ఎంవీపీకాలనీ: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురుషులు, మహిళల జిల్లా జట్ల ఎంపిక ఈ నెల 15న జరగనుంది. ఈ మేరకు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాదరెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏయూలోని బాస్కెట్‌బాల్ గ్రౌండ్ దరి ఓపెన్ గ్రౌండ్‌లో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎంపిక పోటీలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఇక్కడ ఎంపికై న జట్లు ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జరగనున్న 50వ రాష్ట్ర జూనియర్ అంతర్ జిల్లాల కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటాయని చెప్పారు. 2005 జనవరి 12 తర్వాత జన్మించిన 70 కిలోల లోపు బరువున్న పురుషులు, 65 కిలోల లోపు బరువున్న మహిళలు ఈ ఎంపికకు అర్హులని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment