రూ. 20 లక్షల బీమా చెక్కు అందజేత | - | Sakshi
Sakshi News home page

రూ. 20 లక్షల బీమా చెక్కు అందజేత

Apr 12 2025 8:47 AM | Updated on Apr 12 2025 8:47 AM

రూ. 20 లక్షల బీమా చెక్కు అందజేత

రూ. 20 లక్షల బీమా చెక్కు అందజేత

బాధిత కుటుంబ సభ్యులకు

ప్రమాద బీమా చెక్కు అందిస్తున్న

ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ అధికారులు

దేవరాపల్లి: గరిశింగి పంచాయతీ శివారు చినగంగవరానికి చెందిన కోలా జోగిబాబు ఇటీవల మరణించడంతో దేవరాపల్లి ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ), ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌(ప్రమాద బీమా) కింద రూ.20 లక్షలు మంజూరైంది. ఈ మేరకు స్థానిక ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌లో రీజనల్‌ మేనేజర్‌ పి.చిరంజీవి వెంకటేష్‌, ఇతర బ్యాంక్‌ అధికారుల చేతుల మీదుగా రూ. 20 లక్షల ప్రమాద బీమా చెక్కును నామినీగా ఉన్న మృతుడి భార్య కోలా మణికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా రీజనల్‌ మేనేజర్‌ చిరంజీవి వెంకటేష్‌ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్య, జీవిత బీమా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ మేనేజర్‌, ఎంవీ రమణయ్య, నోడల్‌ అధికారి ఎస్‌.కె.సనవాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement