
ఢిల్లీలో ఆదివాసీ కళాకారుల ప్రదర్శన
ఇచ్చోడ: ఢిల్లీలో ఆదిలాబాద్ జిల్లా సకల కళా సంక్షేమ సంఘం ఆదివాసీ కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన జయతి జయ భారత్ కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ కళాకారులు తమ కళను ప్రదర్శించారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలలోని విభిన్న సంస్కృతుల కళాకారులను ఆహ్వానించారు. ఈ ప్రదర్శనల్లో సకల కళా సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్ ఆధ్వర్యంలో కాత్లె అనంద్, గంగోత్రి, రీతులు పాల్గొన్నారు.
గంజాయి పట్టివేత
ఉట్నూర్‌రూరల్: గంజాయి సాగు చేసినా, సరఫరా చేసినా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇన్‌చార్జి ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా కరీంనగర్‌కు వెళ్తున్న ఆటోలో ముగ్గురు వ్యక్తులతో పాటు కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆదివారం మండలంలోని కుమ్మరితాండ గ్రామపంచాయితీ పరిధిలోని రాముగూడ గ్రామానికి చెందిన కుమ్ర సోనేరావు ఇంటి పెరడులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడని సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేశారు. పెరడులో 20 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మొగిలి తెలిపారు.
ఇద్దరిపై కేసు
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ షంషీర్‌నగర్‌లో సర్వే నంబర్ 170లోని ప్రభుత్వ భూమిలో ఇళ్లు కడుతున్న ఇద్దరిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో ఎన్.దేవయ్య తెలిపారు. మహబూబీ, అమానుల్లాఖాన్‌లు అక్రమంగా ఇంటి నిర్మాణం చేస్తుండడంతో కేసు నమోదు చేశామన్నారు.

ఢిల్లీలో ఆదివాసీ కళాకారుల ప్రదర్శన