జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో ఏపీ బాలికల సత్తా
యడ్లపాడు: జాతీయస్థాయి బాలికల షూటింగ్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఘన విజయం సాధించి బంగారు పతకాన్ని కై వసం చేసుకుంది. ఈనెల 7 8 9వ తేదీలలో అనంతపురం జిల్లా నార్పాలలోని నేతాజీ జెడ్పీ హైస్కూల్‌లో జరిగిన 43వ జాతీయస్థాయి షూటింగ్ బాల్ చాంపియన్‌షిప్ పోటీలు రసవత్తరంగా సాగాయి. ఈ పోటీల్లో మహారాష్ట్ర జట్టుపై ఏపీ బాలికల జట్టు అత్యుత్తమ ప్రతిభను చాటి చాంపియన్‌షిప్‌ని కై వసం చేసుకుంది. స్టేట్ టీం సెలక్షన్‌కు కారుచోల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థులు పాల్గొనగా వారిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని లుక్క అక్షిత రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించింది. పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన అక్షితను, బాలికకు శిక్షణ ఇచ్చిన పాఠశాల పీడీ రమాదేవి బాయిలను మంగళవారం పాఠశాలలో అభినందించారు. అభినందించిన వారిలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామ పెద్దలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment