హనుమంతుడి నుంచి ఎన్నో జీవిత పాఠాలు
చీరాల అర్బన్: హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌పీఎం హైస్కూల్ గ్రౌండ్‌లో స్థానిక పాపరాజుతోటలోని వీరాంజనేయస్వామి దేవాలయం ఆధ్వర్యంలో హనుమత్ వైభవంపై రెండు రోజులు ఆధ్యాత్మిక ప్రవచనాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రవచనంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. హనుమంతుడంటే ధైర్యానికి మారు పేరని, అందుకే ఎన్నో గొప్ప గుణాలు కలిగిన హనుమాన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయన్నారు. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడని, అంతటి గొప్పకార్యం ఆయన ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. దీని ద్వారా అతని ఓర్పు, నిలకడ స్వభావాన్ని తెలుసుకోవచ్చన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి ఎన్ని కష్టాలనైనా ఓర్పుతో ఓర్చుకునే గొప్ప లక్షణం హనుమంతుడికి ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సతీసమేతంగా పాల్గొని, చాగంటిని సన్మానించారు. చీరాల పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవాలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు హనుమత్ వైభవంపై ప్రవచనాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment