బకాయిలు చెల్లింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలి
ఇంకొల్లు (చినగంజాం): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలపై శ్వేతపత్రం ప్రకటించి వాటి చెల్లింపుకు నిర్ధిష్టమైన ప్రణాళిక ప్రకటించాలని యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్ పాపారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకొల్లు జెడ్పీ హైస్కూల్‌లో ఇంకొల్లు మండల యూటీఎఫ్ కౌన్సిల్ ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఎన్నికల పరిశీలకుడిగా హాజరైన పాపారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనులను తగ్గించి, యాప్‌లను బారినుంచి విముక్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. యూటీఎఫ్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంఘంలో పనిచేసిన నాయకులను సన్మానించారు. పీవీ సుబ్బారావు, కే జే జయరాజ్, ఆవుల హనుమంతరావు, కరి కమలేశ్వరరావు, కే వీరాంజనేయులు, వీ ఉదయకుమారి, యం రాఘవరావు, రిటైర్ కాబోతున్న సీహెచ్ హనుమంతరావు, వీ సుబ్బారావు, ఎన్ శోభారాణిలను సన్మానించారు.
ఇంకొల్లు మండల శాఖ ఎన్నిక..
అనంతరం యూటీఎఫ్ మండల శాఖ కార్యవర్గం ఎన్నికల్లో గౌరవాధ్యక్షుడిగా ఎన్ సమత, అధ్యక్షుడిగా పీ సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా వీ శ్రీమన్నారాయణ, జే అనిత, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌కే మస్తాన్‌వలి, కోశాధికారిగా ఎం మాధవ, కార్యదర్శులుగా టీ వాణీశ్రీ, టీ స్రీనివాసరావు, కే శ్రీనివాసరావు, యం శ్రీనివాసులు,పీ చంద్రారెడ్డి, ఎస్ మస్తాన్ సాహెబ్, జిల్లా కౌన్సిలర్‌లుగా వీవీ సుబ్బారావు, శివరామకృష్ణ ప్రసాద్, వివిధ కమిటీల కన్వీనర్‌లుగా కే సురేష్, కే పుష్పావతి, పీ పావని, కే సునీల్ కుమార్, జే గోపికృష్ణ, ఎస్ ప్రభావతి, వీ హనుమాయమ్మ, కే రాజశేఖర్‌లు ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment