అనకాపల్లి : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఈనెల 27న అనకాపల్లి జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులు అందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.
3వ తేదీ నుంచి ఓపెన్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు
అనకాపల్లి : ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ ఇంటర్మీడియట్) పబ్లిక్ పరీక్షల మార్చి 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు డీఈవో గిడ్డి అప్పారావునాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థుల పరిధిలో సంబంధిత స్టడీ సెంటర్, లేదా ఏపీ సార్వత్రిక విద్యాపీఠం వెబ్ సైట్ www.apopenschool.ap.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment