Warangal Rural
-
బైరి నరేష్ అడ్డగింత.. తీవ్ర ఉద్రిక్తత
ములుగు, సాక్షి: ఏటూరు నాగారంలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. నాస్తికుడు బైరి నరేష్‌పై అయ్యప్ప భక్తులు భగ్గుమంటున్నారు. అతన్ని అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. అందుకు కారణం.. బైరి నరేష్ వాహనం కారణంగా ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలు కావడమే. సోమవారం.. కోరేగావ్ సమావేశం కోసం బైరి నరేష్ ఏటూరు నాగారం వెళ్లాడు. అది తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు అయ్యప్ప స్వాములు. గతంలో అయ్యప్ప మీద చేసిన వ్యాఖ్యలు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ బైరి నరేష్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నరేష్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అయితే నరేష్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అయ్యప్ప స్వాములు వాహనాన్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో.. నరేష్ వాహనం ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలయ్యాయి. బాధితుడ్ని పోగు నర్సింహారావుగా గుర్తించారు. దీంతో నరేష్‌ను అరెస్ట్ చేయాలంటూ స్వాములు అందోళన చేపట్టారు. గతంలో.. ఏడాది కిందట.. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హిందూ సంఘాలు, అయ్యప్ప స్వాముల ఫిర్యాదు నేపథ్యంతో కేసు నమోదు అయ్యింది. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హనుమకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అప్పుడు పోలీసుల విచారణలో బైరి నరేష్ అంగీకరించాడు. -
TS: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది!
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. జిల్లా అంతటా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఒకే నియోజకవర్గం నుంచి ఎదిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ నియోజకవర్గం ఏదో చూద్దాం. అక్కడ నుంచి ఎదిగి చక్రాలు తిప్పిన ఆ నేతలపై ఓ లుక్కేద్దాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎన్నికల సమయంలోనే ఆ ప్రత్యేకతలు బయటకొస్తాయి. ప్రచారం పొందుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట నియోజకవర్గం అలాగే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. ఓరుగల్లు జిల్లా అంతటా విస్తరించారు. అన్ని చోట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రులయ్యారు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చక్రాలు తిప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు, ఎర్రబెల్లి వరదరాజేశ్వరరావు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బోయినపల్లి వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వన్నాల శ్రీరాములు...ఇలా చాలా మంది నేతలు వర్థన్నపేట నియోజకవర్గానికి చెందినవారే. వీరిలో పురుషోత్తమరావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పట్టణం, పల్లెలు కలిసి వరంగల్ మహానగరం చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం ఆధ్యాత్మిక, వాణిజ్య, వైద్య, విద్యరంగాల్లో పేరుగాంచింది. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హనుమకొండ, ఖిలావరంగల్, కాజీపేట, హసన్‌పర్తి, వరంగల్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జరిగిన పునర్విభజనలో వర్థన్నపేట ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో తెరాస తరపున బరిలో నిలిచిన అరూరి రమేశ్ గెలుపొందారు. హ్యాట్రిక్ సాధిస్తానంటూ మూడోసారి ఆరూరి రమేష్ వర్థన్నపేట నుంచి బరిలో దిగారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉంటూ.. పాలకుర్తి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి 4వ సారి బరిలో నిలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి పురుషోత్తమరావు స్వగ్రామం వర్థన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి. ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలోని ఐనవోలు మండలం పున్నేలు. ఇలా ఎందరో ప్రముఖ నాయకులను అందించిన గడ్డగా వర్థన్నపేట రాష్ట్రంలోనే పేరు పొందింది. ఇవి చదవండి: గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్ -
పాపను మాతో పంపించండన్నా.. వినని పోలీసు అధికారి..!
