
ప్రజా క్షేత్రంలో హుందాతనం ఉండాలి
రాయచోటి టౌన్ : ప్రజాక్షేత్రంలో హుందాతనం, జవాబుదారితనం ఉండాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రోజులుగా రాయచోటిలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్‌రెడ్డికి చెందిన కాంపౌండ్‌లో ఉన్న మెటీరియల్‌ను అక్రమంగా తరలించిన సంఘటన చాలా బాధాకరమన్నారు. రమేష్‌కుమార్‌రెడ్డి వీడియో క్లిప్పింగులతో సహా పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా వారిని అక్కడి నుంచి పంపించడం ఎంతవరకు సమంజసమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం చేసిన ఆరోపణల మేరకు రాయచోటి రింగ్ రోడ్డు గుండా అటు సుండుపల్లె, ఇటు బహుదా, వీరబల్లె నుంచి ఇసుక టిప్పర్లు వెళుతున్న విషయం వాస్తవం కాదా అన్ని ప్రశ్నించారు. వందలాది టిప్పర్లు పక్క రాష్ట్రాలకు తరలి వెళుతున్నాయన్నారు. ఐదేళ్లకు ఒకసారి ప్రజలు ఇచ్చే అవకాశం ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమేనన్నారు. రాచరికంలా వ్యవహరించకూడదని హితవు పలికారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి