● ఉన్నతాధికారులే సూత్రదారులుగా.. ● సిబ్బందిని పురమాయిస్
ఉమ్మడి జిల్లాలో మూడేళ్లుగా నమోదైన ఏసీబీ కేసుల సంఖ్య..
సంవత్సరం కేసులు
2022 6
2023 9
2024(నవంబర్ వరకు) 10+3 ఆకస్మిక
తనిఖీలు
సాక్షి, ఆదిలాబాద్: కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఓ రోడ్డు నిర్మాణానికి సంబంధించి నిర్వాసితులకు అక్కడి భూ విలువ కంటే ఎక్కువ మొత్తంలో పరిహారం వచ్చేలా రెవెన్యూ అధికారులే చక్రం తిప్పారు. అందులో తమకు వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో అప్పట్లో ఆర్డీవోగా ఉన్న సిడాం దత్తు, డిప్యూటీ తహసీల్దార్ మేస్రం నాగోరావు, మండల సర్వేయర్ జె.భరత్ ప్ర భుత్వ నిబంధనలను ఉల్లంఘించారు. మరో నలు గురు ప్రైవేటు వ్యక్తులను భాగస్వామ్యం చేసుకుని వ్యవహారం నడిపారు. మొత్తంగా ప్రభుత్వ నిధులను స్వాహా చేసి సర్కారుకు నష్టం కలిగించారు. దీనిపై ఆరోపణలు రావడం, కొంత మంది ఫిర్యా దు చేసిన క్రమంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఇందులో భాగస్వాములైన వారిని అరెస్టు చేసింది. ఇలా ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులే తమ హోదాలను విస్మరించి అక్రమాలకు పాల్పడుతున్నారు. తలా పాపం.. తిలా పిడికెడు.. అన్న రీతిలో ఆ శాఖలోని కిందిస్థాయి సిబ్బందిని కూడా భాగస్వాములుగా చేస్తున్నారు. వారి స్థాయికి తగ్గట్లుగా ఆ అవినీతిలో వాటాలు ఇస్తున్నారు. కొన్నింట్లో మాత్రమే బాధితులు బయటకు వచ్చి ఏసీబీకి పిర్యాదు చేయడంతో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా అనేకంగా జరుగుతున్నప్పటికీ తమ పని జరిగిపోతే సరేలే అనుకుని పలువురు ఏసీబీని ఆశ్రయించడం లేదు. దీంతో ప్రభుత్వ శాఖల్లో అవినీతికి చెక్‌పడటం లేదు.
ఈ శాఖల్లో అధికం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10 ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి. మరో మూడు తనిఖీ కేసులు చోటు చేసుకున్నాయి. ఏసీబీ కేసులను పరిశీలిస్తే.. రెవెన్యూ, మున్సిపల్ శాఖకు సంబంధించి చెరో మూడు చొప్పున కేసులు నమోదు కాగా మిగతా పంచాయతీరాజ్, వ్యవసాయ, ఇరిగేషన్‌తో పాటు పోలీసు శాఖల్లో అవినీతి అక్రమాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒకట్రెండు మినహాయిస్తే.. ఆ శాఖలోని కీలక బాధ్యతలో ఉన్న అధికారి తన కింద పని చేసే సిబ్బందితో కలిసే ఈ అక్రమాలకు పాల్పడటం గమనార్హం. ప్రధానంగా ఆ అధికారి సిబ్బందిని పురమాయించి బాధితుడి నుంచి లంచానికి సంబంధించి డబ్బుల విషయంలో బేరసారాలు సాగిస్తారు. తాను తెర ముందు కాకుండా వెనక ఉండి అక్రమ వ్యవహారాన్ని సాఫీగా సాగేలా చూస్తారు. ఇది బెడిసి కొట్టకపోతే తమ హోదా, స్థాయిని బట్టి లంచంను వాటాలుగా పంచుకుంటారు.
ఆరోపణల నేపథ్యంలో..
సాధారణంగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై, అవినీతి ఆరోపణలు వ్యక్తమయినప్పుడు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) రెడ్ హ్యాండెడ్‌గా దాడి చేసి పట్టుకోవడం వంటి కేసులను మనం చూస్తుంటాం. అంతే కాకుండా తనిఖీలు కూడా ఈ శాఖ పరంగా చేపడుతుంటారు. కొన్నిసార్లు ప్రభుత్వం వివిధ శాఖల పరంగా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు సైతం చేపడుతుంది. ఇటీవల సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఆహార నాణత్యకు సంబంధించిన అనేక ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ముథోల్ ఆశ్రమ బాలుర పాఠశాల, వేమనపల్లిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఏసీబీ తనిఖీ చేపట్టింది. అంతే కాకుండా జైనథ్ మండలం భోరజ్ చెక్‌పోస్టులో తనిఖీ చేసినప్పుడు లెక్కకు మించి డబ్బులు అధికంగా వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment