
యాదవ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు
కడప సెవెన్‌రోడ్స్: ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు పొందిన, అలాగే ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించే యాదవ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నామని రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జి.నారాయణయాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించరాదని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివి ఉండాలన్నారు. విద్యార్థులు తమ బయోడేటా, మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్, ఆదాయ సర్టిఫికెట్, ఫోటోలను జతపరిచి పంపాలన్నారు. ఇతర వివరాలకు 94408 49234 , 94406 51405 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
వ్యవసాయంలో డ్రోన్ల
వినియోగం ఉండాలి
రాయచోటి టౌన్: ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం తప్పక ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్రానాయక్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో డ్రోన్లు ఎలా ఉపయోగించాలో టెక్నీషియన్లకు అవగాహన కల్పించారు. అనంతరం చంద్రానాయక్ మాట్లాడుతూ డ్రోన్ ద్వారా ఒక ఎకరం పొలంలో పది నిమిషాలలో పురుగుమంది పిచికారీ చేయొచ్చన్నారు. కూలీల ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. జిల్లాకు 34 డ్రోన్లు 80 శాతం సబ్సిడీతో అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌ఎండీ ఆంజనేయులు, యూనియన్ బ్యాంక్ సీనీయర్ మేనేజర్ పి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.