నేడు నీటి సంఘాలకుఎన్నికలు
● జిల్లాలో 300 నీటి సంఘాలకు నిర్వహణ
● మొత్తం ఓటర్లు 2,75,266 మంది రైతులు
సాక్షి, అనకాపల్లి: సాగునీటి సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 300 నీటి సంఘాలకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తాండవ మేజర్ ప్రాజెక్టు పరిధిలో 16, మీడియం ప్రాజెక్టులైన రైవాడ, కోనాం, పెద్దేరు రిజర్వాయర్ల పరిధిలో 28 మీడియం, 256 మైనర్ నీటి సంఘాలున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,060 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికలకు 1,876 మంది పోలింగ్ స్టాఫ్ నిర్వహించననున్నారు. మొత్తం 2,75,266 మంది రైతులు తమ ఓటు వినియోగించుకోనున్నట్లు జిల్లా నీటి సంఘాల ఎన్నికల నోడల్ అధికారి ఏ త్రినాథం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment