YSR Jagananna Illa Pattalu
-
మా సొంత ఇంటి కలను నిజం చేసినందుకు జగనన్నకు ధన్యవాదాలు
-
పేదల సొంతింటి కల జగనన్నతో సాకారం
-
ప్రతి పేదవాడికి ఒక ఇల్లు కల్పించాలన్నది మన జగనన్న ప్రభుత్వ లక్ష్యం
-
ఏది నిజం?: చూడు బాబూ... ఇవిగో ఇళ్లు.. కలలోనైనా ఇది ఊహించారా?
72 ఏళ్ల వయసు. 45 ఏళ్ల రాజకీయ జీవితం. 14 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం. కానీ ప్రజలకు చేసిందేంటి? ఓ సెల్ఫీ ఛాలెంజ్!!. మేం లక్షల ఇళ్లు కట్టాం? మీరెన్ని కట్టారో చెప్పండంటూ ప్రభుత్వానికో సవాలు!!. ఏం... తెలీదా చంద్రబాబు గారూ? ఈ రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలుండకూడదనే దృఢ సంకల్పంతో ఒకేసారి 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వటం మీరు కలలోనైనా ఊహించారా?.. మీ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా అందరికీ నీడ కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా రాలేదెందుకు? 30.25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వటమే కాక... అందులో 21.25 లక్షల ఇకుపైగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతిచ్చి ఆరంభించటం చరిత్ర ఎరుగని వాస్తవం కాదా? స్థలాలిచ్చి రెండున్నరేళ్లు కూడా తిరక్కుండానే... ఈ నెలాఖరుకల్లా 5 లక్షల మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేస్తున్నారంటే... ఆ గృహ యజమానులంతా మీకెన్ని సెల్ఫీ చాలెంచ్లు విసరాలి? మీ 14 ఏళ్ల పాలనలో కట్టని ఇళ్లు ఈ రెండున్నరేళ్లలోనే పూర్తయ్యాయంటే... మీకు ఇంకా ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు అవసరమా? 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు. వీటికోసం 17, 005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపం ఏకంగా ఊళ్లే రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో ప్లాటూ కనీసం రూ.2.50 లక్షలనుకున్నా ఏకంగా రూ.75 వేల కోట్లు. పైపెచ్చు ఇంటికి రూ.1.8 లక్షల సాయం. ఉచిత ఇసుక, సబ్సిడీ సిమెంటు, మెటీరియల్స్ రూపంలో మరో రూ.55వేలు అదనం. అంటే ప్రతి ఇంటికోసం అందజేస్తున్న సాయం రూ.2.35 లక్షలు. అంటే 70వేల కోట్లకు పైనే. ఇవికాక ఈ కాలనీల మౌలిక సదుపాయాల కోసం దశలవారీగా పెడుతున్న ఖర్చు ఏకంగా రూ.33వేల కోట్లు. అంటే మొత్తంగా ఈ గృహ యజ్ఞం కోసం చేస్తున్న ఖర్చు ఏకంగా 1.78 లక్షల కోట్లు. ఇంతటి బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకోవాలంటే... అందరికీ నిలువ నీడ కల్పించాలన్న ఆశయం ఎంత బలంగా ఉండాలి? వాస్తవరూపం దాలుస్తున్న ఆ ఆశయబలం ముందు మీ జిత్తులమారి రాజకీయాలు సరితూగుతాయనే అనుకుంటున్నారా? విజయవాడ రూరల్ మండలంలో జక్కంపూడినే తీసుకుందాం. అక్కడ పూరి గుడిసెల్లో తలదాచుకుంటున్న గిరిజన కుటుంబాలు... వర్షం పడితే కొండ మీద నుంచి గుడిసెల్లోకి పారే వరద నీరు... దోమలు, కీటకాలు, తేళ్లు, పాముల సంచారంతో బిక్కు బిక్కుమంటూ గడిపే కుటుంబాలు... ఇవన్నీ చంద్రబాబు నాయుడి పాలనలో అక్కడి వారందరికీ అనుభవం. అసలు అలాంటి ప్రాంతమొకటి ఉన్నదని, అక్కడి గిరిజన కుటుంబాలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాయనే విషయమే నారా వారి దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అక్కడో ఊరు రూపుదిద్దుకుంటోంది. ఎందుకంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే... ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా ఆ ప్రాంతాన్ని చదును చేసి, వరద ముప్పు లేకుండా తీర్చిదిద్దింది. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉంటున్నవారికి స్థలాలు ఇవ్వడంతో పాటు ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా ప్రభుత్వమే పూర్తిగా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. తమ బతుకు చిత్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మార్చేశారని చెబుతున్న రోజు కూలీ తలుపుల కవితలాంటి స్థానికుల భావోద్వేగం ముందు బాబు సెల్ఫీలు ఎన్ని సరితూగుతాయి? షమీ కుటుంబంలో సంబరం షేక్ షమీ భర్త రసూల్ కూలి పనులు చేస్తాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నివసిస్తున్న ఈ కుటుంబం ఇంటద్దె కోసం నెలకు రూ.3 వేలు చెల్లిస్తోంది. రసూల్ సంపాదన ఇంటద్దె, ముగ్గురు పిల్లల పోషణకు చాలక నానా అవస్థలూ తప్పడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పసుమర్రు వద్ద వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే రసూల్ కూలి పనులు మానాలి. అందుకని ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం స్లాబ్ దశ పూర్తయింది. త్వరలో ఆ కుటుంబం సొంతింట్లోకి మారనుంది. ఎలాంటి ప్రయాస లేకుండా తమకు స్థలం, ఇల్లు వచ్చిందని చెబుతున్న షమీ సంతోషం ముందు... చంద్రబాబు రాజకీయాలు ఎన్నయినా దిగదుడుపే కదా? లేఅవుట్‌కు వెళ్లి సొంతింటిని చూసుకున్నప్పుడు ఒక్కోసారి ఇదంతా కలేమో అనిపిస్తుందని భావోద్వేగంతో చెబుతుంది షమీ. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ కర్నూలు జిల్లా నందవరం మండలం కొత్త కైరవాడి గ్రామానికి చెందిన కురువ సరోజమ్మ చాలా ఏళ్లుగా గుడిసెలోనే జీవిస్తోంది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే సరోజమ్మ గతంలో చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నా సొంతింటి కల నెరవేరలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందించింది. ఇటీవలే సొంతింట్లోకి మారారు. ‘అద్దె కట్టుకునే స్థోమత లేక చాలా ఏళ్లు గుడిసెలోనే ఉన్నాం. వర్షాలకు తడుస్తూ, చలికి వణుకుతూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. భగవంతుడు మా మొర ఆలకించాడు. అందుకే సీఎం జగన్ ఇళ్ల పథకం ప్రవేశపెట్టారు. ఈరోజు దర్జాగా సొంతింట్లో ఉంటున్నాం’ అంటున్న సరోజమ్మ ఆనందాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదేమో!!. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఏకంగా 30.25 లక్షల మంది పేద మహిళలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. అసలింతటి విలువైన స్థలాన్ని ప్రజలకు అందించటమే ఓ చరిత్ర. వేరెవరైనా అయితే అంతమందికి స్థలాలిచ్చామని ఘనంగా ప్రచారం చేసుకోవటంతో పాటు... అక్కడితో వదిలిపెట్టేసేవారు. కానీ వై.ఎస్.జగన్ ఓ అడుగు ముందుకేశారు. స్థలాలివ్వటంతో సరిపెట్టకుండా వెనువెంటనే దశలవారీగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. సొంతింటి ద్వారా ఒకో పేదింటి అక్క చెల్లెమ్మల చేతికి రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే స్థిరాస్తి అందుతోంది. తద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపద సృష్టి జరుగుతోంది. ఇటు ఇళ్ల నిర్మాణం.. అటు సదుపాయాలు రెండు దశల్లో 21.25 లక్షలకుపైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. 20.28 లక్షల ఇళ్ల నిర్మాణాలు (95 శాతం) వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3,37,631 గృహ నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు జరిగాయి. మరో 1.27 లక్షల ఇళ్లు పైకప్పు, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణం ఈ నెలాఖర్లోగా పూర్తయి... వారూ గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 28,377, విజయనగరంలో 27,895, శ్రీకాకుళంలో 23,611 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 2020 డిసెంబర్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరుసటి ఏడాది నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. రెండున్నరేళ్ల వ్యవధిలో ఐదు లక్షల వరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఒకవైపు ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు కనీస సదుపాయాల కల్పన పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు చకచకా కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లను సమకూరుస్తోంది. ప్రభుత్వమే నిర్మించి ఇస్తోంది ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని అందించడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, తక్కువ ధరలకు నిర్మాణ సామగ్రి సమకూరుస్తుండగా కొందరు నిరుపేద లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి సంకోచించారు. దీంతో వీరి కోసం ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ప్రవేశపెట్టారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులు ఈ ఆప్షన్–3 ఎంచుకున్నారు. లబ్ధిదారులను గ్రూపులుగా చేసి, వారికి లాభాపేక్ష లేని నిర్మాణ సంస్థలను ఎంపిక చేసి అనుసంధానించడం ద్వారా ఆప్షన్–3 ఇళ్లను నిర్మిస్తున్నారు. 3.03 లక్షల ఇళ్లు పునాది, ఆపై దశలో నిర్మాణంలో ఉన్నాయి. 1,923 ఇళ్లు లింటెల్ లెవెల్, 12,252 ఇళ్లు స్లాబ్ దశలో నిర్మాణంలో ఉన్నాయి. షీర్ వాల్ టెక్నాలజీతో చకచకా నా భర్త హోల్‌సేల్ మెడికల్ షాపులో సేల్స్‌మెన్‌గా చేస్తారు. చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. గతంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వెంటనే స్థలం మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చారు. నా భర్త పనిచేసే చోట పెద్దగా సెలవులివ్వరు. నేను ఇంటి వద్ద చిన్న వ్యాపారం చేస్తుంటా. మాకున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరాం. షీర్వాల్ టెక్నాలజీ విధానంలో మా ఇంటిని నిర్మిస్తున్నారు. స్లాబ్ అయిపోయింది. వేగంగా ఇంటి నిర్మాణం పూర్తవుతోంది. ఈ జన్మకు సొంతిల్లు అనేది ఉంటుందో ఉండదోనని ఆవేదన చెందేవాళ్లం. ముఖ్యమంత్రి జగన్ మా కలను నెరవేర్చారు. నా బిడ్డ చదువు కోసం అమ్మ ఒడి కింద సాయం కూడా అందిస్తున్నారు. ఇంకా పలు రకాలుగా ప్రభుత్వం మాకు అండగా నిలుస్తోంది. – జి.శోభారాణి, ఆప్షన్–3 లబ్ధిదారురాలు, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వివక్ష లేకుండా మంజూరు గత ఏడాది డిసెంబర్ 15న ప్రభుత్వం ఇచ్చిన సొంతింటికి మారాం. కరెంట్, నీటి కనెక్షన్.. ఇలా అన్ని వసతులనూ కల్పించారు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన నేను గత ప్రభుత్వంలో ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నా టీడీపీ సానుభూతిపరులకే ఇచ్చారు తప్ప రాజకీయాలతో సంబంధం లేని మాకెవ్వరికీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు చూడకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్థలం మంజూరు చేసింది. ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. – ఎం.హరిత, ఆరూరు ఎస్టీ కాలనీ, నిండ్ర మండలం, చిత్తూరు జిల్లా అంతా కలలా.. ఆర్నెల్లలోనే నాకు 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. వడ్రంగి పని చేసే నా భర్త సంపాదనతో కుటుంబ పోషణే భారంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో తహశీల్దార్ ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఇంటి స్థలం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ ఇంటి వద్దకే వచ్చి దరఖాస్తు తీసుకున్నారు. కొద్ది రోజులకే స్థలం మంజూరైంది. ఆర్నెల్లలో సొంతిల్లు కట్టుకున్నాం. అంతా కలలా ఉంది. సొంతింట్లో ఉంటున్నామంటే నాకే నమ్మకం కలగటం లేదు. – నాగేశ్వరమ్మ, శనివారపుపేట జగనన్నకాలనీ ఏలూరు రూ.9 లక్షల విలువైన స్థలం ఇచ్చారు మా గ్రామం జాతీయ రహదారి 26ని అనుకుని ఉండటంతో సెంట్ స్థలం రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు పలుకుతోంది. అంత విలువైన స్థలాన్ని ప్రభుత్వం మాకు ఉచితంగా ఇచ్చింది. నిర్మాణం పూర్తవడంతో గత ఫిబ్రవరిలో గృహ ప్రవేశం చేసి సొంతింట్లో ఉంటున్నాం. – బోడసింగి సీత, బోడసింగి పేట గ్రామం, బొండపల్లి మండలం, విజయనగరం జిల్లా -
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 32 కోట్లు ఖర్చు
-
ఇళ్ల నిర్మాణం పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
రంగనాథ్ అన్న చాలా అద్భుతంగా చేశారు: సీఎం వైఎస్ జగన్
-
ఒక్కో మహిళా చేతిలో రూ.4 లక్షలు నుంచి 10 లక్షలు..
-
నా పులివెందులపైనే కుట్ర చేశాడు: సీఎం వైఎస్ జగన్
-
జగనన్న కాలనీలో గృహప్రవేశం
సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు మండలంలోని యర్రగుంటపల్లె లే అవుట్‌లోని జగనన్న కాలనీలో ఒక లబ్ధిదారు గృహప్రవేశం చేశారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా పీలేరు పట్టణానికి చెందిన రెడ్డిరాణి, రెడ్డీశ్వర్‌రెడ్డి దంపతులకు ఇల్లు మంజూరైంది. స్థానిక తిరుపతి రోడ్డు మార్గంలోని జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం చేపట్టి 2 నెలల్లో పూర్తిచేశారు. ఆదివారం వైఎస్సార్ సీపీ మండల నాయకుడు కంభం సతీష్‌రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్డిరాణి, రెడ్డీశ్వర్రెడ్డిలను ఆదర్శంగా తీసుకుని మిగిలిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు జగన్మోహన్రెడ్డి, హబీబ్‌బాషా, ఎంపీటీసీ సభ్యుడు అమరనాథరెడ్డి, నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, వినోద్‌కుమార్, భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: కేటాయింపులకు లోబడే ప్రాజెక్ట్‌ల నిర్మాణం: మంత్రి అనిల్ ఏపీ: 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ సొంతింటి కల నెరవేరింది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని మాకు సొంతింటి కల నెరవేరింది. కొన్నేళ్లుగా సొంతిళ్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా మాకు ఇల్లు మంజూరైంది. జగనన్న కాలనీలో మా ఇంట్లోకి గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉంది. – రెడ్డిరాణి -
‘అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని మంత్రి శ్రీరంగనాథ రాజు స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సాఆర్ జగనన్న కాలనీలను .. మోడల్ కాలనీలుగా తయారు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా, ఏపీలో రూ.33 వేల కోట్లతో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ఈపథకంలో అర్హులై ఉండి కూడా.. ఇంటిపట్టా రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏపీలోని ప్రతి గ్రామంలో పార్టీల కతీతంగా, ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చదవండి: ‘‘స్పందన"పై కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ -
‘ఏపీలో మరో 17వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయి’
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో మరో 17 వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయని మంత్రి శ్రీ రంగనాథ రాజు తెలిపారు. పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి రంగనాథరాజు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి విడతలో విజయనగరం జిల్లాలో 98వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రతి కుటుంబంలో ఆర్ధికవృద్ధి పెరుగుతుందని, పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు అవుతాయని భరోసానిచ్చారు. చదవండి: ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు భూకబ్జాలో కొత్త కోణం: దళితుల భూమి వదల్లేదు -
YS Jagan: ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం..
ఎకానమీకి బూస్ట్... కోవిడ్ సమయంలో ఈ ఇళ్ల నిర్మాణం ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. ఎందుకంటే కార్మికులకు సొంత ఇళ్ల వద్దే పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది. కార్పెంటర్లు, ప్లంబర్లు లాంటి రకరకాల వృత్తుల వారికి దీర్ఘకాలం ఉపాధి లభిస్తుంది. స్టీల్, సిమెంట్ తదితర గృహ నిర్మాణ సామగ్రి కొనుగోలు చేయడం వల్ల వ్యాపార లావాదేవీలు సజావుగా కొనసాగి ఎకానమీ బూస్ట్ అవుతుంది. కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణంలో లెవలింగ్ చాలా ముఖ్యం. దాదాపు 1.95 లక్షల ప్లాట్లకు ఈ సమస్య ఉంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో జూన్ 1వ తేదీన తొలిదశ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణ కార్యకలాపాలు చేపట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చేకూర్చడమే కాకుండా కార్మికులకు పెద్ద ఎత్తున పని దొరుకుతుందని.. స్టీల్, సిమెంట్ ఇతర మెటీరియల్ కొనుగోళ్లతో వ్యాపార లావాదేవీలు సాఫీగా కొనసాగుతాయని సీఎం పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలోనూ ఈ పనులేవీ ఆగకూడదని, మధ్యాహ్నం 12 వరకు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’, వైఎస్సార్–జగనన్న కాలనీల్లో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై సీఎం బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పనులేవీ ఆగకూడదు.. జగనన్న కాలనీలలో జూన్ 1న ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి. ఆ మేరకు ఈనెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆ పనులేవీ ఆగకూడదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు యథావిథిగా కార్యకలాపాలు కొనసాగించాలి. ఇళ్ల నిర్మాణానికి నీరు, విద్యుత్ కీలకం కాబట్టి వెంటనే ఆ ఏర్పాట్లు చేసుకోవాలి. మోడల్‌హౌస్ తప్పనిసరి.. ప్రతి లేఅవుట్లో తప్పనిసరిగా ఒక మోడల్ హౌస్ నిర్మించి సమగ్ర నివేదిక తెప్పించుకోవాలి. ఎక్కడైనా నిర్మాణ వ్యయం అంచనాను మించి పోయిందా? ఇంకా ఎక్కడైనా వ్యయాన్ని నియంత్రించవచ్చా? ఇంకా బాగా ఇంటి నిర్మాణం ఎలా చేయవచ్చు..? లాంటి అంశాలను ఆ నివేదిక ఆధారంగా సమీక్షించాలి. సొంతంగా కట్టుకుంటే మెటీరియల్.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్ వినియోగం తగ్గి రేట్లలో తేడా వచ్చే వీలుంది. నిజానికి స్టీల్ ఫ్యాక్టరీలు ఆక్సిజన్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి ఉత్పత్తి ఆగదు. మనకు 7.50 లక్షల టన్నుల స్టీల్ కావాలి. స్టీల్ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి. ఎవరైనా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే కాదనవద్దు. వారికి కావాల్సిన మెటీరియల్ తప్పనిసరిగా అందించాలి. అన్ని వసతులు ఉండాలి.. కేవలం ఇళ్లు నిర్మించడమే కాదు. తగిన మౌలిక వసతులు కూడా కల్పించాలి. లేఅవుట్ పక్కాగా ఉండాలి. సీసీ రోడ్లు, భూగర్భ సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా (జేజేఎం), విద్యుదీకరణ, ఇంటర్నెట్ లాంటివి మౌలిక వసతుల్లో ముఖ్యమైన కాంపోనెంట్స్. కరెంటు, నీటి సరఫరాతో పాటు రోడ్లు కూడా నిర్మించాలి. అవి లేకపోతే ఆ ఇళ్లలోకి ఎవరూ రారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ.. భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్ వ్యవస్థే. ఒక్కసారి వేసిన తర్వాత పెద్దగా సమస్యలు కూడా ఉండవు. నీటి పైపులైన్లు, విద్యుత్ కేబుళ్లు, ఇతర కేబుళ్లు కూడా భవిష్యత్తులో పూర్తిగా భూగర్భంలోనే వేయబోతున్నారు. ఆ పనులు చేసేటప్పుడు లోతు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్ కేబుళ్ల మధ్య దూరం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. కేంద్రాన్ని అదనపు నిధులు కోరదాం.. ఈ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు కోరదాం. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఎలాగూ వాటా ఇస్తోంది. ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇళ్లు నిర్మిస్తోంది కాబట్టి అదనపు నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేద్దాం. టిడ్కో ఇళ్లపై పెయింటింగ్స్ తప్పనిసరిగా వేయాలి. వాటిని అన్ని వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. ఏడాదిలో ఇళ్లు పూర్తి రాష్ట్రంలో చేపట్టిన వివిధ ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల వివరాలపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వైఎస్సార్ అర్బన్–బీఎల్సీ తొలి దశ కింద మొత్తం 15,60,227 ఇళ్లు మంజూరు కాగా కోర్టు వివాదాల్లో 71,502 ఇళ్లు ఉన్నాయని, అందువల్ల వాటికి ప్రత్యామ్నాయం కోరుతూ లేఖ రాసినట్లు వెల్లడించారు. మిగిలిన 14,88,725 ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు మంజూరు ప్రక్రియ కూడా పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే 13,71,592 ఇళ్లకు సంబంధించి వెబ్సైట్లో మ్యాపింగ్ జరిగిందని వివరించారు. ఒక లే అవుట్లో పనులన్నీ ఒకే కంపెనీకి అప్పగిస్తే సమన్వయ లోపం, డూప్లికేషన్‌కు తావు ఉండదని అధికారులు ప్రతిపాదించారు. 81,040 టిడ్కో ఇళ్లు 90 శాతం పూర్తి జగనన్న లేఅవుట్లలో పనులు ఈ జూన్‌లో మొదలు పెట్టి సెప్టెంబరు నాటికి బేస్మెంట్, డిసెంబరు నాటికి గోడల నిర్మాణాలు, వచ్చే ఏడాది జూన్ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. టిడ్కో ఇళ్లలో 81,040 దాదాపు పూర్తయ్యే దశ (90 శాతం పనులు)లో ఉండగా మరో 71,448 ఇళ్లు 75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. సమీక్షలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్‌గుప్తాతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల నిర్మాణం
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండేలా చూడాలి. రోడ్ల నిర్మాణం జనాభాకు అనుగుణంగా ఉండాలి. ఒకసారి అన్ని లేఅవుట్లను మళ్లీ పరిశీలించి అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిధుల కొరత లేకుండా చూసుకుంటూ, వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలే తప్ప, ఎట్టి పరిస్థితుల్లో మురికి వాడలుగా మారకూడదని సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇళ్లు ఇస్తున్నామని, అవి సౌకర్యవంతంగా ఉండాలని చెప్పారు. కాలనీల సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతి లేఅవు ట్ను మళ్లీ పరిశీలించి అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఏయే సమయాల్లో ఏ మేరకు నిధులు విడుదల చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందువల్ల పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతాయని చెప్పారు. లబ్ధిదారులందరితో ఆప్షన్లు తీసుకోవాలి ►తొలి విడతలో దాదాపు 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఇప్పటికే 83 శాతం మంది లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నందున, మిగతా వారి నుంచి కూడా వెంటనే ఆప్షన్లు స్వీకరించాలి. ►3 ఆప్షన్లలో లబ్ధిదారులు ఏ ఆప్షన్ ఎంచుకున్నా, వారికి సబ్సిడీపై సిమెంట్, స్టీల్ అందించాలి. బయట మార్కెట్లో కన్నా తక్కువ ధరకే లభిస్తున్నందన ఆ అవకాశం అందరికీ వర్తింపచేయాలి. సామగ్రి అందరికీ అందుబాటులో ఉంచాలి. ►దీనివల్ల తామే ఇళ్లు కట్టుకుంటామంటూ ఆప్షన్ ఎంచుకున్న వారికి లబ్ధి చేకూరుతుంది. ఏ ఆప్షన్ ఎంపిక చేసుకున్నా, వారికి తక్కువ ధరలకు సామగ్రి లభ్యం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దీనివల్ల లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. ►కాలనీల్లో జనాభాకు తగినట్టుగా రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఉండాలి. కాలనీల డిజైనింగ్, మౌలిక సదుపాయాల విషయంలో ఇంకా ఏవైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటే వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి. మంచి మొక్కలు నాటాలి ►వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్వాడీ కేంద్రం ఉండాలి. 1500 నుంచి 5 వేల ఇళ్లకు లైబ్రరీ అందుబాటులో ఉండాలి. పార్కులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ►కాలనీల్లో మొక్కలు నాటే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏవంటే అవి కాకుండా ఆహ్లాదం, ఆరోగ్యాన్ని అందించే మొక్కలను నాటాలి. మంచి వృక్ష జాతులను ఎంచుకోవాలి. ఇంటి ముందు నుంచి వీధి రోడ్లు, కాలనీ ప్రధాన రోడ్ల వరకు మొక్కలను నాటడానికి మార్కింగ్ వేసుకోవాలి. ►అన్ని ఇళ్లను జియో ట్యాగింగ్ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షలో మంత్రులు బొత్స, చెరుకువాడ, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. మధ్యతరగతి ప్రజల కాలనీల డిజైన్లు పరీశీలన పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఏర్పాటు కానున్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలన్న దానిపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీల డిజైన్లను ఆయన పరీశీలించారు. రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలనీల్లో పారిశుధ్యం, పరిశుభ్రత విషయంలో ఉత్తమ విధానాలను అనుసరించాలని సూచించారు. -
చరిత్రలో లేని విధంగా ఇళ్లు నిర్మాణం : సీఎం జగన్
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇళ్లు ఇస్తున్నామని.. సౌకర్యవంతంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలే తప్ప, మురికివాడలుగా మారకూడదని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ వేసుకోవాలని సీఎం తెలిపారు. సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి, ప్రతీ ఒక్క లేఔట్‌ను రీవిజిట్ చేసి దానికి తగిన విధంగా అందంగా, అహ్లాదంగా తీర్చిదిద్దాలని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు, కాలనీల్లో కల్పించనున్న మౌలిక సదుపాయాలపై సమగ్రంగా సమీక్షించారు. మౌలిక సదుపాయాల విషయంలో పలు సూచనలు చేశారు. 15 లక్షల ఇళ్ల నిర్మాణం ఇళ్ల నిర్మాణానికి ఏయే సమయాల్లో ఎంత నిధులు విడుదలచేయాలన్నదానిపై ఒక ప్రణాళిక వేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల పేదలకు ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. తొలి విడతలో దాదాపు 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఇప్పటికి 83 శాతం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. మిగతా వారినుంచి కూడా వెంటనే ఆప్షన్లు స్వీకరించాలని సీఎం తెలిపారు. మూడు ఆప్షన్లలో ఏ ఆప్షన్ ఎంచుకున్నా.. లబ్ధిదారుకు రాయితీపై సిమెంటు, స్టీల్‌ను అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్మాణ సామగ్రి కూడా అందరికీ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. మంచి జీవన ప్రమాణాలు ఉండాలి అన్ని ఇళ్లనూ జియో ట్యాగింగ్ చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎక్కడా నిధుల కొరత లేకుండా చూడాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలని ఆకాంక్షించారు. రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, పార్క్‌లు ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మాణం కానున్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్వాడీ ఉండాలని, ప్రతి 1,500 నుంచి 5వేల ఇళ్లకు గ్రంథాలయం అందుబాటులో ఉండాలని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఏర్పాటు కానున్న కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే అంశంపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీల డిజైన్లను సీఎం పరిశీలించారు. కాలనీల్లో ఆహ్లాదం ఆరోగ్యం అందించే మొక్కలను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్‌కుమార్ ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రతీప్ కుమార్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, స్టేట్ హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ప్లాంట్‌పై అసెంబ్లీ తీర్మానం చేస్తాం: సీఎం జగన్ ఉన్నత విద్యకు కొత్త రూపు: సీఎం జగన్ -
ఇళ్ల స్థలాల మంజూరు నిరంతర ప్రక్రియ
30,06,673 ఇళ్ల స్థలాల పట్టాలకు గాను ఇప్పటి వరకు 26,21,049 పట్టాల పంపిణీ పూర్తి చేశారు. అంటే 87.17 శాతం పట్టాల పంపిణీ పూర్తి అయింది. ప్రత్యేకంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఏకంగా 90.28 శాతం పట్టాల పంపిణీ పూర్తయింది. మిగిలిన వాటిని రెండు మూడు రోజుల్లో పంపిణీ చేయాలి. సాక్షి, అమరావతి: ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దీనిని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఇంటి స్థలం పట్టా కోసం దరఖాస్తు అందుకున్న రెండు మూడు వారాల్లో భౌతిక తనిఖీ, అర్హతల పరిశీలన, సోషల్ ఆడిట్ ప్రక్రియనంతా పూర్తి చేయాల్సిన బాధ్యత వలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బందిదేనని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన వారు అర్హులని తేలితే కచ్చితంగా 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ పురోగతితో పాటు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సామాజిక తనిఖీల ద్వారా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. నిర్మాణాల్లో ఏక రూపత, నాణ్యత కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కల్పిస్తున్న సదుపాయాలు, వాటి నిర్మాణ రీతులు తదితర అంశాలపై పూర్తి వివరాలను ఆయా కాలనీల వారీగా వేర్వేరుగా నివేదించాలని చెప్పారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించాలని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. డంపింగ్ యార్డుల్లో బయో మైనింగ్ చేయాలని, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని ఆయన సూచించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌలిక సదుపాయాలపై డీపీఆర్ ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. మార్చి 31 నాటికి ఈ కాలనీల్లో కల్పించే మౌలిక సదుపాయాలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తామని తెలిపారు. ► వివిధ ప్రభుత్వ శాఖలు ఇందులో భాగస్వాములవుతాయని చెప్పారు. కాలనీల్లో జనాభాను అనుసరించి అంగన్వాడీ కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, బస్టాపులు తదితర నిర్మాణాలపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ► ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
90 రోజుల్లో పట్టా అందించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి అర్హుడని తేలితే 90 రోజుల్లోగా ఇంటి స్థలం పట్టా అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంటి పట్టా కోసం దరఖాస్తు అందుకున్న తొలి 12 రోజుల్లో వలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బంది భౌతికంగా వెరిఫికేషన్ పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 30,06,673 ఇళ్లపట్టాలకు గానూ 26,21,049 పట్టల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా 87.17 శాతం పట్టాల పంపిణీ జరగ్గా, కాలనీల్లో 90.28 శాతం పంపిణీ పూర్తైందన్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమమని, దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి: సీఎం జగన్) ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ► సోషల్ ఆడిట్ ద్వారా లబ్దిదారులను గుర్తించాలి. ► నిర్మాణాల్లో ఏక రూపత, నాణ్యత కోసం చర్యలు తీసుకోవాలి. ► ఒక కాలనీలో కల్పిస్తున్న సదుపాయాలు, వాటి నిర్మాణ రీతులు తదితర అంశాలపై పూర్తి వివరాలు నివేదించాలి. ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించాలి. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయండి. ► డంపింగ్ యార్డుల్లో బయో మైనింగ్ చేయాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ మొదలుపెట్టాలి. పనుల పురోగతి: వైయస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. మార్చి 31 నాటికి వాటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందులో భాగస్వాములవుతాయని అధికారులు తెలిపారు. ఇక సీఎం ఆదేశాల ప్రకారం వైఎస్సార్ జగనన్న కాలనీల్లో జనాభాను అనుసరించి అంగన్వాడీ కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్కులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, బస్టాపులు తదితర నిర్మాణాలపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (చదవండి: ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్1) -
ఊరూరా ఇంటి పట్టాల జాతర
సాక్షి నెట్వర్క్: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం 27వ రోజైన బుధవారం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, టిడ్కో గృహాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుండటంతో అక్కచెల్లెమ్మల ఆనందం అవధులు దాటుతోంది. ఎక్కడికక్కడ లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలాలను చూసుకునేందుకు లేఅవుట్ల వద్దకు బంధుమిత్రులతో కలిసి వస్తుండటంతో అక్కడ కోలాహలం జాతరను తలపిస్తోంది. తమకు కేటాయించిన స్థలాల వద్ద ఎవరికి వారు సెల్ఫీలు దిగుతుండగా.. కొందరైతే పట్టాలు అందుకున్న వెంటనే శంకుస్థాపన చేసుకుంటున్నారు. వైఎస్సార్ జిల్లాలో బుధవారం ఒక్కరోజే 1,818 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 1,03,026 మంది ఇళ్ల పట్టాలు పొందారు. చిత్తూరు జిల్లాలో 58,122 మందికి పట్టాలు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకానాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంఎస్ బాబు, నవాజ్ బాషా పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం 2,396 మంది ఇళ్ల స్థలాలు, 1,077 మంది టిడ్కో ఇళ్ల పత్రాలు అందుకున్నారు. ప్రకాశం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 4,973 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు మొత్తం 70,949 మందికి లబ్ధి కలిగింది. మరో 4,252 మందికి టిడ్కో ఇంటి పత్రాలు అందజేశారు. ఒంగోలు మండలం కరవదిలో జగనన్న కాలనీ వద్ద ముగ్గు వేస్తున్న గ్రామస్తులు గుంటూరు జిల్లాలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, అన్నాబత్తుని శివకుమార్, కిలారి రోశయ్య పట్టాలను పంపిణీ చేశారు. కృష్ణా జిల్లాలో బుధవారం 651 మంది ఇంటి పట్టాలు అందుకున్నారు. పశి్చమగోదావరి జిల్లాలో 662 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో 318 మందికి పట్టాల పంపిణీ చేయగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో బుధవారం 2,263 మంది పట్టాలు అందుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 85,689 మందికి లబ్ధి చేకూరింది. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 1,187 ఇళ్ల పట్టాలు అందజేయగా.. ఇప్పటివరకు 62 వేల మందికి పైగా లబ్ధి పొందారు. -
సమగ్ర భూ సర్వేలో వైఎస్సార్ జగనన్న కాలనీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం కొత్తగా నిర్మించనున్న వైఎస్సార్ జగనన్న కాలనీలను కూడా సమగ్ర భూ సర్వేలో చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మ్యాపుల తయారీలో ఈ కాలనీలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రతి ఇంటికీ యూనిక్ ఐడీ నంబరు ఇవ్వాలని సూచించారు. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత సంబంధిత గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియకు సంబంధించి సర్వేయర్ నుంచి జేసీ వరకూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) లు ఉండాలని, వారు కచ్చితంగా బాధ్యత వహించాలన్నారు. మొబైల్ ట్రిబ్యునల్స్‌పై ఎస్ఓపీలను రూపొందించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమర్ధత పెంపొందించేందుకు శిక్షణ, పరీక్షలు నిర్వహించాలన్నారు. లంచాలకు తావులేని వ్యవస్థను తెచ్చే ప్రయత్నంలో భాగంగానే సరికొత్త విధానాలని తెలిపారు. సచివాలయ సిబ్బంది సర్వేలో పాల్గొంటున్న సమయంలో రోజూ కనీసం 2 గంటల పాటు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 30వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షలతో మెరుగైన పనితీరు.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం, సమర్థత పెంచేందుకు క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ, పరీక్షలు నిర్వహించాల్సిందిగా సీఎం సూచించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే వరకూ శిక్షణ ఇవ్వడం వల్ల పనితీరులో సమర్థత పెరిగి ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగైన ప్రతిభ కనపరుస్తారన్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కార్యాచరణను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనితీరును గ్రామ సచివాలయాల సిబ్బంది స్వయంగా పరిశీలించి నేర్చుకునేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే సిబ్బంది సందేహాల నివృత్తికి నిపుణులు, సీనియర్ అధికారులతో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 30 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ పొడిగింపు.. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నేరుగా పట్టా పత్రం అందిస్తున్నామని, ఇంటి స్థలం ఎక్కడుందో చూపిస్తున్నామని దీనికి కొంత సమయం పడుతోందని అధికారులు వివరించారు. లబ్ధిదారులకు సంతృప్తి కలిగేలా కార్యక్రమం కొనసాగాలని, ఇళ్ల పట్టాల పంపిణీని జవనరి నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం సూచించారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియని, అర్హులైన వారికి దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా పట్టా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ విధానం సమర్థంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దఫాలుగా సర్వే సిబ్బందికి శిక్షణ సమగ్ర సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి దఫాలుగా శిక్షణ ఇస్తున్నామని, రెండో స్థాయిలో 92 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు వివరించారు. మిగిలినవారికి అవగాహన కల్పించేలా, పరిజ్ఞానం పెంచేలా శిక్షణ ఇస్తున్నామని, ఫిబ్రవరిలో మూడో స్థాయి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ జైన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నెలాఖరు వరకు ఇళ్ల పట్టాల పంపిణీ: సీఎం
సాక్షి, అమరావతి: దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ 90 రోజుల్లోగా పట్టా ఇస్తామని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ విధానం సమర్థవంతంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీని జవనరి నెలాఖరు వరకూ పొడిగించనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, సీఎస్ ఆదిత్యనాద్ దాస్, సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఎం గిరిజా శంకర్, సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ జైన్ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమవేశంలో పాల్గొన్నారు. సర్వే సిబ్బందికి శిక్షణ ఈ సందర్భంగా సమగ్ర సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ‘ఇప్పటికే రెండు స్థాయిల్లో పరీక్షలు నిర్వహించాం.ఇందులో 92శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన వారికి అవగాహన కల్పించేలా, పరిజ్ఞానం పెంచేలా శిక్షణ ఇస్తున్నాం. ఫిబ్రవరిలో మూడో స్థాయి పరీక్షలు నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నారు. ఇందుకు స్పందనగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు సంబంధిత అంశాలపై సమర్థతను పెంచడానికి అవగాహన, శిక్షణ, పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. క్రమం తప్పకుండా ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం, సమర్థత పెంచడమే లక్ష్యం కావాలని దిశా నిర్దేశం చేశారు. అదే విధంగా.. పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేంతవరకూ వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు, సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం పెంచేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. తద్వారా పనితీరులో సమర్థత కనబరుస్తారని పేర్కొన్నారు. ఇక పేదలకు కొత్తగా నిర్మించనున్న కాలనీలను కూడా సర్వేలో భాగంగా తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ‘‘మ్యాపుల తయారీలో వీటినీ పరిగణలోకి తీసుకోవాలి. కాలనీల్లో ప్రతి ఇంటికీ కూడా యూనిక్ ఐడీ నంబరు ఇవ్వాలి. సర్వేకు గ్రామ సచివాలయ సిబ్బంది వెళ్తున్న సందర్బంలో ప్రతిరోజూ కనీసం 2 గంటల పాటు ప్రజల ఫిర్యాదులు స్వీకరణ, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలి’’ అని సూచించారు. రిజిష్ట్రార్ కేంద్రాలుగా సచివాలయాలు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కార్యాచరణను అధికారులు ముఖ్యమంత్రికి వివరించగా.. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తైన తర్వాత సంబంధిత గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కావాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనితీరును స్వయంగా చూసి నేర్చుకునేలా కార్యాచరణ ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎప్పటికప్పుడు సిబ్బందికి వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి నిపుణులు, సీనియర్ అధికారులతో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నిబంధనల ప్రకారం చేసే అవకాశం సిబ్బందికి ఉంటుంది. ఇప్పటికే ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది, ఇదికూడా కొనసాగేలా తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఓపీ సర్వేయరు నుంచి జేసీ వరకూ ఈ ప్రక్రియపై కచ్చితమైన ఎస్ఓపీలు ఉండాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. లంచాలకు తావులేని వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే సరికొత్త వ్యవస్థలు అని, మొబైల్ ట్రైబ్యునల్స్‌పైన కూడా ఎస్ఓపీలను తయారుచేయాలని ఆదేశించారు. జనవరి 30 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ పొడిగింపు: సీఎం ఇక ఇళ్లపట్టాలకు సంబంధించి... ప్రతి లబ్ధిదారునికి నేరుగా పట్టా పత్రం అందిస్తున్నామని, తన ఇంటి స్థలం ఎక్కడో చూపిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందుకు బదులుగా.. లబ్ధిదారులకు సంతృప్తి కలిగించేలా కార్యక్రమం కొనసాగించాలని సీఎం జగన్ సూచించారు. ‘‘ఇళ్ల పట్టాల పంపిణీని జవనరి నెలాఖరు వరకూ పొడిగించాలి. ఇదొక నిరంతర ప్రక్రియ. ఈ విధానం సమర్థవంతంగా కొనసాగాలి. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోండి’ అని ఆదేశించారు. -
‘పట్టా’భిషేకాల కోలాహలం
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన సంబరాలు అక్కచెల్లెమ్మల సంతోషాల మధ్య ఉత్సాహపూరితంగా, కోలాహలంగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదలంతా ఇళ్ల స్థల పట్టాలు తీసుకుంటూ.. దశాబ్దాల నుంచి కలగానే మిగిలిపోయిన సొంతిల్లు సాకారమవుతున్న వేళ ఆనందంతో భూమి పూజల్లో పాల్గొంటున్నారు. శంకుస్థాపనల సందర్భంగా జగనన్న కాలనీలను అరటి పిలకలు, మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. పట్టాల పంపిణీ, శంకుస్థాపన సందర్భంగా కాలనీలకు వస్తున్న ప్రజాప్రతినిధులకు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలుకుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు 80 శాతం కాలనీల్లో పట్టాల పంపిణీ పూర్తి గత నెల 25వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి వైఎస్సార్ జగనన్న కాలనీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయగా.. అప్పటినుంచి ప్రతిరోజూ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా ఈ కార్యక్రమాలు పండుగలా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం నాటికి 21.96 లక్షల మందికి ఇళ్ల స్థలాలు/టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 17,054 వైఎస్సార్ జగనన్న కాలనీలను రూపొందించగా.. 13,595 కాలనీల్లో పట్టాలు పంపిణీ చేశారు. అంటే 80 శాతం కాలనీల్లో పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. కోర్టు కేసులున్న చోట్ల త్వరగా వాటిని పరిష్కరించి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వనున్నారు. కోర్టు కేసులు ఉన్నచోట్ల ఎంపికైన 3.79 లక్షల మంది లబ్ధిదారులకు లేఖలు అందజేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో సోమవారం నాటికి 2.95 లక్షల మందికి లేఖలు ఇచ్చారు. మహాక్రతువు ముందుకే.. రాష్ట్రంలో ఇళ్లు్ల లేని పేదలందరికీ వచ్చే మూడేళ్లలో గృహ సౌకర్యం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకుని మహా క్రతువుకు శ్రీకారం చుట్టి ప్రజల్లో సంతోషం నింపారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదకూ ఇల్లులేని పరిస్థితి లేకుండా చేయాలని ఉక్కు సంకల్పం పెట్టుకున్న ఆయన ఇళ్ల నిర్మాణాన్ని కూడా స్వల్పకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి సంకల్ప సాధన కోసం అధికార యంత్రాంగం 30.76 లక్షల మందిని ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. కొత్తగా దాదాపు అదే సంఖ్యలో కొత్త కాలనీలను ప్రణాళికాబద్ధంగా రూపొందించింది. ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం సకల సౌకర్యాలతో రూపొందించిన 17,054 వైఎస్సార్ జగనన్న కాలనీలు భవిష్యత్‌లో సకల సౌకర్యాలతో కూడిన ప్రణాళికాబద్ధమైన గ్రామాలు, పట్టణాలు, నగరాలుగా విలసిల్లనున్నాయి. సకల సదుపాయాలతో.. కాలనీల్లో చక్కటి రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సదుపాయాలతోపాటు ఉద్యాన వనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు తదితరాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు. ఎక్కడా వంకర్లు లేకుండా సరళరేఖల్లా ఇళ్లు ఉండనున్నాయి. కొత్తగా రూపొందించిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 24 చోట్ల 5వేలకు పైగా ఇళ్లు రానున్నాయి. ఒక్కో ఇంట్లో సగటున నలుగురు జనాభా లెక్కవేసుకుంటే 24 కాలనీల్లో ఒక్కోచోట కనీసం 20 వేల చొప్పున జనాభా ఉండనున్నారు. విజయనగరం జిల్లా గుంకలాం, తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి, గుంటూరు జిల్లా పేరేచెర్ల లాంటి కాలనీల్లో తొమ్మిది వేల పైగా ఇళ్లు రూపుదిద్దుకోనున్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు చేసేసరికే ఇవి పట్టణాలు కానున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో అనువైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వీలుగా వారికి నచ్చేవిధంగా ఐచ్ఛికాలు ఇవ్వడంతో లబ్ధిదారుల మోముల్లో చెప్పలేనంత సంతోషం కనిపిస్తోంది. వారంతా ఆనందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వేనోళ్ల ఆశీర్వదిస్తున్నారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని భారతదేశంలో అతిపెద్ద కార్యక్రమంగా నిలిపినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం యలమంచిలిలో ఆయన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'యలమంచిలి నియోజకవర్గంలో 7,200 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు చేస్తున్న కార్యక్రమాలు అనిర్వచనీయం. ఇలాంటి ముఖ్యమంత్రి మరో 25 సంవత్సరాలు ఉండాలని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలి. సీఎం మహిళా పక్షపాతిగా నిరూపించుకుంటూ వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడుతున్నారు. అవినీతి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు' అని విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి: ('పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద చర్యకైనా సిద్ధమే') -
'టీడీపీ త్వరలో కనుమరుగవుతుంది'
సాక్షి, విశాఖపట్నం: ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. భీమిలి నియోజవర్గం తగరపువలసలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సరగడం చినఅప్పలనాయుడు, చింతకాయల సన్యాసిపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరుగుతుంది. ఒక పైసా అవినీతి లేకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. చంద్రబాబు మంచి కార్యక్రమాలు చేయడు, చేసే వారికి అడ్డుపడతారు. పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతంది. ప్రతిపేదవాడికి ఇళ్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యం. చదవండి: ('టీడీపీ నేతలు పడగొట్టి బీజేపీపై నెడుతున్నారు') ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారు. మతానికి రాజకీయ రంగు పులుముతున్న వ్యక్తి చంద్రబాబు. 40 దేవాలయాలను పడగొట్టిన వ్యక్తి చంద్రబాబు. దేవుళ్ల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. టీడీపీ త్వరలో కనుమరుగవుతుంది. రాబోయే రోజుల్లో టీడీపీ డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు' అని మంత్రి అవంతి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఇళ్ల స్థలమే కాదు ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. అవినీతికి తావులేకుండా ఇళ్లపట్టాల పంపిణీ జరుగుతుంది. టీడీపీ నేతలు పూర్తిగా అవినీతిలో కురుకుపోయారు. పేదవాడి సొంతింటి కలను సీఎం నెరవేరుస్తున్నారు. మహిళా పక్షపాతి సీఎం జగన్' అని విజయసాయిరెడ్డి అన్నారు. -
ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్1
సంక్షేమం అర్హులందరి పరమవుతోంది. పైరవీలకు చోటులేకుండానే లబ్ధి కలుగుతోంది. సర్కారు ఆదేశిస్తోంది... అధికార యంత్రాంగం పరుగులు తీస్తోంది. లబ్ధిదారుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లాలో పట్టాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కలలో కూడా ఊహించని విధంగా నిలువనీడ కల్పిస్తున్న ప్రభుత్వానికి ప్రతి కుటుంబం మోకరిల్లుతోంది. పథకాల పంపిణీలో ఎప్పుడూ ముందుండే జిల్లా ఈ కార్యక్రమంలోనూ తన స్థానాన్ని పదిల పర్చుకుంది. ప్రస్తుతానికి ఇళ్ల పట్టాల పంపిణీలో మొదటిస్థానంలో నిలిచింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలకు శాశ్వతంగా ఆవాసాలను కల్పించే పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. జిల్లాలో గత నెల 25న ప్రారంభమైన పట్టాల పంపిణీ కార్యక్రమం, 30న ముఖ్యమంత్రి రాకతో మరింత ఊపందుకొని, ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. కొన్ని పెద్ద కాలనీలు మినహా, సుమారు 78శాతం జగనన్న కాలనీల్లో పట్టాల పంపిణీ ఇప్పటికే పూర్తయ్యింది. ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు కంటున్న కలలను నిజం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఉత్తుర్వుల మేరకు, మంత్రుల సూచనలకు అనుగుణంగా పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రుల చేత పట్టాల పంపి ణీ ఉత్సాహంగా సాగుతోంది. విజయనగరం నియోజకవర్గంలో డిసెంబర్ 30న జరిగిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి వై,ఎస్.జగన్మోహనరెడ్డి పాల్గొని స్వయంగా పట్టాలను పంపిణీ చేయడం ద్వారా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్లలో ఒకటైన గుంకలాం లేఅవుట్లో 12,301 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులంతా రోజూ ఉత్సాహంగా పట్టాలను పంపిణీ చేస్తూ, పేదల ఆశలను నిజం చేస్తున్నారు. చాలాచోట్ల పట్టాలతోపాటు ఇళ్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయడంతో, మరోవైపు లబ్ధిదారులు పునాదులు తవ్వేందుకు కూడా సన్నద్ధమ వుతున్నారు. 40వేల మందికి పంపిణీ పూర్తి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద జిల్లాలో 72,625 మంది ఇళ్ల పట్టాలు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. వీరిలో 4వ తేదీ నాటికి 39,772 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మల్యేలు పట్టాలు పంపిణీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల వలంటీర్లే ఇంటింటికీ వెళ్లి మరీ, లబ్ధిదారులకు భద్రంగా పట్టాలు అందజేస్తున్నారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి జిల్లాలో 8,048 మందిని అర్హులుగా గుర్తించగా, వీరిలో 5,207 మందికి ఇప్పటికే వాటికి సంబంధించిన పత్రాలను అందజేశారు. 911 కాలనీల్లో పట్టాల పంపిణీ పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద పట్టాల పంపిణీకోసం జిల్లాలో 1164 లేఅవుట్లను రూపొందించి, జగనన్న కాలనీలను అన్ని హంగులతో ఏర్పాటుకు సిద్దం చేయగా, వీటిలో 911 కాలనీల్లో ఇప్పటికే పట్టాల పంపిణీ పూర్తయింది. ఆక్ర మిత స్థలాల రెగ్యులైజషన్, పొజిషన్ పట్టాలకు 25,274 మందిని అర్హులుగా గుర్తించగా, 19,572 మందికి అందజేశారు. కోర్టు కేసుల కారణంగా పెండింగ్‌లో ఉన్న పట్టాల పంపిణీకి సంబంధించి, 47శాతం మందికి ఇప్పటికే లేఖలను అందజేశారు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత తమ సొంతింటి కల సాకారం అవుతుండటంతో, లబ్ధిదారుల ఇళ్లలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయ్యింది. 20 వరకూ పట్టాల పంపిణీ పట్టాల పంపిణీ కార్యక్రమానికి తొలుత జనవరి 7ను గడువు తేదీగా నిర్ధారించగా తాజాగా 20వ తేదీ వరకు పొడిగిస్తున్న ట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ లోగా శత శాతం ఇళ్ళ పట్టాలు, గృహాల పంపిణీ పూర్తి చేస్తాం. జగనన్న కాలనీల్లో సామాజిక వసతులు కల్పించి, మురికి వాడలు లేని కాలనీలుగా తీర్చి దిద్దుతాం. ముఖ్యమంత్రి ఆశయం మేరకు అన్ని రకాల వసతులను కల్పించి, మోడల్ హౌసింగ్‌ను నిర్మిస్తాం. – డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో అతి పెద్దవాటిలో ఒకటైన గుంకలాం లే అవుట్ -
కాలనీల నిర్మాణంలో చెరగని సంతకం
వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణంలో మన సంతకం కనిపించాలి. మనం పోయిన తర్వాత కూడా ఈ కాలనీలు ఉంటాయి. మన పేర్లు చిర స్థాయిగా నిలిచిపోతాయి. కాలనీల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండాలి. రోడ్లను వినూత్న రీతిలో నిర్మించాలి. ఎలివేషన్ బాగుండాలి. వీధి దీపాలు, కరెంటు స్తంభాల ఏర్పాటులో కూడా వినూత్న పద్ధతులను అనుసరించాలి. ప్రతి కాలనీ వెలుపల బస్టాప్ ఉండాలి. దీనిని అధునాతనంగా తీర్చిదిద్దాలి. కాలనీ ఎంట్రన్స్ వినూత్న రీతిలో.. పెద్ద పెద్ద లేఅవుట్స్‌లో ఎలా ఉంటాయో.. అలా ఉండాలి. ఒక పద్ధతి ప్రకారం మంచి మొక్కలు నాటాలి. ఈ కాలనీలను మురికి వాడలుగా మార్చే పరిస్థితి తలెత్తకుండా ఈ విషయాలన్నింటిపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి. సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప కార్యక్రమం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ప్రజలు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను దీవిస్తున్నారని చెప్పారు. మన సంతకం కనిపించేలా అన్ని సౌకర్యాలతో వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలు, నాణ్యత అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రతి కలెక్టర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని, అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం కనిపిస్తోందని చెప్పారు. వారందరి దీవెనలు మీకు లభిస్తాయని, తనతో పాటు మీ అందరికీ ఈ సంతోషం ఉంటుందన్నారు. లబ్ధిదారుకి నేరుగా ఇంటి స్థలం పట్టా అందించడమే కాకుండా, ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా వెంటనే చూపిస్తున్నామని.. అందుకే ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభ కార్యక్రమాన్ని ఈ నెల 20వరకు పొడిగిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 39 శాతం ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తయిందన్నారు. 17 వేలకు పైగా ఉన్న వైఎస్సార్ జగనన్న కాలనీలకు గాను 9,668 కాలనీల్లో ఇళ్లస్థలాల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటికి కూడా ఆయా లేఅవుట్లలోనే ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పారు. పెండింగ్ కేసులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. సీఎం జగన్మోహన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు పారదర్శకంగా ప్రక్రియ పాలనలో పారదర్శకతను ఒకస్థాయికి తీసుకెళ్లాం. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తామని చెప్పాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఈ విషయం కనిపించేలా బోర్డు పెట్టాం. రేషన్ కార్డు 10 రోజుల్లో, పెన్షన్ కార్డు 10 రోజుల్లో, ఆరోగ్యశ్రీ 20 రోజుల్లో, ఇంటి స్థలం పట్టా 90 రోజుల్లో ఇస్తామని చెప్పాం. కలెక్టర్లు నిరీ్ణత సమయంలోగా దరఖాస్తులను పరిశీలించి, అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలి. మనం సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తున్నాం. అర్హులందరికీ తప్పకుండా ఇంటి పట్టా రావాలి. దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి నిబంధనలను చూసుకుంటూ నిర్ణీత కాలంలోగా పట్టా ఇవ్వాలి. లే అవుట్లు – మౌలిక వసతులు లే అవుట్లలో ఇంటి నిర్మాణాలు కొనసాగించడం ఒక కార్యక్రమమైతే, మౌలిక సదుపాయాలు కల్పించడం మరో కార్యక్రమం. రోడ్లు, విద్యుత్, తాగునీరు లాంటి కనీస సదుపాయాలు కల్పించాలి. కాలనీ పరిమాణం బట్టి ఇతర సామాజిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. స్కూళ్లు, అంగన్వాడీలు, పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ లాంటివి రావాలి. కాలనీ పరిమాణం, జనాభాను బట్టి వీటిని ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) తయారు చేయాలి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలి. ఒక లే అవుట్లో పనులు ప్రారంభించాక అవన్నీ పూర్తి కావాలి. కాలనీలో పనులు మొదలుపెట్టిన తర్వాత అందులో అన్ని ఇళ్లనూ పూర్తి చేయాలి. ఒకవేళ అదనంగా ఇళ్లు మంజూరు చేయాల్సి వస్తే.. వెంటనే ప్రణాళిక రూపొందించుకుని నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుందాం. కలెక్టర్లు సవాల్‌గా తీసుకోవాలి భవిష్యత్ తరాలు మన పేర్లను గుర్తుంచుకునేలా కాలనీల నిర్మాణం జరగాలి. డిజైన్లు, ఇతరత్రా అంశాలపై ఇప్పటికే కొన్ని సూచనలు చేశాను. కలెక్టర్లు దీన్ని సవాల్‌గా తీసుకోవాలి. మీ సమర్థతను చూపించుకునే అవకాశం ఇది. కాస్త ధ్యాస పెట్టగలిగితే మంచి కాలనీలు వస్తాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి వ్యవస్థలను కల్పించడంపై ఇప్పుడే దృష్టి పెట్టాలి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల ఆప్షన్ వెంటనే తీసుకోవాలి. ఆప్షన్లు తీసుకునే కార్యక్రమం 20 నాటికి పూర్తి కావాలి. ఏకకాలంలో మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ఎన్ఆర్ఈజీఎస్ (నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్–జాతీయ ఉపాధి హామీ పథకం)కింద లబ్ధిదారులకు జాబ్ కార్డులిచ్చి, వారి పేరుతో బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించాలి. పేమెంట్ల విడుదలకు ఏపీ హౌసింగ్ వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మ్యాపింగ్, జియోట్యాగింగ్ ఒకేసారి సమాంతరంగా పూర్తి చేయాలి. నీరు, విద్యుత్ ముఖ్యం నీటి సరఫరా, విద్యుత్ చాలా ముఖ్యమైన అంశాలు. వీటికి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలి. కాలనీల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలపై డీపీఆర్‌లు తయారు చేయాలి. చాలా పెద్ద పెద్ద కాలనీలున్నాయి. కొన్నిచోట్ల నగర పంచాయతీలు చేస్తున్నాం. మురుగు నీటిని శుద్ధిచేసే ప్లాంట్ల కోసం కూడా డీపీఆర్‌లు తయారు చేయాలి. ప్రతి కాలనీలో ఒక మోడల్ హౌస్‌ను కట్టండి. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్ నాణ్యత చాలా ముఖ్యం. పేద వాళ్ల నుంచి ఎవరైనా అవినీతికి పాల్పడితే అది క్షమించరాని నేరం. అవినీతి జరిగితే పేదవాళ్ల ఉసురు తగులుతుంది. ప్రతి అధికారికీ కలెక్టర్లు ఈ విషయం తెలియజేయాలి. మనం చేసిన పనుల ద్వారా మనకు సంతృప్తి మిగలాలి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఇంట్లో విద్యుత్ సరఫరా కోసం వాడే వైరు, ప్రతి వస్తువు నాణ్యతతో ఉండాలి. ఇళ్ల నిర్మాణం జరుగుతున్న కాలనీ వరకు ఇసుక, ఇతర వస్తువుల సరఫరా జరిగేలా చూడాలి. మెటీరియల్‌కు సంబంధించి 20వ తేదీ నాటికి టెండర్లు పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. పంపిణీ ఆగిన చోట లబ్ధిదారులకు లేఖలు రాయండి ‘గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వలంటీర్ల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. వారికి మంచి శిక్షణ ఇవ్వండి. వీరి సేవలను వినియోగించుకోవడంపై ఎస్వోపీ తయారు చేయండి. డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేవలనూ వినియోగించుకోవాలి. కోర్టు కేసుల వల్ల స్థలాల పంపిణీ ఆగిపోయిన ప్రాంతాల్లో లబి్ధదారుల మనసులో అలజడి ఉంటుంది. వారికి భరోసా కల్పించేలా లేఖలు ఇవ్వాలి. కేసులు పరిష్కారం కాగానే వారికి వెంటనే ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పాలి’ అని సీఎం అన్నారు. సమీక్షలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు నీలంసాహ్ని పాల్గొన్నారు.