కాలకూటమి
రైతు గొంతులో
● ఆర్నెల్ల కూటమి పాలనలో హామీలకు పాతర!
● అందని రూ.20వేల పెట్టుబడి సాయం
● ఉచిత పంటల బీమా ఎగవేత, రైతులపై ప్రీమియం భారం
● రైతు సేవా కేంద్రాలు నిర్వీర్యం...రాయితీ ఎరువులు, విత్తనాలకు మంగళం
● వ్యవసాయానికి కరెంటు వాత... 9 గంటల ఉచిత విద్యుత్ నిలిపివేత
● దళారులు, మిల్లర్ల చేతుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ
● ఈ నయవంచనను నిరసిస్తూ రైతుకు అండగా వైఎస్సార్‌సీపీ
● నేడు రైతులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీ
ఖరీఫ్, రబీ సమయమేదైనా.. ఐదేళ్ల పాటు చిరునవ్వుల పంటలు పండించిన అన్నదాతలు.. ఇప్పుడు కన్నీటితో సావాసం చేస్తున్నారు. సకాలంలో ఎరువులు అందక.. బీమా ఉందన్న దీమా కూడా లేక.. పంట సాయం కూడా దూరమై.. చివరికి ధాన్యం కొనుగోళ్లలోనూ సర్కారు సహకారం లేకపోవడంతో.. రైతు బతుకు దైన్యంగా మారిపోయింది. రోడ్డున పడ్డ రైతన్నకు.. ప్రభుత్వంతో పోరాడే ఓపిక కూడా నశించిపోయింది. ఈ తరుణంలో అన్నదాతకు అండగా నిలిచేందుకు... రైతు గొంతుకై .. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వైఎస్సార్‌సీపీ నడుం బిగించింది. ‘అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ’ పేరుతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. శుక్రవారం ఉదయం.. 10 గంటలకు మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలునాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం రైతులతో కలిసి పార్టీ నేతలు, కార్యకర్తలు అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందించనున్నారు. – సాక్షి, అనకాపల్లి
Comments
Please login to add a commentAdd a comment