600 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం
కె.కోటపాడు: గవరపాలెం గ్రామ శివార్లలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం పులుపును శుక్రవారం ఎకై ్సజ్ పోలీసులు ధ్వంసం చేశారు. ముందస్తు సమాచారంతో గవరపాలెం శివారు చెరువు ప్రాంతంలో ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్ అప్పారావు సిబ్బందితో కలిసి తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా డ్రమ్ముల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లం పులుపును గుర్తించి ధ్వంసం చేశారు. నాటుసారా తాగడం వల్ల తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెడ్ కానిస్టేబుల్ అప్పారావు తెలిపారు. చట్టవ్యతిరేకంగా నాటుసారా తయారీకి పాల్పడే వారు పట్టుబడితే కఠిన శిక్షలు అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment