
● జిల్లాలో నేటి నుంచి సన్నబియ్యం పంపిణీ ● ఇంకా పూర్తిస్
నేటి నుంచి పంపిణీ
ప్రభుత్వం పేదలకు అందించనున్న సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ మంగళవారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాకు చేరిన కోటాకు అనుగుణంగా అన్ని షాపులకు సర్దుబాటు చేశాం. మరో 25 షాపులకు బియ్యం రావాల్సి ఉంది. పండుగల నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. మంగళవారం బియ్యం వచ్చిన వెంటనే ఆయా షాపులకు సరఫరా చేస్తాం.
– సుధారాణి,
పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉగాది కానుకగా సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. ఈ పంపిణీ ప్రక్రియ జిల్లాలో మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో గల 32వ చౌక దుకాణంలో కలెక్టర్ రాజర్షి షా ఉదయం 9గంటలకు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. జిల్లాలోని అన్ని దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టనున్నారు. అయితే జిల్లాకు పూర్తిస్థాయిలో బియ్యం కోటా రాలేదు. మార్చి 31వరకే జిల్లాకు అవసరమైన బియ్యం అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో చేరకపోవడం గమనార్హం. దీంతో జిల్లాలోని పలు షాపులకు ఇంకా బియ్యం సరఫరా కాలేదు. కాగా, సన్న బియ్యం పంపిణీ నేపథ్యంలో రేషన్ కార్డుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
జిల్లాకు చేరింది 3వేల మెట్రిక్ టన్నులే ..
జిల్లాలో రేషన్‌కార్డులు ఏఏవై, ఆహారభద్రత, అన్నపూర్ణ కలిపి మొత్తం 1,91,755 ఉన్నాయి. వీటి పరిధిలో 6,49,521 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా అందించనున్నారు. ఇందుకు గాను జిల్లాకు 4,125.474 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారు. ఈ బియ్యంను నిజామాబాద్ జిల్లా నుంచి సరఫరా చేయాలని నిర్ణయించారు. అక్కడి నుంచి జిల్లాలోని ఐదు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు ఇ ప్పటి వరకు 3వేల మెట్రిక్ టన్నుల బియ్యం మార తమే చేరాయి. ఇంకా 1,125 మెట్రిక్ టన్నుల బి య్యం రావాల్సి ఉంది. ఉగాది, రంజాన్ పండుగలు వరుసగా వచ్చిన నేపథ్యంలో బియ్యం సరఫరాలో ఆలస్యమైనట్లుగా అధికారులు చెబుతున్నారు.
పట్టణంలో ఒకే.. గ్రామాలకు సర్దుబాటు
జిల్లా కేంద్రంలోని చౌక దుకాణాలన్నింటికీ పూర్తి స్థాయి కోటా బియ్యం అందజేసిన అధికారులు గ్రామీణ ప్రాంతాల్లోని షాపులకు మాత్రం అరకొరగా కేటాయింపులు చేశారు. జిల్లా వ్యాప్తంగా 356 చౌక దుకాణాలుండగా అందులో ఇప్పటి వరకు 325 దుకాణాలకు సరఫరా చేశారు. మరో 25 షాపులకు చేరాల్సి ఉంది. ఆయా షాపుల్లో బియ్యం అందాకే పంపిణీ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 42 రేషన్‌షాపులుండగా వాటి పరిధిలోని కార్డుదారులకు అవసరమైన ఈ నెల కోటా బియ్యం పూర్తిస్థాయిలో సరఫరా చేశారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలకు మాత్రం సర్దుబాటు చేశారు. మండలంలో పది షాపులంటే ఐదారు షాపులకు పూర్తి కోటా బియ్యం అందజేయగా, మిగతా షాపులకు ఒక్కో షాపునకు కనీసంగా ఐదు నుంచి పది క్వింటాళ్ల వరకు సరఫరా చేశారు.
ఆన్‌లైన్‌లో పేరున్నా ఓకే..
జిల్లాలో..
చౌక ధరల దుకాణాలు : 356
ఏఏవై కార్డులు : 14570
అన్నపూర్ణ కార్డులు : 245
ఆహారభద్రత కార్డులు : 1,76,940
అవసరమైన బియ్యం కోటా: 4,125
మెట్రిక్ టన్నులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కొత్తగా రేషన్‌కార్డులు మంజూరై పౌరసరఫరాల శాఖ పోర్టల్‌లో పేర్లు ఉన్న వారికి కూడా సన్న బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నూ తనంగా కార్డులు జారీ కాకున్నా పోర్టల్‌లో పేర్లు ఉన్న వారికి సైతం సన్న బియ్యం అందనున్నా యి. ఉగాది రోజున సీఎం రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలి సిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ ఆ మేర కు పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో కొత్త కార్డులు మంజూరైనా గ్రామసభల్లో అర్హుల జాబి తా వెల్లడి సమయంలో తలెత్తిన సమస్యలతో ఇంకా లబ్ధిదారులకు ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదాపడ్డాయి. మ రోవైపు మీసేవల్లో కొత్త కార్డుల మార్పులు, చేర్పు ల కోసం ఇంకా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇక సన్నబియ్యం ఇప్పటికే రేషన్ దుకాణా లకు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి మొత్తం కోటా లో కనీసం 50శాతం వరకు సరఫరా చేశారు. ప్ర తినెలా బియ్యం రవాణాలో అనేక చోట్ల జాప్యం జరుగుతున్నా ఈసారి అలా జరగకుండా అధికా రులు చర్యలు తీసుకున్నారు. తొలిరోజున స్థానిక ప్రజాప్రతినిధులు,అధికార పార్టీ నాయకులు ఆ యా రేషన్ దుకాణాల వద్ద హాజరు కానున్నారు.

● జిల్లాలో నేటి నుంచి సన్నబియ్యం పంపిణీ ● ఇంకా పూర్తిస్

● జిల్లాలో నేటి నుంచి సన్నబియ్యం పంపిణీ ● ఇంకా పూర్తిస్