లైంగిక దాడి కేసులో నిందితుడు అరెస్ట్
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని కొత్తూరులో నివాసముండే ఓ మహిళపై ఉద్దేశపూర్వకంగానే యువకుడు లైంగిక దాడి చేశాడని, నిందితుడు చెబుతున్నట్లుగా క్షణికావేశంలో జరిగింది కాదని నార్త్‌జోన్ డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ట్రైనింగ్ డీఎస్పీ భార్గవి, తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజులతో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఆదివారం అర్ధరాత్రి తాడేపల్లి పట్టణానికి చెందిన తెంపర్ల రామారావు తన స్నేహితుడి తల్లిపై లైంగికదాడికి పాల్పడ్డాడన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి బాధితురాలి కుమారుడికి, రామారావుకు మధ్య స్నేహం ఉందన్నారు. తన స్నేహితుడు ఇంట్లో లేని విషయం తెలుసుకున్న రామారావు అతని తల్లిపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. ఈ కేసులో పోలీసులు ఎటువంటి జాప్యం చేయలేదని, ఆ మహిళ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని చెప్పారు. వెంటనే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌కు జరిగిన సంఘటన వివరాలు తెలియజేశామని వివరించారు. తర్వాత బాధిత మహిళ ఇంటికి వెళ్లి ఆధారాలు సేకరించినట్లు వెల్లడించారు. అనంతరం కేసు కూడా నమోదు చేశామని తెలిపారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. నిందితుడు రామారావును రెండు గంటల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసులో వివరాలు సేకరించేందుకు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు, ట్రైనింగ్ డీఎస్పీ భార్గవి, ఇతర సిబ్బంది ఎంతో శ్రమించారని ఆయన అన్నారు.
మహిళపై ఉద్దేశపూర్వకంగానే లైంగిక దాడి
కేసు నమోదులో ఎటువంటి అలసత్వం లేదు
నార్త్‌జోన్ డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment