బోధనకు బ్రేక్
గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీటిలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో వారం రోజులుగా విద్యార్థులకు బోధన అందడం లేదు. వారి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం వల్ల ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న బోధన పరమైన సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాడేరు/కొయ్యూరు: గిరిజన గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులకు బోధన కుంటుపడింది. వీటిలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించి పాడేరు ఐటీడీఏ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.
ఆందోళనలో 280 మంది..
జిల్లాలో గురుకుల పాఠశాలలు 10, గురుకుల కళాశాలలు 9 ఉన్నాయి. గురుకులాల పరిధిలో 4వేల మంది విద్యార్థులు చదువుతుండగా వీరిలో సుమారు 800 మంది టెన్త్ విద్యార్థులు ఉన్నారు. గురుకుల కళాశాలల్లో 2,700 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటికి చెందిన సుమారు 280 మంది అవుట్ సోర్సింగ్ టీచర్లు, అధ్యాపకులు ఆందోళనలో పాల్గొంటున్నందున బోధన సాగడం లేదు. గురుకుల విద్యాలయాల్లో కేవలం ప్రిన్సిపాళ్లు మాత్రమే ఉన్నారు.
టెన్త్, ఇంటర్‌పై ప్రభావం
అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆందోళన కారణంగా టెన్త్, ఇంటర్ విద్యార్ధులకు పాఠాలు బోధించే వారే కరువయ్యారు. ఇప్పటి వరకు కేవలం 25 శాతం మాత్రమే సిలబస్ మాత్రమే పూర్తయింది. మిగతా 75 శాతం బోధించాల్సి ఉంది. ఆందోళన కొనసాగితే విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. ఇదే పరిస్థితి కొనసాగితే గురుకుల విద్యాలయాల్లో ఈఏడాది టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి అవుట్ సోర్సింగ్ టీచర్లు, అధ్యాపకుల సమస్యలు పరిష్కరించి, విద్యార్థులకు బోధన అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రెగ్యులర్ చేయాలి
జి.మాడుగుల: గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ టీచర్లుగా మార్పు చేయాలని ఏపీటీడబ్ల్యూఆర్ పాఠశాలల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.కొండబాబు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన 2024 మెగా డీఎస్సీ నుంచి గిరిజన గురుకులాల్లోని 1143 పోస్టులను మినహాయించాలని ఆయన కోరారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తామంతా పాడేరులో దీక్షలు చేపట్టామన్నారు.
అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆందోళన ఎఫెక్ట్
జిల్లా సమాచారం
గురుకుల పాఠశాలలు : 10
విద్యార్థుల సంఖ్య : 4 వేలు
టెన్త్ విద్యార్థులు : 800
గురుకుల కళాశాలలు : 9
విద్యార్థులు : 2700
మంది
ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న
టీచర్లు, అధ్యాపకులు : 280
ఆందోళనకు దిగిన గురుకులాల అవుట్ సోర్సింగ్ గురువులు
కొనసాగుతున్న విధుల బహిష్కరణ
సమస్యలు పరిష్కరించడంలో
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని వైనం
ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టక
పోవడంపై తల్లిదండ్రుల ఆవేదన
డిమాండ్లు ఇవీ..
అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో మార్చాలి
2022 పీఆర్సీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి
గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల పోస్టులను మెగాడీఎస్సీ
నుంచి మినహాయించాలి.
పని వేళలు మార్పు చేయాలి
2014 కన్నా ముందు ఉన్న అవుట్ సోర్సింగ్ టీచర్లను రెగ్యులర్ చేయాలి.
కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలి
దేశ చరిత్రలో ఏ విద్యా సంస్థలో కూడా అవుట్‌సోర్సింగ్ పద్ధతి లేదు. కేవలం మన గిరిజన గురుకులాల్లో మాత్ర మే అవుట్ సోర్సింగ్ విధానం ఉంది. 2010 పీఆర్సీ ప్రకారమే నెలకు కేవలం రూ.18 వేలు చెల్లిస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చితే నెలకు రూ.రూ.40వేలు వస్తుంది. కాంట్రాక్ట్ విధానంలో ప్రభుత్వం మార్పు చేయాలి.
– జి.చిరంజీవి, ఆంగ్ల అధ్యాపకుడు,
గురుకుల కళాశాల, జి.మాడుగుల
Comments
Please login to add a commentAdd a comment