ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ కేంద్రీయ విద్యాలయంలో ఈ నెల 18,19 తేదీల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు వాక్ఇన్ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సి పాల్ వంశీకృష్ణ తెలిపారు. 18న పీజీటీ విభాగంలో ఇంగ్లిష్, హిందీ, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కామర్స్, ఎకనామిక్స్ ఉపాధ్యాయులకు, టీజీటీ విభాగంలో ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం,గణితం,సైన్స్,సోషల్ సైన్స్ సబ్జెక్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 19న పీఆర్టీ, పీజీటీలో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, డాన్స్ కోచ్, స్పోర్ట్స్ కోచ్, స్పెషల్ ఎడ్యుకేటర్, యోగా ఇన్స్ట్రక్టర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, నర్స్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. అర్హులైన అభ్యర్థులు అన్ని ధ్రువీకరణపత్రాలతో ఆయా తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. ఉదయం 8.30 గంటల నుంచి వరకు దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు విద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment