అక్రమంగా తరలిస్తున్న టేకు పట్టివేత
అటవీ అధికారులు సీజ్ చేసిన కలప వ్యాన్
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం వద్ద శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న టేకు కలప వ్యాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం రేంజర్ అందించిన వివరాల ప్రకారం.. కొండల అగ్రహారానికి చెందిన రైతు సుర్ల గౌరీశంకర్ తన సొంత వ్యవసాయ భూమిలో టేకు చెట్లను నరికి కటింగ్ నిమిత్తం మాకవరపాలెంలోని సామిల్లుకు తీసుకెళ్తున్నారు. ఈ తరలింపునకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. దీనిపై ముందుస్తు సమాచారం మేరకు మాకవరపాలెం పోలీసులు వ్యాన్‌ను అదుపులోకి తీసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. రూ.36 వేలు విలువ చేసే 26 టేకు దుంగలతో కూడిన వ్యాన్‌ను సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం రేంజర్ లక్ష్మీనర్సు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment