క్రోసూరు: అనంతవరం గ్రామంలో తేళ్ళురి ముసలా రెడ్డి వరి పొలంలో వ్యవసాయ శాఖ అధికారులు పంటకోత ప్రయోగాలను మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి పాల్గొన్నారు. వరిలో 5 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు గల విస్తీర్ణంలో ఉన్న వరి దుబ్బులను కోసి, నూర్చగా 13.5 కిలోల పచ్చి ధాన్యం దిగుబడి వచ్చిందని, ఇది ఎకరాకు 29 బస్తాలకు (75 కిలోలు)తో సమానమని తెలియజేశారు. పంట కోత ప్రయోగాల నిర్వహణ విషయంలో రైతు సేవ కేంద్ర సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏమాత్రం అలసత్వం వహించినా దేశ ఉత్పత్తిలో దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, దిగుబడిని లెక్కించే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment