రైతులను కష్టపెట్టకండి
అన్నదాత సుఖీభవ పేరిట పెట్టుబడి సాయంగా ఇస్తామన్న రూ.20 వేలను తక్షణమే చెల్లించాలి. ఉచిత పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వం భరించాలి. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని భరించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దళారీ వ్యవస్థను రద్దు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి. వర్షాల వల్ల తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తేమ లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్బీకేలు ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలా ఆదుకున్నాం. కానీ ప్రస్తుతం 20 రోజులుగా కోతలు కోసి నూర్చి ధాన్యం కల్లాల్లో ఉంటే ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టలేదు.
–బూడి ముత్యాలనాయుడు,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment