తెనాలి రూరల్: మద్యం దుకాణాలలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు స్పష్టం చేశారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వి.అరుణకుమారితో కలిసి శుక్రవారం ఆయన తెనాలి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలన్నారు. బెల్టు షాపులు పెడితే సహించేది లేదని చెప్పారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌విక్రయిస్తూ పట్టుబడితే మొదటి తప్పు కింద రూ. 5 లక్షల జరిమానా విధిస్తామని, రెండో సారి పట్టుబడితే లైసెన్సు రద్దు చేసి దుకాణాన్ని ఇతరులకు కేటాయిస్తామని చెప్పారు. జనవరి ఒకటో తేదీ నుంచి గురువారం వరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తమ శాఖ 2,687 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 2,501 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కొత్త పాలసీ వచ్చిన అక్టోబరు 16వ తేదీ నుంచి గురువారం వరకు 235 కేసులు నమోదు చేసి 215 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఎకై ్సజ్ సీఐలు తమ పరిధిలోనే కాకుండా ఇతర సీఐల పరిధిలోనూ బెల్టు షాపుల తనిఖీలు చేసేందుకు ఉన్నతాధికారులు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ ఎం. యశోదర దేవి, సబ్ ఇన్‌స్పెక్టర్ టి. ఫణికుమార్, ఆర్. శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment