మీడియాపై దాడులు సరికావు
సీతమ్మధార : సాక్షి మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్ కడప జిల్లా వేముల మండల కేంద్రంలో నీటిసంఘాల ఎన్నికల ప్రక్రియ కవరేజ్‌కు వెళ్లిన సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామన్ రాము, సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని విశాఖ సాక్షి దినపత్రిక ప్రతినిధులు,పలు సంఘాల నాయకులు ఖండించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా జాయింట్ సెక్రటరీ పి.వేణుగోపాల్ మాట్లాడుతూ సాక్షి ప్రతినిధులపై దాడులు చేయ డం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఏపీ యూడబ్ల్యూజే) జిల్లా సహాయకార్యదర్శి కేటీ రామునాయుడు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకతను తెలియపరిస్తే కూటమి ప్రభుత్వం సహించలేకపో తోందని మండిపడ్డారు. సాక్షి డెస్క్ ఇన్‌చార్జి బీబీ సాగర్ మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచే మీడియా గొంతునొక్కాలన్న ప్రభుత్వ విధానాలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు. వైజా గ్ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ కార్యదర్శి నవాజ్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి చేయడం ద్వారా మీడియా గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారు. దచేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ సాక్షి బ్యూరో చీఫ్ కేజీ రాఘవేంద్రరెడ్డి, స్టాఫ్ రిపోర్టర్లు, డెస్క్ సభ్యులు, పలువురు విలేకరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో సాక్షి మీడియాపై కూటమి నేతలు దాడులు
ఖండించిన మీడియా ప్రతినిధులు,
జర్నలిస్టు సంఘాలు
Comments
Please login to add a commentAdd a comment