నష్టపరిహారం కోసం కొత్త బైపాస్ బాధితుల ధర్నా
కురబలకోట : మండలంలోని అంగళ్లు నుంచి కనసానివారిపల్లె మీదుగా వెళుతున్న హైవే బైపాస్‌పై భూ బాధితులు నష్టపరిహారం కోసం బుధవారం ధర్నా నిర్వహించారు. రోడ్డుకు అడ్డంగా రాళ్లు ఉంచి విశ్వం కళాశాల సమీంలో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఏడాది క్రితం కొత్త బైపాస్ కోసం సర్వే నంబరు 132,133లో భూములతో పాటు బోర్లు పోయాయన్నారు. రోడ్డు పనులు పూర్తయినా వాటికి ఇంత వరకు నష్టపరిహారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. దీంతో వారు కొత్త బైపాస్‌పై వాహనాల రాకపోకలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు తపస్విని, ఆర్‌ఐ బాల సుబ్రమణ్యం బాధిత రైతులతో మాట్లాడారు. ప్రతిపాదనలు వెళ్లాయని వచ్చే నెలాఖరులోగా నష్టపరిహారం సొమ్ము అందజేస్తామని హామీ ఇచ్చారు.
దీంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు. సర్వేయర్ భువనేశ్వరి, ఆర్‌అండ్‌బీ హైవే జేఈ పి. మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment