రైతన్నకు అండగా వైఎస్సార్‌సీపీ
అనకాపల్లి : వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు దీనావస్థలో ఉన్న రైతులకు అండగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు చెప్పారు. స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో అన్నదాతలకు దగా చేస్తున్న కూటమి సర్కార్‌పై నిరసన గళం గోడపత్రికలను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హా మీలను తక్షణమే అమలు చేయాలని, మొలకెత్తే ధాన్యం కొనుగోలు చేయాలని, ఎన్నికల సమయంలో రైతులకు పెట్టుబడికి సహాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాల యం వరకూ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేయడం తగదన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, వాటిపై ప్రజలు ప్రశ్నించకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మలసాల రమణారావు, మలసాల కుమార్‌రాజా,ఎంపీపీ గొర్లి సూరిబాబు, పార్టీ జిల్లా కార్యదర్శి జాజుల రమేష్, 80వ వార్డ ఇన్‌ఛార్జ్ కెఎం.నాయుడు, మండలపార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, రాష్ట్ర మాజీ గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment