వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌ | YS Jagan Press Meet On May 21st 2026 Live News Updates And Speech Highlights In Telugu | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌

May 21 2026 10:21 AM | Updated on May 21 2026 1:40 PM

YS Jagan Press Meet May 21st 2026 News Live Updates

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుర్మార్గపు పాలనలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలోనూ ప్రజల గురించి ఆలోచించకుండా చంద్రబాబు స్కామ్‌లు చేసుకుంటూ పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  

బాబుకి బీపీ పెరుగుతోంది

  • ఇచ్చిన హామీలకూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు

  • ప్రజల బాగోగులను గాలికి వదిలేశారు

  • ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారు

  • రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌గా మార్చేశారు

  • రెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలి

  • ఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్‌ ఒక్కటే.. ‘‘చం‍ద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’

  • రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది

  • చంద్రబాబు మాత్రం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు

  • తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోంది

మావిగన్‌ అంటే చంద్రబాబుకి గుండె ఆగిపోయేలా ఉంది

  • చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ చేసుకున్న దురదృష్టం

  • ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారు

  • చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారు 

  • రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది

  • ఆచరణ సాధ్యం కాదని తెలిసినా ముందుకు వెళ్తున్నారు

  • స్కామ్‌ల కోసమే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు

  • ఇప్పటికే అమరావతి కోసం రూ.47, 387 కోట్ల అప్పుచేశారు

  • ఖజానా నుంచి రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు

  • స్కామ్‌ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారు

  • ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరుగుతోంది

  • రాజధాని ఉండాలనే మావిగన్‌ ప్రతిపాదించాం

  • రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్‌ను ప్రత్యామ్నాయంగా చూపించాం

  • అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలి

  • మావిగన్‌లో అన్నీ ఉన్నాయి

  • ప్రజలు కూడా మావిగన్‌కు మద్దతు పలికారు

  • అది తట్టుకోలేకనే చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు

  • తాను మాట్లాడిందే కాకుండా మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారు

అమరావతిలో విచ్చలవిడి దోపిడీనే

  • రూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌ ఉన్నా.. పర్మినెంట్‌ పేరిట మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారు

  • మళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే టెండర్లు కట్టబెట్టారు

  • కొత్తగా నిర్మిస్తున్న ఐదు బిల్డింగుల దోపిడీ చూసి జనం నివ్వెరపోతున్నారు

  • భవన డిజైన్లకే రూ.401 కోట్లు ఖర్చు చేశారు

  • ఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ. 20, 427 ఆ? పాత లెక్క రూ. 5వేల లోపే ఉంది

  • వాటి ఫర్నీచర్‌, ఇంటీరియర్‌ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే ఇప్పుడు చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందన్నమాట

  • ఫైవ్‌స్టార్‌ హంగులతో కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే అవుతుంది

  • తెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్‌ సచివాలయం కట్టారు

  • మన సెక్రటేరియట్‌కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు??

  • కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారు

  • అమరావతిలో రోడ్ల వ్యయం చూస్తే కళ్లు తిరుగుతాయి

  • కిలోమీటర్‌ ఖర్చు రూ.24 కోట్లు అవుతుందని కేంద్రమే చెప్పింది

  • అమరావతిలో కిలో మీటర్‌ ఖర్చు రూ.53 కోట్లు అవుతోంది

  • అమరావతిలో ప్లాట్ల స్కామ్‌ జరుగుతోంది

  • చంద్రబాబు తన మనుషులకు రోడ్ల పక్క భూములు ఇప్పించారు

  • సామాన్యులకు మాత్రం చెరువులు, కుంటల్లో ఇస్తున్నారు

  • 50 వేల ఎకరాలు సరిపోవని మళ్లీ లాక్కుంటున్నారు

  • ఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనే

  • వీటన్నింటిని ఆధారాలతో సహా బయటపెడితే చంద్రబాబుకి బీపీ వస్తోంది

చంద్రబాబూ.. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ?

  • మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి చనిపోతే మాపైనే బురద జల్లుతున్నారు

  • జాతరలో గొడవ వల్లే దస్తగిరి చనిపోయారని ఆయన భార్య చెప్పింది

  • టాపిక్‌ డైవర్ట్‌ చేసేందుకు కథలు అల్లుతున్నారు

  • వైఎస్సార్‌సీపీపై బుదర జల్లాలని చూస్తున్నారు

  • కల్పిత కథతో కేసు పెట్టి వైసీపీ వాళ్లనే అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారు

  • చంద్రబాబూ.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్‌ కల్చర్‌? ఎవరివి హత్యా రాజకీయాలు?

  • మా తాత, నాన్న, చిన్నాన్న ముగ్గురు చనిపోయారు.. మేం బాధితులం

  • మా తాత రాజారెడ్డి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే హత్యకు గురయ్యారు

  • మా తాతను చంపింది టీడీపీ వాళ్లు కాదా?

  • అధికార దుర్వినియోగం చేసి ఆ హంతకులను చంద్రబాబే రక్షించారు

  • మా నాన్న రాజశేఖర్‌రెడ్డి విషయంలోనూ అదే జరిగింది

  • అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని మా నాన్నను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు

  • తర్వాత 4 రోజులకే ఆయన హెలికాఫ్టర్‌ ప్రమాదంలో చనిపోయారు

  • అవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగులు చూడండి

  • మా నాన్న మృతి విషయంలో అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కావాల్సి ఉంది

  • మా చిన్నాన్న వివేకాను అవినాష్‌ చంపించాడంటూ ప్రచారం చేశారు

  • అవినాష్‌ కోసం వివేకా కృషి చేశారు

  • అలాంటి వివేకాను అవినాష్‌ చంపించారని బురద చల్లారు

  • చంపానని చెప్పిన దస్తగిరి ఇవాళ బయట దర్జాగా కార్లలో తిరుగుతున్నాడు

  • ఈ కేసులో నిందితుడైన దస్తగిరికి లాయర్‌.. చంద్రబాబు లాయర్‌ అయిన లూథ్రానే

  • క్రిమినల్‌ బ్రెయిన్‌ ఎవరిదో చంద్రబాబే చెప్పాలి

  • నందమూరి బాలకృష్ణ గన్‌తో ఇద్దరిని కాల్చేయలేదా?

  • ఎవరిది గన్‌ కల్చరో చెప్పాలి

  • ఈ కేసులో సాక్ష్యం దొరకకూడదని వాచ్‌మన్‌ను బండరాయితో కొట్టి చంపారు

  • హరికృష్ణ ప్రమాదంలో చనిపోతే పరామర్శకు వెళ్లి చంద్రబాబు కేటీఆర్‌తో పొత్తుల గురించి మాట్లాడారు

  • ఎవరివి శవ రాజకీయాలో చంద్రబాబు చెప్పాలి

  • రాజకీయ జీవితం ఇచ్చిన సొంతమామకే వెన్నుపోటు పొడిచారు

  • పేదల ఇళ్ల పట్టాల కోసం దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి వంగవీటి రంగాను నరికి చంపారు

  • ఈ కేసు ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే

  • ఎన్డీఆర్‌పై దాడి చేసి మల్లెల బాబ్జీ లాడ్జిలో శవమై తేలాడు

  • తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని బాబ్జీ జేబులో ఓ లెటర్‌ దొరికింది

  • మల్లెల బాబ్జీ కేసులో అసలు విచారణే జరగలేదు

  • చంద్రబాబుది రాక్షస రాజకీయం

  • విజయవాడలో ఎన్‌కౌంటర్‌ అనే పత్రిక పెట్టి టీడీపీ అవినీతిని ప్రశ్నించిన పింగళి ధశరథ్‌రామ్‌ దారుణ హత్యకు గురయ్యారు

  • ఈ హత్య కేసులోనూ వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపించాయి

  • బాబు గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలు రాశారు

  • చంద్రబాబు కుట్రలన్నీ దగ్గుబాటి అప్పుడే చెప్పారు

  • మాది విలువలతో కూడిన రాజకీయం

  • చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తుంటే.. మేం విలువలు, విశ్వసనీయతతో రాజకీయం చేస్తున్నాం

  • మా తాతను చంపిన వాళ్లు ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నారు.. మేం చెడ్డోళ్లమైతే వాళ్లు ఉండేవాళ్లా?

  • జగన్‌ నైజానికి ఇదే నిదర్శనం

  • చంద్రబాబులా మాకు హత్య రాజకీయాలు నేర్పించలేదు

  • చంద్రబాబుకి బహుశా ఇవే చివరి ఎన్నికలు

  • ఈ వయసులోనూ ఇలాంటి దౌర్భగ్యపు రాజకీయాలు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా?

స్కామ్‌ వాళ్లది.. కేసు మా నేతపైన

  • జంగిల్‌రాజ్‌లో హత్యారాజకీయాలు నడుస్తున్నాయి

  • ఈ రెండేళ్లలో వైఎస్సార్‌సీపీ వాళ్లను దారుణంగా చంపారు

  • వినుకొండలో రషీధ్‌ను నడిరోడ్డుపై నరికి చంపారు

  • చంద్రబాబుకు ఎప్పు ఇబ్బంది వచ్చినా అబద్ధం సృష్టిస్తారు

  • బాబు మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు

  • ఆయన హయాంలోనే కల్తీ మద్యం ఘటన జరిగింది

  • కానీ, మా పార్టీ నేత పేరును కేసులో చేర్చారు

  • టీడీపీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి అనుచరులు కల్తీ మద్యం చేస్తూ దొరికారు

  • చేసింది చంద్రబాబు అనుచరులతే కేసు మాత్రం ఈ దందాను బయటపెట్టిన జోగి రమేశ్‌ పై పెట్టారు

  • తప్పుడు కేసుతో 83 రోజులు జైల్లో పెట్టారు

  • బెయిల్‌పై బయటకు వస్తే యాసిడ్‌ బాటిల్స్‌ దాడి చేశారు

  • దాడికి పాల్పడిన వాళ్లకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారు

  • కల్తీ మద్యం కేసును ఎంత దారుణంగా మార్చారో అంతా చూశారు

మామిళ్లపల్లిలో తప్పు వాళ్లదే

  • మామిళ్లపల్లిలో పోలీసులు దౌర్జన్యం చేశారు

  • కాపు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు రైతులు గోడౌన్‌లో పంట నిలవ చేసుకున్నారు

  • మామిళ్లపల్లిలో ఎక్కడా తప్పు జరగలేదని వాళ్లకూ తెలుసు

  • అయినా గోడౌన్‌ అంబటి మురళిదని ప్రచారం చేశారు

  • గోడౌన్‌లోనూ వైఎస్సార్‌సీపీ జెండాలను టీడీపీవాళ్లే పెట్టారు

  • అక్రమంగా నిల్వచేశారని తప్పుడు కేసులు పెట్టారు

  • గోడౌన్‌ను కూడా సీజ్‌ చేశారు

  • గిట్టుబాటు ధర ఇస్తే రైతులు పంటను గోడౌన్‌లో ఎందుకు పెట్టుకుంటారు?

  • పరామర్శించేందుకు వెళ్లిన నేతలపై దౌర్జన్యం చేశారు

  • మహిళలపై కూడా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారు

ఏపీలో సోషల్‌ మీడియా సెన్సార్‌

  • ఏపీలో సోషల్‌ మీడియా పైనా కూడా ఆంక్షలు పెడుతున్నారు

  • ప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే అవకాశం లేదు

  • ప్రభుత్వ తప్పిదాలపై పోస్టులు పెడుతుంటే ఆ కంటెంట్‌ను కనపడకుండా చేస్తున్నారు

  • సోషల్‌ మీడియా కూడా సెన్సార్‌ చేస్తున్నారు

  • కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు

  • ఎఫ్‌ఐఆర్‌ చేసి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు పంపిస్తున్నారు

చంద్రబాబు పెట్రో మాయ

  • ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అన్నారు

  • పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని చెప్పి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు

  • 2015లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌తో పాటు, అలాగే డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్‌తో అదనంగా 4 రూపాయిలు పెంచారు

  • కోవిడ్‌లాంటి మహమ్మరి టైంలోనూ రోడ్‌ సెస్‌ కింద మేం పెంచింది రూపాయి మాత్రమే

  • కానీ, వైఎస్సార్‌సీపీ హయాంలో పెట్రోల్‌ రేట్లు అడ్డగోలుగా ఉన్నాయంటూ నానాయాగీ చేశారు

  • అప్పట్లో బాబు, లోకేష్‌, పవన్‌లు పొలిటికల్‌ డ్రామా చేశారు

  • ఎన్నికల టైంలో అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గిస్తాం అని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌లు ప్రకటించారు

  • టీడీపీ మేనిఫెస్టోలోనూ ఇంధన ధరల తగ్గింపు ఉంది

  • రెండేళ్లైనా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గలేదు

  • గత నెలలో బంకుల వద్ద బారులు తీరారు

  • ఇంధన సంక్షోభంలోనూ చంద్రబాబు స్కామ్‌లు చేస్తున్నారు

  • ఆ టైంలో అమరావతి కాంట్రాక్టర్లకు బల్క్‌ల్లో ఇప్పించాలని కోరారు

  • చంద్రబాబుకి చీవాట్లు పెడుతూ కేంద్రం లేఖ పంపింది

  • రిటైల్‌ బంకుల్లో ఎలా డీజిల్‌ అడుగుతారని చెప్పింది

  • ఆ టైంలోనూ ప్రజల గురించి కాకుండా కాంట్రాక్టర్ల గురించి ఆయన ఆలోచించారు

  • హామీలు నెరవేర్చకపోగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు

  • ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి ధరలు తగ్గించాలి

  • పెట్రోల్‌ లీటర్‌కు రూ.8 తగ్గించాల్సిందే 

మినిమమ్‌ డ్యూటీ మరిచిన పోలీసులు

  • పొదుపు చర్యల పేరుతో చంద్రబాబు ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారు

  • వాళ్లు మాత్రం విమానాల్లో తిరుగుతున్నారు

  • ఏపీలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్‌ అమ్ముతున్నారు

  • ఏ కాలేజీలో చూసినా గంజాయి కనిపిస్తోంది

  • రాష్ట్రంలో మాత్రం పోలీసులకు కనిపించడం లేదు

  • వ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారు

  • పోలీసులు కనీస విధులు కూడా మరిచిపోయారు

  • మా హయాంలో దిశ యాప్‌తో మహిళలకు రక్షణ కల్పించాం 


గ్రామాల్లో చంద్రబాబుపై ఆగ్రహం

  • చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దం.. మోసం

  • ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు

  • సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ మోసాలుగా తేలాయి

  • మా హయాంలోనీ పథకాలన్నీ నిలిపివేశారు

  • పొదుపు సంఘాల పరిస్థితి దారుణంగా ఉంది

  • పంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఇన్‌ఫుట్‌ సబ్సీడీ లేదు.. ఈ క్రాప్‌ లేదు

  • మొక్కజోన్న, పొగాకు, శనగ రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు

  • కేంద్రం ఇచ్చేది కాకుండా.. అన్నదాన సుఖీభవకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.. అంటే ప్రతీ రైతుకు రూ. 40 వేలు ఇవ్వాలి

  • ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ.1500 ఇస్తామన్నారు

  • నిరుద్యోగికి రూ.3 వేల భృతి అన్నారు.. అంటే ఈ రెండేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.72 వేలు బాకీ పడ్డారు

  • ఏపీలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు

  • 16 కేటగిరీల్లో ఐదింటికి మాత్రమే అనుమతించారు

  • ఇప్పుడు దానికి కూడా కోత పెడుతున్నారు

  • 12 డిపోలను ప్రైవేట్‌పరం చేశారు

  • ఆర్టీసీ బస్సుల స్థానంలో ప్రైవేట్‌ బస్సులు తెస్తారంట

  • ఎలక్ట్రిక్‌ బస్సులు తెచ్చి.. దానికి ఫ్రీ పథకం వర్తించదని చెబుతున్నారు

  • భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు.. ఆర్టీసీ ఉండదు

  • మా హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాం

  • బాబు హయాంలో 6 లక్షల పెన్షన్లు తొలగించారు

  • అమ్మ ఒడి పథకంలో 20 లక్షల మందికి కోత పెట్టారు

  • హామీలు అమలు చేస్తామని స్వయంగా బాండ్లు పంపిణీ చేశారు

  • గ్రామాల్లో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

  • ఆ హామీల సంగతి ఏమైందని చంద్రబాబును ప్రజలు నిలదీస్తున్నారు

  • ఉద్యోగులను దారుణంగా మోసం చేశారు

  • మా హయాంలో ఉద్యోగులకు ఏనాడూ ఇబ్బందులు కలగలేదు

సంతానమే సంపదట.. మరి లోకేష్‌ సంగతేంటి?

  • ముగ్గురిని నలుగురిని కనండి అంటూ చంద్రబాబు ప్రొత్సహిస్తున్నారు

  • రూ. 30 వేలు, రూ.40 వేలు నగదు ప్రొత్సాహకం ఇస్తామని మభ్యపెడుతున్నారు

  • సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ హామీల తర్వాతే ఆ మాట మాట్లాడమని ప్రజలు మొత్తుకుంటున్నారు

  • చంద్రబాబుకు ఒక్కడే కొడుకు.. లోకేష్‌కు ఒక్కడే కొడుకు

  • బాబు చెప్పేవి కనీసం ఆయన కొడుకు అయినా పాటించాలి కదా

  • ప్రజలు మాత్రం ముగ్గురు, నలుగురు కనాలట

  • వాళ్లు మంచి చదువుకోకూడదట

  • ఇదేం దిక్కుమాలిన ఆలోచన?

  • విద్య, వైద్యం, వ్యవసాయం ఏనాడూ మా హయాంలో మూలన పడలేదు

  • పిల్లలకు మేనమామలా మంచి చదవులు చదివించా

  • ఇవాళ.. కనీసం గోరుమద్దలు కూడా అందని పరిస్థితి

  • సరైన ఆహారం అందక ఆస్పత్రి పాలవుతున్నారు

  • వ్యవస్థలన్నీ ఇంత దారుణంగా, అద్వాన్నంగా ఉంటే.. పిల్లలు కనమని పిలుపు ఇవ్వడమేంటి?

  • మహిళలను పిల్లల్ని కనే మెషీన్లుగా చంద్రబాబు చూడడం దుర్మార్గం

  • కుటుంబాలు బాగుండాలంటే మహిళలు బాగుండాలి

యస్‌ లోకేస్‌.. బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌

  • బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌ అని లోకేష్‌ సినిమా డైలాగులు కొడుతున్నాడు

  • అవును.. బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌

  • వెన్నుపోటుతో పార్టీని లాక్కుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మీది

  • ప్రజామద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మాది

  • ప్రజలకు ద్రోహం.. వాడుకోవడం .. వదిలేయడం మీ క్యారెక్టర్‌

  • ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్‌

  • పనులు చేసి చూపించడం మా స్టైల్‌.. పబ్లిసిటీ చేసుకోవడం మీ స్టైల్‌

  • బటన్‌ నొక్కి ప్రజలకు డబ్బులు వేసిన చరిత్ర మాది

  • రెండేళ్లలో పథకాలు రద్దు చేసిన చరిత్ర మీది

  • విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం.. ప్రజల చెంతకు పాలన, మహిళా సాధికారికత, మహిళా రక్షణ.. వీటిని ఆచరణలో చూపించడం మేం చేశాం

  • అందుకే బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌

వైఎస్సార్‌సీపీ మీడియా ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్‌పై విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ..

  • ప్రజాస్వామ్యంలో  ఏది ఇస్తావో అల్టిమేట్‌గా అదే తిరిగి వస్తుంది

  • ప్రతీ పోలీసుకు విజ్ఞప్తి చేస్తున్నా

  • చంద్రబాబు ప్రలోభాలు, భయంతోనూ పోలీసులు పని చేయొద్దు

  • రేపు ప్రభుత్వం మారాక ఎంక్వైయిరీ ఉంటుంది

  • తప్పు చేసిన అధికారుల్ని చట్టం ముందు నిలబెడతాం

  • సప్తసముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. తీసుకొస్తాం
     

  • ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువగా ఉంటుంది కదా.. టీవీకే అధినేత విజయ్‌ వైఎస్‌ జగన్‌ ఫొటో పట్టుకోవడం, తమిళనాడు ఎన్నికల్లో విక్టరీ సాధించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు వైఎస్‌ జగన్‌ స్పందన

LIVE: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Advertisement
 
Advertisement
Advertisement