పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి
నరసరావుపేట: పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య (ఎంసీపీఐయూ) పల్నాడు జిల్లా కార్యదర్శి రెడ్ బాషా డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట మంగళవారం ఎంసీపీఐయూ, ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ (ఏఐకేఎఫ్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రెడ్ బాషా మాట్లాడుతూ సర్దుబాటు చార్జీలు, ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులపై మోపిన భారాన్ని, స్మార్ట్ మీటర్ల ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో కార్యాలయంలో అందజేశారు. ఏఐకేఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి తూమాటి మణి కంఠేశ్వరరావు, పట్టణ నాయకులు మహబూబ్ బాషా, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు షేక్ సైదా, ఓల్డ్ గన్ని వర్కర్స్ యూనియన్ నేత గుంటూరు బాజీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment