
అనకాపల్లి యువతకు ఉద్యోగావకాశాలు
అనకాపల్లి: తన నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినట్టు వైఎస్సార్‌సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ అన్నారు. పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో సింగపూర్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీతో చర్చలు జరిగాయన్నారు. అక్కడ 20 మంది నిరుద్యోగ ఇంజనీర్లకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ఒక్కొక్క నిరుద్యోగిపై నెలకు రూ.లక్ష ఖర్చు చేశానన్నారు. తమ శక్తి కొద్దీ యువతకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రపంచంలో వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. త్వరలో నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశం నిర్వహించేందకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.