విద్యుత్ చార్జీలపెంపుపై ప్రజలు భగ్గుమన్నారు. నడ్డి విర
సాక్షి,పాడేరు: ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత భారీగా పెంచి ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం యూనిట్‌కు రూ.2.19 చొప్పున విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వైఎస్సార్‌సీపీ పోరుబాటలో భాగంగా జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు,ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తన క్యాంపు కార్యాలయం నుంచి నేతలు,కార్యకర్తలు,గిరిజనులతో కలిసి సినిమాహల్ సెంటర్, పాతపాడేరు, కాన్వెంట్ జంక్షన్ మీదుగా కొత్తపాడేరు సమీపంలోని విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్‌ఈ కార్యాలయం వరకు రెండు కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్‌ఈ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ఎస్‌ఈతో పాటు ఇతర అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచడం అన్యాయమన్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.విద్యుత్ చార్జీలను పెంచడంతో పాటు సూపర్ సిక్స్ హామీలను విస్మరించిన సీఎం చంద్రబాబుకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రజలపై విద్యుత్ భారం దారుణం : మాజీ ఎంపీ మాధవి మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్ చార్జీలభారం మోపడం దారుణమన్నారు.రెండు నెలల వ్యవధిలో విద్యుత్ చార్జీలు పెంచి అన్ని వర్గాల ప్రజలకు సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని,విద్యుత్ చార్జీల రూపంలో రూ.1,550 కోట్లు ప్రజలపై భారం వేయడం తగదన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి తొందరలోనే గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు.
ప్రభుత్వమే భరించాలి : వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు,పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండు నెలల వ్యవధిలో రూ.15,400 కోట్ల మేర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపిందని, దీనిని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.తమ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలతో లబ్ధిపొందారని, ఎన్నికలకు ముందు బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర,మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ,పాడేరు మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు,కొయ్యూరు, జీకే వీధి ఎంపీపీలు రమేష్,కుమారి, జీకే వీధి జెడ్పీటీసీ కిముడు శివరత్నం,పాడేరు, వైస్ ఎంపీపీ కనకాలమ్మ,పార్టీ ఎస్టీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కూడా సురేష్‌కుమార్,ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి,చల్లా చిట్టమ్మ,లకే రామకృష్ణపాత్రుడు,నరసింహమూర్తి ,మీనా, సర్పంచ్‌లు సీదరి రాంబాబు, బసవన్నదొర,హనుమంతరావు,లక్ష్మణరావు,పార్టీ సీనియర్ నాయకులు లకే రామసత్యవతి,ఐశ్వర్యరాణి,కన్నాపాత్రుడు,సూర్యనారాయణ,సత్యనారాయణ,సుబ్రహ్మణ్యం,మత్స్యకొండబాబు,పాడేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు కార్యకర్యలు పాల్గొన్నారు.
కూటమి సర్కార్
మోసంపై ప్రజల కన్నెర్ర
చార్జీల పెంపు
ఉపసంహరించుకోవాలని
డిమాండ్
విద్యుత్ చార్జీల పెంపును
నిరసిస్తూ ఆందోళనలు
మద్దతు పలికిన
వైఎస్సార్‌సీపీ
నిరసనలో భారీగా పాల్గొన్న గిరిజనులు
Comments
Please login to add a commentAdd a comment