
బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి కృషి
ఇచ్చోడ: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ కుమ్ర కోటేశ్ అన్నారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కోకస్‌మన్నూర్‌లో బుధవారం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల అభివృద్ధిని మరిచి కుల, మతాల మధ్య చిచ్చుపెడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కళ్లెం నారాయణ్‌రెడ్డి, కొత్తూరు లక్ష్మణ్, ముస్తాఫా, గోవర్ధన్, ప్రభాకర్, షాదుల్లా, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.