శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024
బాపట్లటౌన్: సూర్యలంక తీరంలో ఏర్పాటుచేసిన శివాలయానికి తారకేశ్వరస్వామి గుడిగా నామకరణ చేసేంది తానేనని శ్రీశృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీస్వామి తెలిపారు. విజయ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం బాపట్ల మండలంలోని సూర్యలంక సమద్రతీరానికి చేరుకున్న విధుశేఖర స్వామి తారకేశ్వరస్వామి గుడిని సందర్శించారు. తొలుత ముత్తాయపాలెంలోని అభయ ఆంజనేయస్వామి గుడి వద్ద స్వామికి క్షీరాభిషేకం చేసి హారతి ఇచ్చారు. తారకేశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం విధుశేఖరస్వామి తారకేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అనుగ్రహభాషణం చేశారు. భవిష్యత్‌లో ఈ ఆలయానికి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ప్రాచీన కాలం తర్వాత పూర్తిగా రాతితో నిర్మించిన ఆలయం ఇదని పేర్కొన్నారు. ప్రాచీన శిల్పకళ ఉట్టి పడేలా ఈ గుడి నిర్మాణం జరగడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు, వేదపండితులు పాల్గొన్నారు.
● తారకేశ్వరస్వామి గుడిగా నామకరణం చేసింది నేనే ●
● శ్రీవిధుశేఖర భారతీస్వామి వెల్లడి
● తారకేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
న్యూస్‌రీల్
శ్రీవిధు శేఖర భారతి.. విజయ హారతి
Comments
Please login to add a commentAdd a comment