సారెతో కదిలిన నారి
యలమంచిలి రూరల్: మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం యలమంచిలి పట్టణంలో కనకమహాలక్ష్మి అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు వివిధ రకాల మిఠాయిలు, పండ్లు తలపై పెట్టుకుని ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, కోలాటం ప్రదర్శన మధ్య ఉత్సవ విగ్రహంతో స్థానిక కోర్టు ప్రాంగణం నుంచి సీపీ పేట, సైతారుపేట రోడ్డు, ధర్మవరం, క్లబ్ రోడ్డు, ప్రధాన రహదారి, పాత ప్రభుత్వాస్పత్రి వీధుల మీదుగా ఊరేగింపు సాగింది. సారె ఊరేగింపును పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఊరేగింపు అనంతరం అమ్మవారి ఆలయం వద్ద 2 వేల మందికి అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు వెలవలపల్లి కోటేశ్వరశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కొటారు సాంబ, తాటిపాకల చిన్ని, తాటిపాకల మాణిక్యాలరావు, కొటారు కొండబాబు, మడగల సత్యనారాయణ, మడగల బాబూరావు, మజ్జి కనక, వి.గణపతి, కొటారు సూర్య ప్రకాష్, కసిరెడ్డి నాగు, కొటారు అచ్చియ్యనాయుడు, పిల్లా నాగు, మహిళలు పాల్గొన్నారు.
కనకమ్మకు భారీ సారె సమర్పణ
మేళతాళాల మధ్య యలమంచిలిలో ఊరేగింపు
Comments
Please login to add a commentAdd a comment