సాక్షి, వరంగల్: మైనర్‌ను పెళ్లి చేసుకుని భద్రత కోసం వచ్చిన ఓ వ్యక్తికి వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు అనుకూలంగా వ్యవహరించడం సంచలనంగా మారింది. పుట్టిన తేదీకి ఆధార్ కార్డు ఆధారం కాదంటూ సుప్రీంకోర్టు చెప్పినా అదే ఆధార్ కార్డును ఆసరా చేసుకుని సదురు బాలికను మేజర్‌గా గుర్తించి మరీ అతడి వెంట పంపడం పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. మహిళల భద్రత విషయంలో ఎక్కడా తగ్గేదే లేదని ఓవైపు ప్రభుత్వం చెబుతుంటే.. అందుకు విభిన్నంగా చెన్నారావుపేట పోలీసులు అది కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ వ్యవహరిస్తున్నారు. కనీసం బాధితురాలి తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకపోవడం తెరవెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ జోరుగా జరుగుతోంది. పాపను తమ వెంట పంపకుండా.. ఎక్కడ భద్రత కల్పిస్తారంటే సదరు ఎస్సై కనీస సమాధానం ఇవ్వకపోవడంతో మంగళవారం రాత్రంతా ఆ తల్లిదండ్రులకు జాగారం చేస్తూ బోరున విలపించారు. అన్ని ధ్రువపత్రాలు సమర్పించినా ససేమిరా.. దాదాపు 30 ఏళ్లున్న వ్యక్తితో బాలికకు వివాహం జరిగితే వాస్తవం తెలుసుకోకుండా సదరు పోలీసు అధికారి ఏకపక్షంగా వ్యవహరించడంతో బాలికల భద్రత చట్టం సరిగా అమలు అవుతుందా? లేదా అనే చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక(15)కు 30 ఏళ్ల వ్యక్తి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించాలని కోరారు. ఆ వెంటనే బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందడంతో ఠాణాకు వెళ్లి తమ పాప బాలికనని తెలిపారు. దీనికి ఆధారంగా ఆధార్ కార్డు చూపించినా అదీ చెల్లదన్నారు. బాలిక పుట్టిన తేదీ, బాలిక జన్మించినప్పటి దవాఖాన డిశ్చార్జ్ కార్డు చూపించినా సదరు అధికారి తిరస్కరించారు. బాలిక చదివిన పాఠశాలలో స్టడీ సర్టిఫికెట్ తీసుకురమ్మని చెప్పగా ‘రాత్రి అయిందా కదా సార్ రేపు తీసుకొస్తాం. పాపను మాతో పంపించండన్నా’ స్పందించలేదు. ఆ తర్వాత తల్లిదండ్రులను అక్కడి నుంచి పంపిన అనంతరం బాలికను ఆ వ్యక్తితోనే పంపించారు. మంగళవారం సాయంత్రం వరకూ బాలిక ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిబంధనలు ఏంటీ.. బాలల న్యాయ చట్ట ప్రకారం.. 18 సంవత్సరాలు లోపు బాలల విషయాలు పోలీసుల దృష్టికి వస్తే వెంటనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ హెల్ప్ లైన్, బాలల సంరక్షణ విభాగాలకు సమాచారం అందించాలి. సదరు అధికారులు బాలుడు లేదా బాలిక స్థితిగతులు తెలుసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి వారి ఆదేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. పోలీసులు ఏకంగా పెళ్లి చేసుకున్న వ్యక్తి వెంట సదరు బాలికను పంపించడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సీడబ్ల్యూసీ ముందుకువస్తే ఆ బాలికతో మాట్లాడి సఖి కేంద్రానికి పంపి కౌన్సెలింగ్ ఇస్తారు. లేదంటే తల్లిదండ్రులతోని వెళ్తానంటే పంపిస్తారు. అయితే ఇక్కడ అవేమీ జరగకుండా పోలీసులు నిర్ణయం తీసుకుని బాలికను ఆ వ్యక్తితో పంపడంతో ఆమె పరిస్థితి ఎలా ఉందనే టెన్షన్ తల్లిదండ్రుల్లో నెలకొని ఉంది. విచారణ చేపట్టిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ.. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు పోలీసులను కలిసి వచ్చిన అనంతరం మండల స్థాయి ఐసీడీఎస్ అధికారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. సదరు బాలికకు 15 సంవత్సరాలు మాత్రమే ఉండగా, చట్ట విరుద్ధంగా వ్యక్తి పెళ్లి చేసుకున్నాడని, బాలిక ఆచూకీ సైతం లేదని సీడబ్ల్యూసీ కమిటీని ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. కాగా, బాలల న్యాయ చట్టాలను ఉల్లంఘించిన సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాలల హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు. -
మూడు రోజులుగా ఇంటి ముందు భార్య పడిగాపులు.. పట్టించుకోని భర్త
సాక్షి, జగిత్యాల జిల్లా: కృష్ణానగర్‌లో దారుణం వెలుగుచూసింది. ఇంటి ముందు వేచిచూస్తున్న భార్యను ఓ భర్త ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు. మూడు రోజులుగా ఇంటి ముందు పడిగాపులు కాస్తున్న ఆమెను పట్టించుకోలేదు. కాగా వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన లావణ్యతో, జగిత్యాలకు చెందిన గంగాధర్ కు 2017లో వివాహం జరిగింది. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులతో భర్త గంగాధర్‌పై భార్య లావణ్య కేసు నమోదు చేసింది. వేధింపుల కేసులో జైలుకెళ్లిన గంగాధర్.. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చిన భర్తలో మార్పు వచ్చిందేమోనని భావించిన భార్య లావణ్య తిరిగి అత్తారింటికి వచ్చింది. కానీ ఆమెను భర్త ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి ముందే నిరీక్షిస్తూ ఉండిపోయింది. లావణ్యకు గత మూడు రోజులుగా ఇరుగుపొరుగువారు అన్నపానీయాలందిస్తున్నారు. -
వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గం ఈ అభ్యర్థికి హ్యాట్రిక్ లభించనుందా..!
వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గం వర్ధన్న పేట రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన ఆరూరి రమేష్ రెండోసారి విజయం సాదించారు.ఆయనకు 97670 ఓట్ల ఆదిక్యత వచ్చింది. 2014లో ఆయనకు 86వేలపైచిలుకు మెజార్టీ వస్తే 2018లో అది ఇంకా పెరిగింది. రమేష్ తన సమీప తెలంగాణ జనసమితి ప్రత్యర్ధి పి.దేవయ్యపై విజయం సాధించారు. మహాకూటమిలో బాగంగా ఇక్కడ టిజెఎస్ పోటీచేసింది.బిజెపి పక్షాన పోటీచేసిన కె.సారంగారావుకు సుమారు 5400 ఓట్లు వచ్చాయి.రమేష్ కు 128764 ఓట్లు రాగా, దేవయ్యకు 31094 ఓట్లు వచ్చాయి. వర్ధన్న పేట నియోజకవర్గంలో 2014లో అప్పటి సిటింగ్ కాంగ్రెస్ ఐ ఎమ్మెల్యే కె.శ్రీధర్‌ను ఆరూరి రమేష్ 86349ఓట్ల తేడాతో ఓడిరచారు. రమేష్ 2009లో స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయినా, 2014, 2018లలో వర్దన్నపేట నుంచి విజయం సాధించారు. ఇక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అద్యక్షుడు మందకృష్ణ మాదిగ మహాజన సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేసి 2014లో ఇక్కడ పోటీచేసినా 20526 ఓట్లు మాత్రమే వచ్చి ఓటమి చెందారు. రెండువేల తొమ్మిదిలో మందకృష్ణ ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓడిపోయారు. కాగా 2009లో ఇక్కడ టిఆర్ఎస్ తరపున పోటీచేసిన సీనియర్ నేత విజయరామారావు తదుపరి పరిణామాలలో కాంగ్రెస్ ఐలో చేరి స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2004లో ఆయన ఘనపూర్ నుంచి గెలిచి టిఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. కొంతకాలం వై.ఎస్. మంత్రివర్గంలో సభ్యునిగా వున్నారు. 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికలలో వర్ధన్నపేటలో పోటీచేసి పరాజితులయ్యారు. ఈయన గతంలో మెదక్‌జిల్లా గజ్వేలు నుంచి ఒకసారి గెలిచారు. అలాగే సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 నుంచి వర్ధన్నపేట దళితులకు రిజర్వు అయింది. దాంతో అప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన ఎర్రబెల్లి దయాకరరావు పాలకుర్తి కి మారి మరో మూడుసార్లు గెలిచి మొత్తం ఆరుసార్లు గెలిచిన నేతగా గుర్తింపు పొందారు. దయాకరరావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు గెలిచారు. దయాకరరావు2008లో వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచారు. దయాకరరావు కొంతకాలం విప్‌గా పనిచేశారు. తెలంగాణ తొలి శాసనసభలో టిడిపి పక్ష నేత అయ్యారు. ఆ తర్వాత టిఆర్ఎస్లోకి మారి, 2018 ఎన్నికలలో ఆ పార్టీ పక్షాన గెలిచి మంత్రి అయ్యారు. వర్ధన్నపేటలో ఒకసారి ఇండిపెండెంటుగా, మరోసారి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి తరుపున గెలిచిన టి.పురుషోత్తంరావు ఇంకోసారి వరంగల్ నుంచి కాంగ్రెస్ ఐ తరుపున గెలిచారు. అప్పట్లో తెలంగాణ వాదిగా వున్న పురుషోత్తంరావు, ఆ తర్వాత కాలంలో కోట్ల విజయ భాస్కరరెడ్డి క్యాబినెట్‌లోను, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చాక మారుమూల ప్రాంతాల అభివృద్ధి కమిటీ ఛెర్మన్గాను పనిచేశారు. ఇక్కడ నుంచి మాచర్ల జగన్నాథం ఒకసారి జనతా పక్షాన, మరోసారి కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. వర్ధన్నపేటలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి మూడుసార్లు, టిడిపి మూడుసార్లు, బిజెపి రెండుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు, పిడిఎఫ్ రెండుసార్లు, ఎన్‌టిపిఎస్ ఒకసారి, జనతా ఒకసారి గెలవగా, ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. 1952లోవర్ధన్నపేట, హన్మకొండ అసెంబ్లీ సీట్లను, వరంగల్ లోక్‌సభ సీటును గెలిచిన పెండ్యాల రాఘవరావు అసెంబ్లీ సీట్లను వదిలి లోక్‌సభకు వెళ్ళారు. వర్ధన్నపేట జనరల్‌గా ఉన్నప్పుడు ఆరుసార్లు వెలమ, రెండుసార్లు రెడ్లు, మూడుసార్లు బిసిలు, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి ఇతరులు గెలిచారు. వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..