తెనాలిరూరల్: రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి చెందిన ఘటన తెనాలి మండలం ఖాజీపేట వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు ..... కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన అవుతు రవీంద్రరెడ్డి(50) తన కుటుంబంతో పెదకాకాని మండలం నంబూరులో రఉంటున్నాడు. తన పిన్నమ్మ మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు స్వగ్రామానికి భార్య సురేఖ, కొడుకు హర్షవర్ధన్‌రెడ్డి(19)తో కలిసి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బైక్‌పై వెళుతున్న వీరిని ఖాజీపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో హర్షవర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన రవీంద్రరెడ్డిని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. రవీంద్రరెడ్డి భార్య సురేఖ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఘటనాస్థలాన్ని రూరల్ పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment