ఈశ్వర భక్తి, శక్తి శాశ్వతం
ఏయూక్యాంపస్: అందం, ఆహారం, ఐశ్వర్యం శాశ్వతం కాదని.. ఈశ్వర భక్తి, శక్తి శాశ్వతమని మాజీ కేంద్రమంత్రి టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శతావధాని మాడుగుల నాగఫణి శర్మకు అవధాన బ్రహ్మ బిరుదును ప్రదానం చేశారు. ప్రముఖ సినీ హాస్యనటుడు బ్రహ్మానందం, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, శ్రీధర స్వామి తదితరులు ప్రసంగించారు. విశాఖ ప్రజల సంతోషాన్ని, అభివృద్ధిని కాంక్షిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంపై సుబ్బరామిరెడ్డిని అభినందించారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరాణిక నాటకం నగరవాసులను అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment