రాష్ట్ర క్యారమ్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
గుంటూరు వెస్ట్(క్రీడలు): చిత్తూరులో ఇటీవల ముగిసిన ఆంధ్ర రాష్ట్ర 3వ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని ఆంధ్రా క్యారమ్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో వెటరన్ మహిళల విభాగంలో కెజియా జవహర్‌కు బంగారు, వెటరన్ పురుషుల్లో వి.వెంకటేశ్వర్లుకు రజతం, పాల్ సుధాకర్‌కు కాంస్యం, పురుషుల విభాగంలో జి.జయకుమార్‌కు కాంస్య పతకాలు దక్కాయన్నారు. విజేతలను ఆంధ్రా క్యారమ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డీఆర్ నీరజ్ కుమార్ సంపతి, చీఫ్ ప్యాట్రన్ యాగంటి దుర్గారావులతోపాటు జిల్లా కమిటీ సభ్యులు అభినందించారని పేర్కొన్నారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తాం
గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి
తాడేపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతు సేవా కేంద్రాల ద్వారా నియమ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం దుగ్గిరాల గ్రామంలో ఏఓ శిరీషతో కలిసి ఆయన పర్యటించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ధాన్యం నింపేందుకు గోతాలు, రవాణాకు వాహనాలు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. ఏఈఓలు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.
రోలర్ స్కేటింగ్ పోటీల్లో జెస్సీరాజ్‌కు రజతం
మంగళగిరి: రోలర్ స్కేటింగ్ 62వ జాతీయ చాంపియన్ షిప్ పోటీల్లో మంగళగిరికి చెందిన క్రీడాకారిణి మాత్రపు జెస్సీరాజ్ సత్తా చాటి రజత పతకం సాధించింది. తమిళనాడు రాష్ట్రం పొలాచి నగరంలోని కేశవ విద్యామందిర్ స్కేటింగ్ పార్క్‌లో స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 5 నుంచి 10 వ తేదీ వరకు పోటీలు జరిగాయి. జెస్సీరాజ్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించి రజత పతకం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు జెస్సీరాజ్‌కు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment