలో బీమలింగేశ్వర స్వామి క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 24న ఆదివారం రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. వివరాలకు మిర్యాలగూడ : 08689–241111, నల్లగొండ 7382834610, సూర్యాపేట హైటెక్ 949492665, సూర్యాపేట న్యూ 7382943819, కోదాడ 7780433533, దేవరకొండ 8639049226, యాదగిరిగుట్ట 9885103165 నంబర్లను సంప్రదించాలన్నారు. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు మర్యాల విద్యార్థిబొమ్మలరామారం : మండలంలోని మర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్.నరేష్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 7న జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి అండర్– 14 బాలుర ఖోఖో పోటీల్లో నరేష్ ఉత్తమ ప్రతిభ కనబరచడంతో రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఈ నెల 23,24,25 తేదీల్లో హైదరాబాద్‌లోని దోమలగూడలో జరిగే 68వ రాష్ట్రస్థాయి పోటీల్లో నరేష్ పాల్గొంటాడని హెచ్ఎం నిర్మలజ్యోతి తెలిపారు. నరేష్‌ను హెచ్ఎం నిర్మలజ్యోతి, ఎంఈఓ రోజారాణి, ఉపాధ్యాయులు అభినందించారు. భక్తిశ్రద్ధలతో హజరత్ లాల్ షావలి దర్గా ఉర్సు భువనగిరిటౌన్ : పట్టణంలోని హజరత్ లాల్ షావలి బాబా రహెమతుల్లా అలై దర్గా ఉర్సులో భాగంగా శుక్రవారం పంఖ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు దర్గాపై పూలచాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎండీ తాహేర్, సలావుద్దీన్, ఫయాజ్, రెయ్యాన్, ఆదిల్, రషీద్ మౌలానా, నసీమ్, షకీల్ హాజీ, బాబా, జావీద్, షోయబ్ తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రి భువనగిరి
వసతిగృహాల్లో తనిఖీలు కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ప్రభుత్వ వసతిగృహాల్లో తహసీల్దార్లు తనిఖీలు నిర్వహించారు. వంగపల్లికి రాని బస్సులు యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి వచ్చే కూడలి వద్ద డివైడర్లు ఏర్పాటు చేయడంతో గ్రామంలోకి బస్సులు రావడం లేదు. 7- 9లోశనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024గోడౌన్లో అగ్నిప్రమాదం చిన్నరావులపల్లి పరిధిలో గల హిందుస్థాన్ శానిటరీ వేర్ పరిశ్రమ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. - 8లో -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 22,554
ముసాయిదా ఓటరు జాబితా ఖరారు.. నేడు ప్రకటన ఫ గతంలో కంటే పెరిగిన 1,666 మంది ఓటర్లు ఫ ఈసారి అదనంగా 19 పోలింగ్ కేంద్రాలు ఫ అత్యధిక ఓటర్లు హన్మకొండలో, అత్యల్పం సిద్ధిపేటలో ఫ వచ్చే నెల 25న వరంగల్– ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా విడుదలకు కసరత్తుపెరిగిన పోలింగ్ కేంద్రాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గతంలో 181 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఈసారి వాటి సంఖ్య 200కు పెరిగింది. గతంలో కంటే 19 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. మొత్తం ఓటర్లలో పురుషులే అధికంగా ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్య 13,498 ఉండగా, మహిళ ఓటర్లు 9056 మంది ఉన్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటర్ల లెక్క ఖరారైంది. ఓటు హక్కు కోసం 28,698 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో స్క్రూటినీ తరువాత 22,554 మంది అర్హులైన ఓటర్లుగా అధికారులు తేల్చారు. గత ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లుండగా ప్రస్తుతం చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమంలో గతంలో కంటే 1,666 మంది ఓటర్లు పెరిగారు. మొత్తంగా ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గంలో అర్హులైన ఓటర్ల సంఖ్య 22,554 మందిగా అధికారులు ఖరారు చేశారు. శనివారం ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించనున్నారు. 6,144 దరఖాస్తులు తిరస్కరణ వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదు ఈ నెల 6వ తేదీతో ముగిసిపోయింది. నియోజకవర్గం మొత్తంలో 28,698 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో నిబంధనలకు అనుగుణంగా లేని 6,144 మంది టీచర్ల దరఖాస్తులను తిరస్కరించారు. నేడు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన ముసాయిదా ఓటరు జాబితా శనివారం ప్రకటించనున్నారు. మొత్తం 22,554 మంది ఓటర్లు ఉన్నారు. అయితే అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 4,424 మంది ఓట్లు నమోదు చేసుకోగా, అతి తక్కువగా సిద్ధిపేట జిల్లాలో 149 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. నల్లగొండ 4,178 మంది ఓటర్లతో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు జిల్లాల్లో తగ్గిన ఓటర్లు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న ఓటర్ల సంఖ్యతో పోల్చితే ఈసారి నాలుగు జిల్లాల్లో ఓటర్ల సంఖ్య తగ్గింది. సిద్దిపేట, జనగామ, భద్రాద్రి, యాదాద్రి జిల్లాల్లో ఈసారి ఓటర్ల సంఖ్య తగ్గింది. వరంగల్ జిల్లాలో గతంలో కంటే ఈసారి అత్యధికంగా ఓటర్ల సంఖ్య నమోదైంది. వచ్చే నెల 9వరకు అభ్యంతరాలు స్వీకరణ, ఓటరు నమోదుకు అవకాశంఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అలాగే కొత్త ఓటర్ల నమోదుకు కూడా అవకాశం కల్పిస్తారు. సవరణలను స్వీకరిస్తారు. వాటన్నింటిని వచ్చే నెల 25వ తేదీలోగా పరిష్కరించి తుది జాబితా ప్రకటిస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓటర్లు ఇలా.. జిల్లా పోలింగ్ పురుషులు సీ్త్రలు మొత్తం స్టేషన్లు యాదాద్రి 17 549 277 826 సూర్యాపేట 23 1,574 893 2,467 నల్లగొండ 37 2,479 1,699 4,178 -
జనవరిలో రాష్ట్రస్థాయి భజన కీర్తన పోటీలు
భూదాన్‌పోచంపల్లి : పట్టణంలోని శ్రీ పాండురంగస్వామి భజనమండలి ఏర్పాటై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జనవరి 4,5 తేదీల్లో భూదాన్‌పోచంపల్లిలో రాష్ట్రస్థాయి భజన కీర్తన పోటీలు నిర్వహించనున్నట్లు భజనమండలి అధ్యక్షుడు చక్రాల నర్సింహ తెలిపారు. భజనమండలి స్వర్ణోత్సవాల కరపత్రాలను శుక్రవారం భజనమండలి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భజనమండలి స్థాపించినప్పటి నుంచి అనేక అధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పద్మశ్రీ గరికెపాటి నర్సింహారావు, చాగంటి కోటేశ్వర్రావు పాల్గొని ప్రవచనాలు వినిపిస్తారని పేర్కొన్నారు. జనవరి 6న శ్రీరుక్మిణి సమేత, పాండురంగస్వామి కల్యాణమహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భజన కీర్తన పోటీల విజేతలకు ప్రథమ బహుమతి రూ.25వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ రూ.11వేలు, నాలుగో బహుమతి రూ.6వేలు, కన్సోలేషన్ బహుమతి రూ.5వేల చొప్పున అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు 9848836254, 9440579494, 9848799323 నంబర్లను సంప్రదించి డిసెంబర్ 25లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భజనమండలి ఉపాధ్యక్షుడు భారత వెంకటేశ్, ప్రధాకార్యదర్శి పుప్పాల నాగేశ్వర్, సహాయ కార్యదర్శి దోర్నాల శ్రీనాథ్, కోశాధికారి కొంగరి పండరీనాథ్, సభ్యులు సీత సత్యనారాయణ, నోముల అశోక్, కటకం తుకారాం, దేవరకొండ అశోక్, చిట్టిపోలు గోవర్థన్, గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్‌దేవికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, వజ్రవైడూర్యాలతో అలంకరించి ప్రధానాలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలోని ప్రత్యేక వేదికపై అమ్మవారి సేవను తీర్చిదిద్ది ఊంజల్ సేవోత్సవం చేపట్టారు. అమ్మవారికి ఇష్టమైన నాధస్వరం వినిపించారు. అదే విధంగా ప్రధానాలయంలో నిత్యపూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీపత్రాలతో అర్చన చేశారు. ఇక ప్రథమ ప్రాకార మండపం, ముఖమండపంలో సుదర్శన హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం తదితర పూజలు నిర్వహించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
భువనగిరి : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందజేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. శుక్రవారం భువనగిరిలోని తారాకరామానగర్లోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా? పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కిచెన్‌లో వంట సామగ్రి, అన్నం, కూరలను పరిశీలించారు. బియ్యం నాణ్యతగా లేకపోవడం, దొడ్డుగా ఉండడంతో ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, లేకపోతే తర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
ఇంటింటికీ తాగునీరు ప్రభుత్వ లక్ష్యం
యాదగిరిగుట్ట : రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీరు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క తెలిపారు. యాదగిరిగుట్టలో మిషన్ భగీరథ పైలాన్ పనులకు శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెళ్లిపోయారు. ఆ తరువాత సభలో సీతక్క మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ రిజరాయర్వాయర్ ద్వారా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ మూడు నెలల్లో గోదావరి జలాలు అందజేస్తామన్నారు. ఇందుకోసం మల్లన్నసాగర్ నుంచి రూ.210 వ్యయంతో 16 కిలో మీటర్ల మేర ప్రత్యేకంగా పైప్‌లైన్ ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. పనులు పూర్తయితే ఆలేరు, భువనగిరితో పాటు జనగామ నియోజకవర్గంలోని 526 గ్రామాలకు సురక్షితమైన తాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రజల కష్టాలు తీరుతున్నాయన్నారు. రూ.25వేల కోట్లతో ప్రతి గ్రామానికి డబుల్, సింగిల్, లింక్ రోడ్లు వేయాలని మంత్రవర్గ సమీక్షలో నిర్ణయించినట్లు తెలిపారు. పదేళ్లలో ఆలేరు వెనుకబడింది : విప్ ఐలయ్య బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆలేరు నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు తీసుకొని నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల్లో అద్భుతమైన పథకాలు తీసుకువచ్చిందన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాగునీటి కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేసినా నీళ్లు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.210 కోట్లతో పైప్‌లైన్ ఏర్పాటు చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో మిషన్ భగీరథ సీఈ కృపార్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యరెడ్డి, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫ ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకుమూడు నెలల్లో గోదావరి జలాలు ఫ మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజల కష్టాలు తీరుస్తాం : కోమటిరెడ్డి ఒకప్పుడు ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో బోర్లు వేస్తే నీళ్లు పచ్చగా వచ్చేవని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి 50లక్షల లీటర్ల నీటికి గాను 44లక్షల లీటర్లే వస్తున్నాయన్నారు. ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో ఓ వైపు ప్లోరైడ్, హైదరాబాద్ నగరంలో కోటిమంది వినియోగించి వదిలేసిన డ్రెయినేజీ నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలను తీర్చేందుకే మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకువస్తున్నామన్నారు. మూసీని శుద్ధీకరణ చేసి తీరుతామని, రెండు నెలల్లో గంధమల్ల పనులకు టెండర్లు పిలుస్తామని, బస్వాపూర్ రిజర్వాయర్ పనులను త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు. -
సమస్యలు ఇవీ..
గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసి నాలుగుళ్లు గడిచినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. కనీస సౌకర్యాలైన సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీరు వీధుల్లో ప్రవహిస్తుండడంతో దోమలకు నిలయంగా మారుతున్నాయి. వీధి దీపాలు సరిగా లేకపోవడంతో రాత్రి సమయంలో మహిళలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇక పారిశుద్ధ్య చర్యలు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. బొమ్మాయిపల్లి పరిధిలోని కాలనీకి శానిటేషన్ సిబ్బంది 10 రోజలకు ఒక్కసారి వెళ్తుండడంతో వీధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. -
న్యాయవాదుల రక్షణకు చట్టం అవసరం
భువనగిరి క్రైం : దేశవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, దాడులనుంచి కాపాడేందుకు రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భువనగిరిలో నిర్వహించిన ఐలు సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం ఎక్కడో ఓ చోట న్యాయవాదులపై దాడులు, హత్యల వంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. అలాంటి ఘటనలను నియంత్రించాలంటే న్యాయవాదుల పరిరక్షణ చట్టం అవసరం అని పేర్కొన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన కోర్టుల్లో ఈ–కోర్టు యాప్ ఏర్పాటు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ నెలకు రూ.5వేలు చెల్లించాలని, 2019 తర్వాత తెలంగాణ బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్న న్యాయవాదులు అందరికీ హెల్త్‌కార్డులు ఇవ్వాలని, మహిళా న్యాయవాదులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా సహాయ కార్యదర్శి బోల్లెపల్లికుమార్, సీనియర్ న్యాయవాది బొమ్మ వెంకటేష్, కోశాధికారి బొడ్డు కిషన్, సభ్యులు యాదాసు యాదయ్య, ముద్దసాని చంద్రశేఖర్‌రెడ్డి, నరహరి తదితరులు పాల్గొన్నారు.ఫ ఐలు జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి -
పరిహారం సగమే!
రూ.110 కోట్లకు రూ.50 కోట్లు మంజూరు లేఅవుట్లో సమస్యలు బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితుల కోసం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద భువనగిరి శివారులోని హుస్సేనాబాద్ వద్ద లే అవుట్ సిద్ధం చేశారు. 99 ఎకరాల లేఅవుట్లో ముంపు బాధితులకు ఇంటి నిర్మాణం కోసం 200 గజాల చొప్పున ఖాళీ స్థలం, ఒక్కొక్కరికి రూ7.61 లక్షల నగదు చెల్లించారు. కానీ, పరిహారం అందకపోవడం, మంచినీరు, రోడ్ల వసతి లేకపోవడం వల్ల లే అవుట్లో ఇళ్ల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. సాక్షి,యాదాద్రి : బస్వాపూర్ ప్రాజెక్టు ముంపు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు పరిహాసంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా నిర్వాసితుల గోడు ఎవ్వరికీ పట్టడం లేదు. రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపురం గ్రామకంఠంలోని నిర్మాణాలకు నష్టపరిహారం కింద రూ.110 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం కంటితుడుపు చర్యగా రూ.50 కోట్లు విడుదల చేసింది. ఐదుళ్లుగా ఎదురుచూస్తున్న నిర్వాసితులు పరిహారం సగమే రావడంతో గగ్గోలు పెడుతున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓను కలిసి పూర్తిస్థాయిలో ఇప్పించాలని వేడుకున్నారు. మరోవైపు వచ్చిన కొద్దిపాటి పరిహారాన్ని ఏ విధంగా పంపిణీ చేయాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గ్రామాన్ని ఖాళీ చేస్తేనే రిజర్వాయర్‌లోకి నీళ్లు బస్వాపూర్ రిజర్వాయర్‌లో బీఎన్తిమ్మాపూర్తో పాటు లప్పానాయక్‌తండా, చోక్లాతండా ముంపునకు గురవుతున్నాయి. ఇందులో లప్పానాయక్‌తండా నిర్వాసితులకు ఇప్పటికే పరిహారం చెల్లించారు. పునరావాస గ్రామంలో ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. ఇక చోక్లానాయక్తండాకు పరిహారం చెల్లింపు ఇంకా మొదలుకాలేదు. రిజర్వాయర్ తొలిదశను 1.5 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ప్రస్తుతానికి బీఎన్ తిమ్మాపురం గ్రామాన్ని ఖాళీ చేయిస్తే తప్పా.. రిజర్వాయర్‌లోకి నీటిని వదిలే పరిస్థితి లేదు. గ్రామాన్ని ఖాళీ చేయించాలంటే పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాల్సి ఉంది. 899 నిర్వాసిత కుటుంబాలు బీఎన్ తిమ్మాపూర్‌లో 899 కుటుంబాలు సర్వస్వం కోల్పోతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా కుటుంబాలకు నష్టపరిహారం రూ.110 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. ఈ పరిహారం పరిధిలోకి బాధితుల నివేశన స్థలాలు, ఇళ్లు, ఇతర కట్టడాలు, చెట్లు, (స్ట్రక్చర్ వాల్యూస్) వస్తాయి. నిర్వాసితులకు పరిహారం చెల్లించి గ్రామాన్ని ఖాళీ చేయిస్తే రిజర్వాయర్‌ను కాళేశ్వరం జలాలతో నింపుతామని అధికారులు చెబుతున్నారు. ఫ పూర్తిస్థాయిలో పరిహారం రాకపోవడంతో నిర్వాసితుల గగ్గోలు ఫ ఎమ్మెల్యే, ఆర్డీఓను కలిసిన బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులు ఫ మొత్తం ఇప్పించాలని వేడుకోలు ఫ పంపిణీపై అధికారుల మల్లగుల్లాలు త్వరలోనే చెల్లిస్తాం బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో పరిహారం అందుతుంది. ఆందోళన చెందవద్దు. ప్రస్తుతం ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. రిజర్వాయర్ నింపితే ముంపు పొంచి ఉన్న ఇళ్లకు ముందుగా పరిహారం చెల్లించాలని నిర్ణయించాం. మిగతావారికి రెండో విడతలో చెల్లిస్తాం. త్వరలోనే నష్టపరిహారం డబ్బులు పూర్తిగా విడుదల చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పునరావాస గ్రామంలో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. –కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే ఐదేళ్లు కావస్తుంది బస్వాపూర్ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు పరిహారం చెల్లించకపోవడం వల్ల భూములు, ఇళ్లు కోల్పోతున్న వాళ్లు నష్టపోతున్నారు. ఇంతకాలం ఎదురుచూస్తే ప్రభుత్వం పరిహారం డబ్బులు సగమే విడుదల చేసింది. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలి.అంతేకాకుండా పునరావాస గ్రామంలో సమస్యలు పరిష్కరించాలి. –ఎడ్ల సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్, బీఎన్ తిమ్మాపూర్ -
శిశువుల దత్తత.. సులువైన మార్గం
భువనగిరిటౌన్ : శిశువుల దత్తతకు ప్రభుత్వం సులువైన మార్గం తీసుకువచ్చిందని, పిల్లలు లేని దంపతులు చట్టబద్ధత ప్రకారం శిశువులను దత్తత తీసుకోవాలని అదనపు కలెక్టర్ గంగాధర్ పేర్కొన్నారు. దత్తత కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్న తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులకు ప్రైవేట్ చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్‌లో రక్షణ పొందుతున్న పదేళ్ల వయస్సు గల బాలికను సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం వారికి అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ.. సంతానం లేని దంపతులు శిశువుల దత్తత కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, చైల్డ్‌కేర్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. -
బాలల హక్కులపై అవగాహన అవసరం
భువనగిరి క్రైం : బాలల హక్కులను సద్వి నియోగం చేసుకుని, సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవిలత సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలోని గ్రేస్ చిల్డ్రన్ హోం బాలురకు బాలల హక్కులపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గురువారం బహుమతుల ప్రదానోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలల హక్కులు, విద్యాహక్కు చట్టం, బాలకార్మిక చట్టాలపై బాలలకు అవగాహన కల్పించాలని గ్రేస్ చిల్డ్రన్ హోం నిర్వాహకులకు సూచించారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. -
తొమ్మిది గంటలకే ఓపీ సేవలు
నృసింహుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు వైభవంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభూలను, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు పంచామృతాభిషేకం చేసి తులసీదళాలతో అర్చించారు. అనంతరం స్వామి, అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి ప్రధానాలయ ప్రథమ ప్రాకార మండపంలో ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన హోమం నిర్వహించారు. అలాగే నిత్యతిరుకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రుచి చూశాకే వడ్డించాలి భువనగిరి : పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని ముందుగా ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు, మధ్యాహ్న భోజన ఇంచార్జి ఎవరైనా ఒకరు రుచి చూడాలని, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వంట సామగ్రి, కూరగాయలను కూడా పరిశీలించాలన్నారు. ఈ విధానాన్ని ప్రతి రోజూ పాటించాలని స్పష్టం చేశారు. ఎంఈఓలు పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించాలని సూచించారు. మోడల్ స్కూళ్లు, కాంప్లెక్స్ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల ప్రత్యేకాధికారులు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఆంథోళ్ మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపు చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని ఆంథోళ్ మైసమ్మ ఆలయ హుండీలో భక్తులు సమర్పించి నగదు, ఇతర కానుకలను గురువారం ఆలయ సిబ్బంది లెక్కించారు. నాలుగు నెలల 20 రోజులకు గాను రూ.14,96,475 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈఓ మోహన్‌బాబు తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. దేవాదాయ శాఖ పరిశీలకులు ఏడుకొండలు సమక్షంలో హుండీలను లెక్కించారు. భువనగిరి చెరువులో చెత్త తొలగింపు భువనగిరిటౌన్ : భువనగిరి పెద్ద చెరువులో చెత్త, వ్యర్థాలు పడేస్తుండడంతో నీరు కలుషి తం అవుతున్న నేపథ్యంలో ‘డంపింగ్ యార్డులా పెద్ద చెరువు’ శీర్షికతో ఈనెల 20 న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం మున్సిపల్ అధికారులు చెరువును సందర్శించి పారిశుద్ధ్య సిబ్బందితో చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించారు. సమస్యను వెలుగులోకి తెచ్చిన సాక్షి దినపత్రికకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్ ఏఈకి షోకాజ్ నోటీస్భువనగిరి టౌన్ : పంచాయతీరాజ్ ఈఈలు, డీఈలు, ఏఈలతో కలెక్టర్ హనుమంతరావు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో పురోగతి లేకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాజాపేట మండల ఏఈకి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఉత్సవమూర్తులకు హారతినిస్తున్న అర్చకుడుభువనగిరి : వైద్యులు సకాలంలో రాకపోవడం, వచ్చినా పూర్తి సమయం విధుల్లో ఉండకపోవడం, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విజిట్‌లో గుర్తించిన కలెక్టర్.. మార్పునకు శ్రీకారం చుట్టారు. వైద్యులు నిర్దేశిత సమయానికి అందుబాటులో ఉంటే రోగులకు చాలా వరకు స్థానికంగానే వైద్యసేవలు అందుతాయని భావించారు.అందులో భాగంగా ఉదయం 9గంటలకే ఓపీ సేవలు ప్రారంభించాలని వైద్యాధి కారులు, వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 21వ తేదీనుంచి కలెక్టర్ ఆదేశాలు అమల్లోకి వచ్చా యి. మొదటి రోజు పలువురు డాక్టర్లు 9 గంటలలోపే విధులకు హాజరై రోగులకు సేవలందించారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా పర్యవేక్షణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యాధికారులు, వైద్యులు, కలెక్టర్‌తో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. వైద్యులు ఉదయం 9 గంటలకు పీహెచ్‌సీలకు రాగానే ఫొటో దిగి గ్రూపులో పోస్టు చేయాలి. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. తద్వారా సేవల్లో పారదర్శకత పెరగ నుంది. సకాలంలో ఓపీ సేవలు అందడం వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల సంఖ్య పెరగనుంది. అంతేకాకుండా ప్రతి చిన్న జబ్బుకు రోగులు పట్టణ, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు వెళ్లే బాధలు తప్పనున్నాయి. 21 పీహెచ్‌సీలు జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. దాదాపు అన్ని చోట్ల వైద్యులు సమయపాలన పాటించడంలేదన్న ఆరోపణలున్నాయి. క్షేత్రస్థా యిలో అందుబాటులో ఉండకపోవడంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదు. ఇకనుంచి ఉద యం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలన్న నిబంధన ఉంది. న్యూస్రీల్నేడు మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి రాకయాదగిరిగుట్ట : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం యాదగిరిగుట్టకు రానున్నారు. ఆలేరు, భువనగిరి డివిజన్లకు మల్లన్నసాగర్‌నుంచి తాగునీరు అందించే మిషన్ భగీరథ పనులకు సంబంధించి యాదగిరిగుట్ట కొండకు దిగువన ఏర్పాటు చేస్తున్న పైలాన్‌ను మంత్రులు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను మిషన్ భగీరథ అధికారులు పరిశీలించారు. మంత్రులతో పాటు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి రానున్నారు.పీహెచ్‌సీలపై కలెక్టర్ ఫోకస్ ఫ రోగులకు మెరుగైన సేవలు అందేలా చర్యలుఫ వైద్యాధికారులు, వైద్యులతో ప్రత్యేకంగావాట్సాప్ గ్రూప్ ఏర్పాటు ఫ డాక్టర్ విధులకు రాగానే ఫొటో దిగి గ్రూప్‌లో పోస్టు చేయాలన్న నిబంధన ఫ గురువారం నుంచి అమల్లోకి వచ్చిన ఆదేశాలు వైద్యసేవలు మెరుగుపడుతాయి కలెక్టర్ ఆదేశాల మేరకు పీహెచ్సీ వైద్యులు రోజూ ఉదయం 9గంటలకే విధులకు హాజరై ఓపీ సేవలు ప్రారంభించాలి. సకాలంలో విధులకు హాజరైనట్లు ఫొటో తీసి వాట్సాప్ గ్రూపులో పోస్టు చేయాల్సి ఉంటుంది. గ్రూపులో పోస్టు చేసిన ఫొటోలను కలెక్టర్ పరిశీలిస్తారు. పీహెచ్‌సీల్లో ఉదయం 9 గంటల నుంచే ఓపీ సేవలు అందించడం వల్ల గ్రామీణ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.అలాగే పీహెచ్‌సీల్లో సాధారణ కాన్పులు పెంచాలని కలెక్టర్ సూచించారు. ఆ మేరకు డాక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలి. –డాక్టర్ మనోహర్, డీఎంహెచ్ఓ -
యాదాద్రి భువనగిరి
మత్స్యకారుల దినోత్సవం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మత్స్య పారిశ్రామిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సన్నాల సెంటర్లు వెలవెల సన్నరకం ధాన్యం కొనుగోళ్లకు ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు వెలవెలబోతున్నాయి. 7- 9లోశుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి నమోదైన ప్రతి కేసులో నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు సూచించారు.- 8లో -
బాలల హక్కులపై అవగాహన అవసరం
భువనగిరి క్రైం : బాలల హక్కులను సద్వి నియోగం చేసుకుని, సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవిలత సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలోని గ్రేస్ చిల్డ్రన్ హోం బాలురకు బాలల హక్కులపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గురువారం బహుమతుల ప్రదానోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలల హక్కులు, విద్యాహక్కు చట్టం, బాలకార్మిక చట్టాలపై బాలలకు అవగాహన కల్పించాలని గ్రేస్ చిల్డ్రన్ హోం నిర్వాహకులకు సూచించారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. -
విధులు సమర్థంగా నిర్వహించాలి
నల్లగొండ క్రైం: కొత్తగా విధుల్లో చేరబోయే పోలీసులు సమర్థంగా విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు వన్నె తేవాలని రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) సుధీర్‌బాబు అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తొమ్మిది నెలలుగా శిక్షణ పొందిన కానిస్టేబుళ్లకు గురువారం పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. శిక్షణార్థుల నుంచి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు శరత్చంద్ర పవార్, సన్‌ప్రీత్ సింగ్‌తో కలిసి సీపీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగమంటేనే అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందన్నారు. శిక్షణలో నేర్చుకున్న అన్ని అంశాలు విధి నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేరాల నియంత్రణలో నిత్య విద్యార్థిగా మారాలన్నారు. సైబర్ నేరాలు, ఇతర నేర సంఘటనలను వెలికి తీయడంలో సాంకేతిక నైపుణ్యాలు వినియోగంచుకోవాలన్నారు. నూతనోత్సాహంతో ప్రజలకు ప్రాణవాయువులా సేవలందించాలన్నారు. విధుల్లో ఒత్తిడికి గురికాకుండా శారీరక, మానసింగా ధృడత్వం కోసం రోజూ వ్యాయామం, యోగా సాధన చేయాలన్నారు. విధి నిర్వహణలో ఉన్నతాధికారుల సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. అవసరమైతే ప్రాణ త్యాగానికి సిద్ధపడేది పోలీసులే అన్నారు. శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభకనబర్చిన బెస్ట్ ఆల్‌రౌండర్ జె.అనిల్, బెస్ట్ ఇండోర్ ఆర్.మహేష్, బెస్ట్ అవుట్డోర్ ముజీబుద్దీన్, బెస్ట్ పైర్ టి.ప్రశాంత్, పరేడ్ కమాండర్ నరేష్‌లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ఏఎస్పీ రమేష్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రాములునాయక్, డీఎస్పీ విఠల్‌రెడ్డి, శివరాంరెడ్డి, శ్రీనివాస్, సీఐలు దానియెల్, రాజశేఖర్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు. కుటుంబసభ్యుల్లో వెల్లివిరిసిన ఆనందం నల్లగొండ డీటీసీలో సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్ జిల్లాలకు చెందిన పోలీస్ అభ్యర్థులు తొమ్మిది నెలలుగా శిక్షణ పొందారు. కాగా నల్లగొండ జిల్లాకు చెందిన పోలీసులు మేడ్చల్‌లో శిక్షణ పొందారు. తమ పిల్లలు పోలీస్ ఉద్యోగ శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరునుండడంతో ఆయా జిల్లాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. మొత్తంగా పోలీస్ ఉద్యోగం సాధించిన తమ కుమారులు, కుమార్తెలను చూసిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు బావోద్యేగానికి గురయ్యారు. ఆత్మీయంగా అలింగనం చేసుకోవడంతో పాటు ఉద్యోగం పొందిన వారు వారి తల్లిదండ్రులకు పాదాభివందనం కృతజ్ఞతలు తెలిపారు. కొందరు కానిస్టేబుల్స్ తమ తల్లిదండ్రుల నెత్తిపై పోలీస్ టోపీలు పెట్టి, చేతికి గన్నులు ఇచ్చి మురిసిపోయారు. ఫ పోలీస్ ఉద్యోగం అంటేనే అనేక సవాళ్లను అధిగమించాలి ఫ రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఫ వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన కుటుంబ సభ్యులు -
కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
సాక్షి, యాదాద్రి : మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా విరివిగా రుణాలు అందజేస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను గురువారం కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ గంగాధర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలు మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో ఐదు మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదించిందని, కలెక్టరేట్లో ప్రారంభించిన క్యాంటీన్ వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. జిల్లాకు సీ్త్రశక్తి భవన్ మంజూరైందని, నిర్మాణానికి స్థలం కూడా కేటాయించినట్లు తెలిపారు. ఆర్థికాభివృద్ధి సాధించాలి : కలెక్టర్ మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు మంజూరు చేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు. సంఘాల కోసం మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ, డీఆర్డీఓ నాగిరెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, డీపీఎంలు, ఏపీఎంలు, మహిళా శక్తి సంఘం అధ్యక్షురాలు రేణుక, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఫ కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం -
డేటా ఎంట్రీలో తప్పులకు తావుండవద్దు
సాక్షి,యాదాద్రి : సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన వివరాలను తప్పులు లేకుండా ఆన్లైన్లో న మోదు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సర్వేలో సేకరించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ఎన్యుమరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే వివరాలు గోప్యంగా ఉంచాలని, దరఖాస్తు ఫారాలను జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి 500 మంది, భువనగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో వివరాలు ఆన్లైన్ చేయడానికి 800 మంది ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో యాదాద్రి జిల్లా రాష్ట్ర స్థాయిలో ఐదవ స్థానంలో ఉందని, ఎన్యుమనేటర్లకు ప్రజలు సహకరించడం వల్ల సర్వే వేగంగా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి శామ్యూల్, ఏడీఎం సాయికుమార్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
పాఠాలు చెప్పి.. ప్రశ్నలు అడిగి
భువనగిరి : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ హనుమంతరావు బుధవరాం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న తీరుపై ఆరా తీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం పదో తరగతికి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. గణితంలో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులను అభినందించారు. అలాగే వారికి గణిత పాఠం బోధించారు. ఒత్తిడి లోనవకుండా అభ్యసన చేయాలని, డిజిటల్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. తహసీల్దార్ కార్యాలయం తనిఖీ భువనగిరి రూరల్ : భువనగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ హనుమంతరావు బుధవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డితో మాట్లాడారు. భూసమస్యలపై వచ్చిన దరఖాస్తులు, పరిష్కారంపై ఆరా తీశారు. ఫ భువనగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఫ గణిత పాఠ్యాంశం బోధనవసతి గృహాల్లో బస చేస్తా సాక్షి,యాదాద్రి : వసతి గృహాల్లో ఈ వారం నుంచి రాత్రి బస చేస్తానని, విద్యార్థుల సంక్షేమంపై నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం సంక్షేమ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రకాల హాస్టళ్లు, పాఠశాలలను తనిఖీ చేస్తానన్నారు. వసతిగృహాల సంక్షేమ అధికారులు బాధ్యతల నుంచి తప్పించుకోవద్దని, విద్యార్థుల అభ్యున్నతి కోసం పాటుపడాలని సూచించారు. హాస్టళ్లను సొంత ఇంటిలా చూసుకోవాలని, పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజ నం అందజేయాలని పేర్కొన్నారు. 10వ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని, విద్యార్థుల సందేహాలను ఎప్పటి కప్పుడు నివృత్తి చేయాలని ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో సంక్షేమ శాఖ అధికారులు, ప్రత్యేకాధికారులు, రెసిడెన్షియల్ పాఠశాలల కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
ఉదయం 9గంటల నుంచే ఓపీ సేవలు
భువనగిరి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచే ఓపీ సేవలు ప్రారంభించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ ఉదయం 8.55కు పీహెచ్‌సీల వైద్యాధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని, సకాలంలో హాజరు కావాలని సూచించారు. పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని, ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు ఉంటాయని, అంకితభావంతో పనిచేసిన వారిని ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, లేకపోతే వెంటనే ఇండెంట్ పెట్టి తెప్పించాలని సూచించారు.ఫ డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ -
స్వచ్ఛతలో మెరిసేలా..
ప్రజలు సహకరించాలి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధనకు ప్రజలంతా సహకరించాలి. తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలి. ఈ విషయమై ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. త్వరలో స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధులు మున్సిపాలిటీలో పర్యటించే అవకాశం ఉంది. –రామాంజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్, భువనగిరి భువనగిరి : స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలకు భువనగిరి మున్సిపాలిటీ సన్నద్ధమవుతోంది. గతంలో రాష్ట్ర స్థాయిలో 3,4 స్థానాల్లో నిలువగా ఈసారి మొదటి ర్యాంకు సాధించేందుకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చెత్త సేకరణ, పరిశుభ్రత, రోడ్లు, వీధుల సుందరీకరణ అంశాలపై దృష్టి సారించింది. మున్సిపాలిటీలో 14,547 గృహాలు భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 14,547 నివాస గృహాలు, 70 వేలకు పైగా జనాభా ఉంది. పట్టణంలోని ఇళ్లనుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన బయోమైనింగ్ ద్వారా తడి చెత్తను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తున్నారు.తడి చెత్త నుంచి తయారు చేసిన కంపోస్టు ఎరువును హరితహారంలో నాటిన మొక్కలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. రోజూ 22వేల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ మున్సిపాలిటీ పరిధిలో నిత్యం 22వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇందులో తడి చెత్త 10 వేల మెట్రిక్ టన్నులు, పొడి చెత్త 6వేల మెట్రిక్ టన్నులు కాగా.. మిగిలిన 4 వేల మెట్రిక్ టన్నులు వివిధ వ్యర్థాలతో కూడిన చెత్త సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను నేరుగా డంపింగ్ యార్డుకు తరలించి నిల్వచేస్తున్నారు. ఇళ్ల వద్దనే తడి చెత్తను వేరు చేసి తీసుకోవడం ద్వారా డంపింగ్ యార్డులో కంపోస్టు ఎరువు తయారీ కోసం ప్రత్యేకంగా వేరు చేసే పని తప్పుతుంది. తద్వారా డంపింగ్ యార్డులో సిబ్బందిపై భారం తగ్గనుంది. చెత్త సేకరణకోసం 18 ఆటోలు, 4 ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. 52 మంది పారిశుద్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలో పర్యటించనున్న ప్రతినిధులు స్వచ్ఛ సర్వేక్షణ్ –2024–25లో ర్యాంకుకు ఎంపిక చేసేందుకు గాను స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధుల బృందం త్వరలో భువనగిరి మున్సిపాలిటీలో పర్యటించనుంది. పరిశుభ్రతపై ప్రజలను ప్రశ్నలు అడగనుంది. వారు చెప్పే సమాధానాల ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు. ఫ మొదటి ర్యాంకుపై భువనగిరి మున్సిపాలిటీ ఫోకస్ ఫ ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన ఫ తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కార్యక్రమాలు ఫ పరిశుభ్రత, రోడ్ల సుందరీకరణపై దృష్టి ఫ త్వరలో పట్టణంలో పర్యటించనున్న స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధులు మెరుగైన ర్యాంకు కోసం తీసుకుంటున్న చర్యలు ఇవీ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2022–23లో భువనగిరి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు, 2023–24 సంవత్సరానికి 3వ స్థానం దక్కింది. ఈ సారి మొదటి స్థానంలో నిలిచే దిశగా మున్సిపల్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. తడి, పొడి చెత్తను వేరే చేసి ఇచ్చేందుకు వారం రోజులుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే వీధుల్లో పర్యటించి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. డ్రెయినేజీలను శుభ్రం చేయించడంతోపాటు చెత్త తరలింపు ప్రక్రియల్లో ఆటంకాలు లేకుండా చూస్తున్నారు. పారిశుద్ధ్య సమస్యపై ప్రజలనుంచి ఫిర్యాదులు అందగానే పరిష్కరిస్తున్నారు. -
మహిళా శక్తి కాం్యటీన్లు
జిల్లాలో ఐదు చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు ప్రభుత్వ విప్ అయిలయ్య చేతుల మీదుగా ప్రారంభం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను గురువారం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. సాక్షి యాదాద్రి : మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాకు ఐదు క్యాంటీన్లు మంజూరు చేయగా.. వాటిని విడతల వారీగా ప్రారంభించేందుకు గ్రామీణాభివృద్ధి, మెప్మా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత కలెక్టరేట్లోని క్యాంటీన్‌ను గురువారం ప్రారంభించనున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా.. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులను లక్షాధికారులను చేస్తామని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకోసం వారిని ఆర్థికంగా ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాం కుట్టించే బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించారు. తాజాగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రాంతాల్లో క్యాంటీన్ల ఏర్పాటు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను జనరద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు, ఆలయాలు, బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాలు.. తదితర జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఐదు క్యాంటీన్లను కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. తొలుత కలెక్టరేట్లో ప్రారంభించనున్నారు. అనంతరం ఆలేరు, యాదగిరిగుట్టలో ప్రారంభించనున్నారు. ఇందుకు అనువైన స్థలాలను కూడా గుర్తించారు. ఆతరువాత చౌటుప్పల్, మరోచోట మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో క్యాంటీన్లో 20 మంది సభ్యులు ఒక్కో మహిళా శక్తి క్యాంటీన్లో ఐదు నుంచి 20 మంది వరకు సభ్యులు ఉంటారు. నిర్వహణ సామర్థ్యం కలిగిన సంఘాలను ఎంపిక చేసి సభ్యులకు హైదరాబాద్ గచ్చిబౌలిలో 20 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఆర్డర్లపైనా సరఫరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా కల్తీలేని, రుచికరమైన వంటకాలు అందించనున్నారు. స్నాక్స్, కరివేపాకు, వెల్లుల్లి కారం పొడులు, స్వీట్లు, పచ్చళ్లు, టిఫిన్స్, భోజనం, పండ్ల రసాలు, బిర్యానీ, బేకరీ పుడ్స్ అందజేస్తారు. క్యాంటీన్‌కు వచ్చేవారికే కాకుండా సమా వేశాలు, శుభకార్యాలకు ఆర్డర్లపైనా అందజేస్తారు. ఫ తొలుత కలెక్టరేట్లో నేడు ప్రారంభం ఫ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ ఫ సభ్యులకు శిక్షణ పూర్తి ఫ అందుబాటులో నాణ్యమైన, రుచికరమైన వంటకాలు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాం జిల్లాలో ఐదు మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం. మొదటి క్యాంటీన్‌ను నేడు కలెక్టరేట్లో ప్రారంభిస్తున్నాం. ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరిలో కూడా స్థలాలు గుర్తించాం. క్యాంటీన్ల నిర్వహణకు అవసరమైన రుణాలను మహిళా సంఘబంధాల ద్వారా సభ్యులకు ఇపిస్తున్నాం. ఎంపిక చేసిన సంఘాల సభ్యులకు వంటకాల తయారీపై ఇప్పటికే శిక్షణ ఇప్పించాం. నాణ్యత, రుచికరమైన వంటకాలు అందించడమే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల లక్ష్యం. క్యాంటీన్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాం. –నాగిరెడ్డి, డీఆర్డీఓ -
22న దివ్యాంగులకు క్రీడా పోటీలు
భువనగిరిటౌన్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 22న భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.జూనియర్స్ విభాగంలో 10–17 ఏళ్ల బాలబాలికలు, సీనియర్స్ విభాగంలో 18–35 ఏళ్ల సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనే దివ్యాంగులు పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డు, ఆధార్, సదరం సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. హైవేపై వాహనాల బారులుచౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం వాహనాల రద్దీ నెలకొంది. వివాహాది శుభకార్యాలు ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ జంటనగరాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజానీకం పెద్ద ఎత్తున రాకపోకలు సాగించారు. ఈ క్రమంలో వాహనాల రద్దీ ఏర్పడింది. రోడ్డు దాటేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అదే విధంగా చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. 23న విద్యుత్ గ్రీవెన్స్ డే భువనగిరి : విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ఈనెల 23వ తేదీన భువనగిరిలోని డీఈ కార్యాలయంలో విద్యుత్ గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు డీఈ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రీవెన్స్ డేకు హాజరయ్యే విని యోగదారులు ఆధార్‌కార్డు, కరెంట్ బిల్లు రశీదు తీసుకుని రావాలని సూచించారు. భువనగిరి డివిజన్ పరిధిలోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖాళీ ప్లాట్లు, శిథిల ఇళ్ల యజమానులకు నోటీసులు మోత్కూరు : పట్టణంలో శిథిలావస్థకు చేరిన ఇళ్ల యజమానులు, చెత్తా చెదారంతో నిండిన ప్లాట్ల యజమానులకు బుధవారం మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఓపెన్ ప్లాట్లు చెత్తాచెదారం, కంపచెట్లతో నిండి ప్రమాదకరంగా మారినట్లు గుర్తించామని కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఖాళీ ప్లాట్ల నుంచి ఇళ్లలోకి విష సర్పాలు, కీటకాలు వస్తున్నట్లు ప్రజలనుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, వెంటనే శుభ్రం చేసుకోవాలని సూచించారు. నూరు శాతం ఫలితాలు సాధించాలి : డీఈఓ మోత్కూర్ : పదో తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, ప్రత్యేకాధికారులు కృషి చేయాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. మోత్కూరులోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో బుధవారం కేజీబీవీల ప్రత్యేకాధికారులు, అకౌంటెంట్లకు అకడమిక్ నిర్వహణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. గ్రంథాలయాల పాత్ర గొప్పదిభువనగిరిటౌన్ : స్వాతంత్ర ఉద్యమంలో గ్రంథాలయాల పాత్ర గొప్పదని అదనపు కలెక్టర్ గంగాధర్ తెలిపారు. భువనగిరిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న గ్రంథాల య వారోత్సవాలు బుధవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ..గ్రంథాలయాలను సద్విని యోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రంథాలయ అధికారి మధుసూదన్‌రెడ్డి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో మాటూరి బాలేశ్వర్, జంపాల అంజయ్య, నరసింహారావు, ఆవుల వినోద్, సుతారపు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నృసింహుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీపత్రాలతో అర్చన చేశారు. అనంతరం ప్రధానాలయ ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవను మాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.