Horoscope: ఈ రాశి వారికి అంత మంచే జరుగుతోంది | Daily Horoscope Aug 31 2024 Telugu Rasi Phalalu Today | Sakshi
Sakshi News home page

Horoscope: ఈ రాశి వారికి అంత మంచే జరుగుతోంది

Published Sat, Aug 31 2024 6:52 AM | Last Updated on Sat, Aug 31 2024 10:40 AM

Daily Horoscope Aug 31 2024 Telugu Rasi Phalalu Today

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.త్రయోదశి తె.3.53 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి చతుర్దశి, నక్షత్రం: పుష్యమి రా.9.18 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.5.41 నుండి 7.25 వరకు, అమృతఘడియలు: ప.2.40 నుండి 4.20 వరకు, శనిత్రయోదశి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.48, సూర్యాస్తమయం: 6.15. 

మేషం: టుంబ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో ఆటంకాలు.
విలువైన వస్తువులు జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారులకు అంతగా లాభాలు అందవు. ఉద్యోగులకు విధుల్లో ఒడిదుడుకులు. .

వృషభం: దూరప్రాంతాల నుంచి ముఖ్యసమాచారం. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారులు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. రాబడి తగ్గి అప్పులు చేస్తారు. బంధువులతో విభేదాలు.
అంచనాలు తారుమారు. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో చిక్కులు.

కర్కాటకం: నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు.ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.వాహన, గృహయోగాలు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: అనుకోని ప్రయాణాలు. రాబడి తగ్గి అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు.ఆరోగ్యభంగం. సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.

కన్య: కార్యజయం. ఆహ్వానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.అనుకున్న రాబడి ఉంటుంది. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

తుల: దూరపు బంధువుల కలయిక. శుభకార్యాల రీత్యా ఖర్చులు.కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు చిక్కులు తొలగే సమయం..

వృశ్చికం: బంధుమిత్రుల నుంచి విమర్శలు. అనుకోని ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  వివాదాలు.  ఆస్తి వివాదాలు నెలకొంటాయి. దైవదర్శనాలు.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో చికాకులు. వాహనాలు, ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. .

మకరం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆశించిన డబ్బు సమకూరుతుంది.భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. .

కుంభం: ఉద్యోగప్రయత్నాలు కలిసివస్తాయి. బంధువులతో తగాదాలు తీరతాయి. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఉత్సాహం.

మీనం: కార్యక్రమాలలో ఆటంకాలు. బంధుగణం నుంచి విమర్శలు. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగాల్లో శ్రమ. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. .
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement