సౌత్ ఇండియా టెన్నిస్ టోర్నీలో పల్నాడు చిన్నారి ప్రతిభ
నరసరావుపేట: విశాఖపట్నం నగర పరిధిలోని మధురవాడ సాయి ప్రియా లే అవుట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లే అవుట్ గృహ సముదాయంలో ఆదివారం నిర్వహించిన సౌత్ ఇండియా జూనియర్ హార్డ్ టెన్నిస్ చాంపియన్ షిప్ పోటీలో నరసరావుపేట పట్టణానికి చెందిన పి.సూక్తిశ్రీ అండర్–10 విభాగంలో ప్రతిభ చాటి విన్నర్‌గా నిలిచిందని కోచ్ బి.బాబునాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అండర్–9 నుంచి అండర్–14 విభాగాల్లో 80 మంది బాల బాలికలు పాల్గొనగా, అందులో సూక్తిశ్రీ ప్రతిభ చాటి విన్నర్‌గా నిలిచిందని పేర్కొన్నారు. పట్టణానికి చెందిన డాక్టర్ పి.శ్రీనివాస్, డాక్టర్ సురేఖ దంపతుల కుమార్తె సూక్తిశ్రీ ప్రకాష్‌నగర్‌లోని సీబీఐటీ స్కూలులో ఆరో తరగతి చదువుతూ గత నాలుగేళ్లుగా ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ వెనుకవైపు గల ఆపీసర్స్ క్లబ్ ప్రాంగణంలో కోచ్ బుక్యా బాబూ నాయక్ వద్ద శిక్షణ పొందుతోంది. తండ్రి డాక్టర్ శ్రీనివాస్ ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయిలో జరిగిన టెన్నిస్ పోటీలకు హాజరైంది. ిసీబీఐటీ స్కూల్ డైరెక్టర్ యోగిరెడ్డి, ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు సూక్తిశ్రీని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment