
యువకుడి ఆత్మహత్య
బి.కొత్తకోట : అనారోగ్య కారణాలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బి.కొత్తకోట పోకనాటి వీధిలో జరిగింది. ఆదివారం సీఐ జీవన్ గంగానాథ్‌బాబు వివరాలను వెల్లడించారు. బి.కొత్తకోటలో ఎలక్ట్రీషియన్‌గా పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్న మారెడ్డి ఉదయ్ (34) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీంతో శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఉదయ్ మృతితో పోకనాటివీధి రామాలయంలో జరగాల్సిన శ్రీరామనవమి వేడుకలను నిలిపివేశారు.
పిల్లలపై తేనెటీగల దాడి
మదనపల్లె సిటీ : స్థానిక బీటీ కాలేజీ మైదానంలో క్రికెట్ ఆడుతున్న యువకులపై తేనెటీగలు దాడి చేశాయి. గౌసియావీధికి చెందిన మహమ్మద్‌గౌస్‌తో పాటు మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. గ్రౌండ్‌లో ఉన్న వ్యక్తులు గమనించి వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు.
అదుపు తప్పి
లగేజీ వాహనం బోల్తా
సిద్దవటం : మండలంలోని భాకరాపేట సమీపంలోఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్ వద్ద ఆదివారం లగేజీ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. కడపకు చెందిన షాహీదర్బార్ హోటల్ వారికి పోరుమామిళ్లలో భోజనాల తయారీ ఆర్డర్ ఉండటంతో వారు కడప నుంచి లగేజీ వాహనంలో భోజనాలకు సంబంధించి కూరగాయలు, నూనె బియ్యం మరికొన్ని వస్తువులను వేసుకుని పోరుమామిళ్లకు బయలుదేరారు. సిద్దవటం మండలంలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్ వద్దకు రాగానే లగేజీ వాహనం డ్రైవర్ వినయ్ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపు తప్పడంతో లగేజీ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
మదనపల్లె సిటీ : కుటుంబ సమస్యల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మదనపల్లె మండలంలో ఆదివారం జరిగింది. కోళ్లబైలు పంచాయతీ జగన్ కాలనీకి చెందిన మహమ్మద్‌అలీ భార్య సుమియా(28) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య