
విశ్వావసును స్వాగతిస్తూ
పంచాంగ పఠనం చేస్తున్న సిద్ధాంతి
వ్యవసాయ క్షేత్రంలో బసవన్నలతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఉగాది పచ్చడి పంపిణీ చేస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్: జిల్లావాసులు ఉగాది వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలి కారు. వేకువజాము నుంచే ఆలయాలకు చేరుకుని పూజలు చేశారు. ఈ ఏడాది శుభాలు కలగాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని కో రుకున్నారు. ప్రతీ ఇల్లు మామిడి తోరణాలతో కళకళలాడగా.. షడ్రుచుల పచ్చడి, బూరెలు, గుడాలు వంటి వంటకాలతో ఘుమఘుమలా డింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ పంట చేలల్లో పూజలు చేసి, వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామిజీ పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని వినాయక చౌక్‌లో శ్రీ రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉగా ది పచ్చడి పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కై లాస్‌నగర్ కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయంలో చికిలి లక్ష్మి వెంకటేశ్వర సిద్ధాంతి పంచాంగ పఠనం చేశారు. అలాగే పలువురు మహారాష్ట్రవాసులు గుడిపడ్వా వేడుకలను జరుపుకున్నారు.
నేరడిగొండ: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తన స్వగ్రామం రాజురలో గల వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా బసవన్నలకు నైవేద్యం సమర్పించారు.
వైభవంగా ఉగాది వేడుకలు
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
పంచాంగం వినిపించిన పండితులు

విశ్వావసును స్వాగతిస్తూ

విశ్వావసును స్వాగతిస్తూ

విశ్వావసును స్వాగతిస్తూ

విశ్వావసును స్వాగతిస్తూ