చల్లగా చూడమ్మా.. గంగమ్మా | - | Sakshi

చల్లగా చూడమ్మా.. గంగమ్మా

May 2 2025 1:11 AM | Updated on May 2 2025 1:11 AM

చల్లగ

చల్లగా చూడమ్మా.. గంగమ్మా

రైల్వేకోడూరు అర్బన్‌: ప్రజలు చల్లగా ఉండేలా దీవించాలని గంగమ్మను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వేడుకున్నారు. రైల్వేకోడూరులో నిర్వహించిన గంగమ్మ జాతరలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి ఎంపీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఎంపీ, మాజీ ఎమ్మెల్యేను సత్కరించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన కోడూరు గంగమ్మను దర్శించుకోవడం ఎంతో అదష్ఠమని తెలిపారు. రైతులు, పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాక్షించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రామిరెడ్డిధ్వజారెడ్డి, ఉపసర్పంచ్‌ తోటశివసాయి, సీహెచ్‌రమేష్‌, జిల్లా యువజన అధ్యక్షుడు శివారెడ్డి, తల్లెంభరత్‌కుమార్‌రెడ్డి, గునిశెట్టిరమేష్‌, మేడావెంకటసుబ్బయ్య, బుడుగుశివయ్య, డీవీరమణ తదితరులు హాజరయ్యారు.

కోడూరు గంగమ్మను దర్శించుకొన్న ఎంపీ

చల్లగా చూడమ్మా.. గంగమ్మా 1
1/1

చల్లగా చూడమ్మా.. గంగమ్మా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement