సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు

Published Sat, Nov 23 2024 10:02 AM | Last Updated on Sat, Nov 23 2024 10:02 AM

సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు

సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోని సాగునీటి సంఘాల వ్యవస్థను మళ్లీ కూటమి సర్కారు ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తోంది. డిసెంబరు రెండో వారంలో ఎన్నికలకు ముహూర్తం నిర్ణయించారు. వీటి నిర్వహణకు ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కృష్ణాడెల్టా పరిధిలోని పశ్చిమ డెల్టాలోనూ ఇందుకు సంబంధించిన సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి.

తెనాలి: కృష్ణా పశ్చిమ డెల్టాలో 5.71 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నపుడు గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఇది ఉండేది. అత్యధికం తెనాలి డివిజనులోనే ఉంది. జిల్లాల విభజన అనంతరం ఇప్పుడు పశ్చిమ డెల్టా పరిధి గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు విస్తరించింది. ఆ ప్రకారం ఇప్పుడు సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.

పశ్చిమ డెల్టాలో మొత్తం 144 సంఘాలుగా నిర్ణయించారు. వీటిలో గుంటూరు జిల్లాలో 50, బాపట్ల జిల్లాలో 92, ప్రకాశం జిల్లాలో రెండు చొప్పున ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు 20 కాగా, జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 14 ఉన్నాయి. గుంటూరు చానల్‌ పరిధిలో మరో 14 సాగునీటి సంఘాలు, రెండు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయి. వీటిన్నింటిపై ప్రాజెక్టు కమిటీ ఉంటుంది. సాగునీటి సంఘాల ఎన్నికలకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి పర్యవేక్షిస్తారు. మూడు జిల్లాలకు ముగ్గురు నోడల్‌ అధికారులను నియమించారు. జిల్లాకు జలవనరుల శాఖ గుంటూరు ఈఈ కె.రమేష్‌, బాపట్లకు గుంటూరు జిల్లా ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ఇంజినీరు పులిపాటి వెంకటరత్నం, ప్రకాశం జిల్లాకు జలవనరుల శాఖ ఏఈ శంకరరావు నియమితులయ్యారు. సాగునీటి సంఘాలకు డిసెంబరు నెల 5వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 8న సాగునీటి సంఘాలకు, 11న డిస్ట్రిబ్యూటరీ సంఘాలకు 14న ప్రాజెక్టు కమిటీకి ఎన్నికలను నిర్వహిస్తారు. సాగునీటి సంఘాల ఎన్నికలు రెండు విభాగాలుగా జరుగుతాయని అధికారులు తెలియజేశారు. ఉదయం టీసీ సభ్యుల ఎన్నిక (ప్రాదేశిక సభ్యులు) నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయా సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.

ఇవీ నిబంధనలు

18 ఏళ్లు ఆపై వయసు కలిగినవారు పోటీ చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు, పారితోషికాలు పొందేవారు కూడా పోటీకి అనర్హులు. ఎన్నికల్లో పోటీ చేసేవారు నీటి శిస్తు చెల్లించి ఉండాలనే నిబంధన ఉంది. ఇక ఎన్నికలను మూడు విధాలుగా జరుపుతారు. తొలుత అభ్యర్థులను అక్షరమాల ప్రకారం వరుస క్రమాన్ని నిర్ణయిస్తారు. ముందుగా ఏకగ్రీవం అవుతుందేమో చూస్తారు. లేకుంటే అభ్యర్థుల వరుసక్రమం ప్రకారం తొలి అభ్యర్థిని వేదికపైకి పిలిచి చేతులు పైకెత్తే విధానంలో ఎన్నిక నిర్వహిస్తారు. ఎవరికి ఎక్కువ మంది మద్దతునిస్తే వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ఈ విధానం వీలుపడకపోతే రహస్య బ్యాలెట్‌ను అనుసరిస్తారు. ఓటు వేసే రైతులకు పట్టాదారు పాసు పుస్తకం లేకపోయినా హక్కును నిరాకరించరు. ఓటరు కార్డు, ఆధార్‌ కార్డు లేదా ఏ ఇతర గుర్తింపు కార్డుతోనైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.

డిసెంబరులో నిర్వహణకు సన్నాహాలు

సంబంధిత అధికారులు,

సిబ్బందికి శిక్షణ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement