పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం
నరసరావుపేట: నిరంతరం ప్రజా రక్షణ కోసం పాటుపడే పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన ఇద్దరి పోలీసు కుటుంబాలకు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఏడాది అక్టోబరులో ఏఆర్ విభాగంలో పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎన్.వెంకటేశ్వర్లు భార్య యల్లమ్మకు పోలీసు అసోసియేషన్ తరఫున రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. అదే నెల 30న గుండెపోటుతో మరణించిన పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సందేపోగు శ్యామ్ ప్రసాద్ భార్య నిర్మలాదేవికి మరో రూ.లక్ష చెక్కును అందజేశారు. ఏఆర్ అదనపు ఎస్పీ సత్తిరాజు, ఏఏవో కేవీడీ రామారావు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.మాణిక్యాలరావు పాల్గొన్నారు.
రెండు కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం
అందజేసిన పల్నాడు అదనపు ఎస్పీ సంతోష్, అధికారులు
Comments
Please login to add a commentAdd a comment