గ్యాప్
గిరిజన ప్రాంతంలో కొండల మీదనున్న గ్యాప్ ఏరియా భూములను సర్వే చేసేందుకు 17 ఏళ్లుగా కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లడమే తప్ప సర్వే నేటికీ కార్యరూపం దాల్బలేదు. కలెక్టర్లు వస్తున్నారు.. గ్యాప్ ఏరియా భూములు సర్వే చేస్తారు.. మాకు హక్కు పత్రాలు ఇస్తారని.. ఏళ్లతరబడి ఎంతో ఆశతో గిరిజనులు ఎదురుచూస్తున్నారు.
నాతవరం :
ఏళ్ల తరబడి గిరిజనులు పోడు భూములకు హక్కు పత్రాల కోసం అందోళనలు చేస్తున్నారు. ఎంత మంది కలెక్టర్లు వచ్చి గ్యాప్ ఏరియా భూములు చూసినా లేట్‌రైట్ నిక్షేపాలు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉండడంతో కలెక్టరు సైతం ఏమి చేయలేని పరిస్ధితులు కన్పిస్తున్నాయి. మండలంలో సరుగుడు సుందరకోట పంచాయతీల పరిధిలో కొండల మీద ఉన్న వేలాది ఎకరాల భూములు బ్రిటిష్ హయాంలోనే సర్వే చేయకుండా వృధాగా వదిలేశారు. గ్యాప్ ఏరియా భూములను సర్వే చేసి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తామంటూ 2008 నుంచి కలెక్టర్లుగా పని చేసిన వారంతా ఈ ప్రాంతంలో క్షేత్రస్ధాయి పరిశీలనకు వచ్చారు.
మొదటిసారి అప్పటి జిల్లా జాయింట్ కలెక్టరు గిరీష్‌శంకర్ ఉమ్మడి సరుగుడు పంచాయతీలో పలు ప్రాంతాలను పరిశీలించారు. ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు , జాయింట్ కలెక్టర్లు , సబ్ కలెక్టర్లుగా పని చేసిన అనేక మంది ఐఏఎస్‌లు ఇక్కడ స్వయంగా పర్యటించారు. ప్రవీణ్‌కుమార్, లవ్‌అగర్వాల్, వినయ్‌చంద్, యువరాజ్, వేణుగోపాల్‌రెడ్డి, ఎ.మల్లిఖార్జున,రవిపట్టాన్‌శెట్టితో పాటు ప్రస్తుతం పని చేస్తున్న కలెక్టరు విజయకృష్ణన్ వరకు గ్యాప్ ఏరియా భూముల సర్వే కోసం స్వయంగా పరిశీలించారు. అయితే సర్వే విషయంలో అడుగు ముందుకు పడలేదు.
10వేల ఎకరాలకు పైగా...
సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం, అచ్చంపేట, యరకంపేట, రాజవరం, మాసంపల్లి, దద్దుగుల, సుందరకోట, పంచాయతీ శివారు కొత్తసిరిపురం, అసనగిరి, సుందరకోట, కొత్త దద్దుగుల, ముంతమామిడిలోద్దు, బమ్మిడికలోద్దు, తోరడ కోంత లంకలు, సిరిపురం గ్రామాలు ఉన్నాయి. ఆ రెండు పంచాయతీల పరిధిలో 10వేల ఎకరాల పైగా గ్యాప్ ఏరియా భూములు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో గిరిజనులు తుప్పలు డొంకలు కొట్టి పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. తాము సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఏళ్ల తరబడి గిరిజనులు అందోళనలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో గిరిజనుల డిమాండ్ మేరకు అప్పటి కలెక్టరు రవిపట్టాన్‌శెట్టి చొరవతో 800 మందికి పైగా పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు హక్కుపత్రాలు అందజేశారు. మరో 550 మందికి హక్కు పత్రాలు సిద్ధం చేసి సార్వత్రిక ఎన్నికల కారణంగా నిలిపివేశారు. ఇటీవల కలెక్టరు విజయకృష్ణన్ కొత్త దద్దుగుల ప్రాంతంలో గ్యాప్ ఏరియా భూములను స్వయంగా పరిశీలించి నెల రోజులు వ్యవఽధిలో సర్వే పూర్తి చేయాలని ఆర్డీవో వి.వి.రమణ, సర్వేయర్లను ఆదేశించారు. ఈ సర్వే ఎంతవరకు వస్తుందనేది వేచి చూడాల్సిందే. గ్యాప్ ఏరియా భూములు సర్వే చేసి రెవెన్యూ రికార్డులలో నమోదు చేస్తేనే గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడానికి వీలవుతుంది.
గత ప్రభుత్వంలో కొందరికి హక్కు పత్రాలు
గిరిజనులు సాగు చేసుకుంటున్న సాగు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని నేను ఉమ్మడి పంచాయతీ సరుగుడు సర్పంచ్‌గా ఉన్నప్పటి నుంచి విజ్ఞాపనలు అందజేస్తున్నాను. 2013లో కలెక్టరు యువరాజ్, జెసీ నివాస్‌ను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశాను. గత కలెక్టరు రవిపట్టాన్‌శెట్టి కృషితో కొంత మంది గిరిజనులకు హక్కుపత్రాలు ఇచ్చారు. పట్టాలు రావడానికి అప్పటి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విశేషంగా కృషి చేశారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొంత మందికి పట్టాలు సిద్ధం చేసినా అందివ్వలేకపోయాం.
–సాగిన లక్ష్మణమూర్తి ఎంపీపీ
38 ఏళ్లుగా ఎదురు చూపులు..
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని ఏళ్ల తరబడి అందోళనలు చేస్తున్నాం. గ్యాప్ ఏరియా భూములు సర్వే చేయాలని అంటున్నారు. కొత్తగా వచ్చిన ప్రతి కలెక్టరు, సబ్ కలెక్టరు సైతం గ్యాప్ ఏరియా భూములు చూడడానికి వస్తున్నారు తప్ప సర్వే జరగలేదు...హక్కు పత్రాలు ఇవ్వడం జరగలేదు. లేటరైట్ నిక్షేపాలు ఉన్నాయని అందువల్ల మాకు హక్కు పత్రాలు ఇవ్వలేదు సర్వే జరగలేదని అనుమానంగా ఉంది.
–బత్తుల కృష్ణ పీసా కమిటీ మాజీ కార్యదర్శి సుందరకోట
కొండల మీదనున్న గ్యాప్ ఏరియా భూములు
గ్యాప్ ఏరియాకు నడిచి వెళ్తున్న అప్పటి కలెక్టరు రవిపట్టాన్‌శెట్టి (ఫైల్)
ఇటీవల గ్యాప్ ఏరియా పరిశీలిస్తున్న
కలెక్టర్ విజయకృష్ణన్
అధికారులకు అంతు చిక్కని
గ్యాప్ ఏరియా భూములు
2008 నుంచి నేటి వరకు పరిశీలనతోనే సరిపెడుతున్న కలెక్టర్లు
సర్వే జరగదు... గిరిజనులకు హక్కు దక్కదు
16 గ్రామాల పాలిట శాపంగా మారిన లేటరైట్ నిక్షేపాలు
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా
అందని హక్కు పత్రాలు
బ్రిటిష్ హయాంలోనూ సర్వే జరగని వేలాది ఎకరాల గ్యాప్ ఏరియా భూములు
గ్యాప్
గ్యాప్
గ్యాప్
Comments
Please login to add a commentAdd a comment